చింతపల్లి పోలీస్‌స్టేషన్ ముందు ప్రహరీని కూల్చి చదును చేస్తున్న జేసీబీ
చింతపల్లి: నల్లగొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించేందుకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎస్‌ఐలు పోటీ పడుతుంటారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై ఉన్న చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు అంత క్రేజి ఏర్పడింది. అంతా శుభం అనుకొని డ్యూటీలో జాయిన్ అ యిన ఎస్‌ఐలు కొన్ని నెలలకే అనూహ్యంగా వివా దాలతో బదిలీ అవుతున్నారు.
ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పది నెలల వ్యవధిలో పదకొండు మంది ఎస్‌ఐలు వేర్వేరు కారణాలతో బదిలీ అయ్యారు. దీంతో చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషం పట్టుకుందని భావించిన అధికారులు.. తాజాగా స్టేషన్ ముందు భాగాన్ని కూల్చివేశారు.
క్లిన్‌చిట్‌తో వచ్చి.. వివాదాలతో..
చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు ఎస్‌ఐగా పని చేసేందుకు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో క్లీన్ చిట్‌తో స్టేషన్ ఎస్‌ఐగా వచ్చిన పలువురు అనుకోకుండా పలు కేసుల్లో జోక్యం చేసుకోవడం, భూ తాగాదాల్లో తలదూర్చడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేసిన పలువురు ఎస్‌ఐలు వివాదాలతో బదిలీ అవుతున్నారు.
వాస్తు దోషం ఎఫెక్ట్
చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన పలువురు ఎస్‌ఐలు వివాదాలతో బదిలీ అవుతుండడంతో ఇక్కడి స్టేషన్‌కు వాస్తు దోషం భయం పట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం చింతపల్లి పోలీస్ స్టేషన్‌లోని ముందు భాగాన్ని కూల్చిన అధికారులు వాస్తు దోషాన్ని సరిచేసే పనిలో ఉండడం గమనార్హం. ఏదేమైనా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలనుకునే ఎస్‌ఐలకు వరుసపెట్టి చోటు చేసుకుంటున్న ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment