అనంతలో ఘోర ప్రమాదం.. వాగులో దూసుకెళ్లిన కారు | Car Accident Tragedy In Anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో ఘోర ప్రమాదం.. వాగులో దూసుకెళ్లిన కారు

Published Wed, Dec 29 2021 8:10 PM | Last Updated on Wed, Dec 29 2021 8:58 PM

Car Accident Tragedy In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విడపనల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వాగులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ తీసిన గుంతలో కారు చిక్కుకుంది. కారులో ఐదుగురు ఉన్నట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement