ఆధునిక టెక్నాలజీ గల తడానో క్రేన్
ఖైరతాబాద్: శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు జర్మన్ టెక్నాలజీ.. తడానో కంపెనీకి చెందిన ఆధనిక క్రేన్‌ను వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్ ఇదొక్కటే కావడం విశేషం. ఈ క్రేన్ 400 టన్నుల బరువును 60 మీటర్లు పైకి ఎత్తుతుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు ఒక్కో టైరు టన్ను బరువు గల 12 టైర్లు ఉన్నాయి. క్రేన్ సామర్థ్యం 72 టన్నులు కాగా 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ సాయంతో నిమజ్జన మహత్‌కార్యాన్ని పూర్తి చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం రెండోసారి కలగినందుకు సంతోషంగా ఉందని క్రేన్ ఆపరేటర్, పంజాబ్‌కు చెందిన దేవేందర్ సింగ్ పేర్కొన్నారు. తనకు క్రేన్ ఆపరేటింగ్‌లో 11 సంవత్సరాల అనుభవం ఉందని, ఆధునిక టెక్నాలజీ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండేళ్లుగా ఆపరేట్ చేస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment