German technology
-
కార్పెట్‌పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు..
-
Video: కార్పెట్‌పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. తారు రోడ్డును కొంతమంది వ్యక్తులు ఒట్టి చేతులతో అమాంతం ఎత్తేశారు. కొత్తగా వేసిన రోడ్డు అట్టముక్కలా పైకి రావడం విచిత్రంగా మారింది. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్) కింద ఈ రహదారిని నిర్మించారు. అయితే రోడ్డు మీద కార్పెట్‌ను బేస్‌లాగా పరిచి దానిపై తారు రోడ్డు వేశారు. స్థానిక కాంట్రాక్టర్ ఈ రహదారిని నిర్మించారు. దీనిని గుర్తించిన గ్రామస్థులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బోగస్ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్షానికి ఈ పనులు సాక్ష్యంగా నిలిచాయని మండిపడ్డారు. రోడ్డు వేసి నాలుగు రోజులు అవుతుందని.. ఈ విధంగా లేచిపోయే రోడ్లను గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దీనిని ఆమోదించిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టర్ మాటలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అతడు పేర్కొన్నాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. మొత్తానికి ఫేక్ రోడ్డుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయినా ఇప్పటికీ పలు గ్రామాల్లో సరైన రోడ్లు లేకపోవడం గమనార్హం. చదవండి: పసిప్రాయంలో రాసిన ఉత్తరం 15 ఏళ్లుగా వెంటాడుతూ... -
మహా గణపతికి జర్మన్ క్రేన్
ఖైరతాబాద్: శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు జర్మన్ టెక్నాలజీ.. తడానో కంపెనీకి చెందిన ఆధనిక క్రేన్‌ను వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్ ఇదొక్కటే కావడం విశేషం. ఈ క్రేన్ 400 టన్నుల బరువును 60 మీటర్లు పైకి ఎత్తుతుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు ఒక్కో టైరు టన్ను బరువు గల 12 టైర్లు ఉన్నాయి. క్రేన్ సామర్థ్యం 72 టన్నులు కాగా 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ సాయంతో నిమజ్జన మహత్కార్యాన్ని పూర్తి చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం రెండోసారి కలగినందుకు సంతోషంగా ఉందని క్రేన్ ఆపరేటర్, పంజాబ్‌కు చెందిన దేవేందర్ సింగ్ పేర్కొన్నారు. తనకు క్రేన్ ఆపరేటింగ్‌లో 11 సంవత్సరాల అనుభవం ఉందని, ఆధునిక టెక్నాలజీ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండేళ్లుగా ఆపరేట్ చేస్తున్నానని తెలిపారు. -
రోడ్లు.. ఇక 30 ఏళ్లు గ్యారంటీ
సాక్షి, జనగామ: ప్రస్తుతం రోడ్ల కాలపరిమితి ఎంత అంటే సరిగ్గా చెప్పలేం. ఓ రోడ్డు 6 నెలలకే దెబ్బతింటుంది. మరో రోడ్డు మహా అంటే ఏడాది.. అయితే, జాతీయ రహదారి 30 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండే పద్దతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా నేషనల్ హైవే నిర్మాణంలో జర్మన్ టెక్నాలజీని వినియోగి స్తోంది. యాదాద్రి జిల్లా రాయగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వరకు నిర్మిస్తున్న 163 జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మొత్తం 99 కిలోమీటర్ల ఈ రోడ్డు కోసం కేంద్రం రూ.1,905 కోట్లు కేటాయించింది. పరిహారం పోగా రూ. కోట్లను రోడ్డు నిర్మాణానికి వెచ్చించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ జర్మన్ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం చేస్తోంది. పర్మనెంట్ క్వాలిటీ కాంక్రీట్ పద్దతో రాష్ట్రంలో తొలిసారిగా ఈ పనులు చేస్తున్నారు. కాంక్రీట్, సిమెంట్‌తో నిర్మాణం... పర్మనెంట్ క్వాలిటీ కాంక్రీట్ నిర్మాణంతో చేపడుతున్న పనుల్లో కాంక్రీట్, సిమెంట్‌తోనే పనులు చేస్తున్నారు. ఆరు వరుసల్లో రోడ్డు చదును చేసి నిర్మాణం చేపడుతున్నారు. కింద వరుసలో మట్టితో రోలింగ్ చేసి చివరి దశలో కాంక్రీట్‌తో రోలింగ్ చేస్తున్నారు. ఫీట్ ఎత్తుతో 9 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. ఇందుకోసం విట్జ్పవర్ మిషన్‌ను వినియోగిస్తుండగా.. నాణ్యత తక్కువైతే ఈ మిషన్ పని చేయడం ఆగిపోతుంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. ఈ పద్దతిలో ఎక్కడైనా రోడ్డు పాడైతే సులువుగా మరమ్మతు చేసే వెసులుబాటు కూడా ఉంది. బిట్లు బిట్లుగా రోడ్డు వేస్తున్నందున ఏదైనా సందర్భంలో రోడ్డు ధ్వంసం అయితే, ఆ బిట్టు వరకే తొలగించి కొత్త బిట్ వేసే అవకాశం ఉంది. -
తన్నుకుపోతారా? రద్దు చేస్తారా?
ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు నిరాదరణ తన్నుకుపోతారా? రద్దు చేస్తారా? రద్దు కుట్ర అంటున్న పాసింజర్లు విశాఖపట్నం: ఎన్నో ఏళ్ల డిమాండ్ ఫలితంగా వచ్చిన విశాఖ-న్యూదిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖవాసుల అవసరాలు తీర్చడం లేదు. ఆనందాన్ని పంచడం లేదు. విమాన టికెట్‌ను తలపించే చార్జీలు, వేళగాని వేళలో ప్రయాణం వెరసి ఈ రైలు ప్రయాణికులకు అక్కరకు రావడం లేదు. ఈ రైలు ఆక్యుపెన్సీ రేటు ఆశాజనకంగా లేదు. పదకొండు నెలల క్రితం ఆగస్టు 12న ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభించారు. తొలుత వారానికి మూడు రోజులే నడిచిన ఈ రైలును నాలుగు నెలల తర్వాత నుంచి రోజూ నడుపుతున్నారు. 16 బోగీల ఈ ఏసీ రైలులో ఏసీ ఫస్ట్‌క్లాస్ ఒకటి, సెకండ్‌క్లాస్ 5, థర్డ్‌క్లాస్ 7 బోగీలు రెండు ఉంటాయి. విశాఖ నుంచి దిల్లీకి ఫస్ట్‌క్లాస్ టికెట్ చార్జి రూ.5075, సెకండ్ క్లాస్ రూ.2940, థర్డ్‌క్లాస్ రూ.2005 ఉంది. విశాఖపట్నం నుంచి న్యూదిల్లీకి విమాన టికెట్‌ను వారం, పది రోజులు ముందుగా బుక్ చేసుకుంటే రూ.5 వేలకే లభిస్తుంది. పైగా రెండు, మూడు గంటల్లోనే దిల్లీ చేరుకోవచ్చు. అదే మన ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో అయితే 2099 కిలోమీటర్ల దూరాన్ని 35 గంటల 15 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుంది. అంటే రోజున్నర సమయమన్న మాట. దీంతో అన్ని గంటలు రైల్లో కూర్చోలేక ఒకింత స్తోమతున్న వారంతా విమానాల్లో దిల్లీ వెళ్లిపోతున్నారు. సామాన్యులు ఆ చార్జీలను అందుకోలేక ప్రత్యామ్నాయ రైళ్లలో పయనిస్తున్నారు. అంతే కాదు.. విశాఖలో ఉదయం ఈ రైలు 7.15కి బయల్దేరి మర్నాడు రాత్రి 7 గంటలకు దిల్లీ చేరుకుంటుంది. దీనివల్ల ఆ రాత్రి దిల్లీలో విధిగా బస చేయాల్సి వస్తుంది. ఇది కూడా ప్రయాణికులకు ఎంతో భారంగా పరిణమిస్తోంది. దీంతో ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారి ఆక్యుపెన్సీ రేటు 60-70 శాతానికి మించడం లేదు. ఫలితంగా నష్టాల పట్టాలపై ఈ బండి పరుగులు తీస్తోంది. వేగం పెంచరేం?: ఏపీ ఏసీ సూపర్ఫ్టాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జర్మనీ టెక్నాలజీతో తయారైన బోగీలు అమర్చారు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణించేందుకు అనుమతి ఉంది. కానీ ఈ ట్రెయిన్ సగటు వేగం గంటకు 59 గంటలకు మించడం లేదు. అందువల్లే పేరుకు సూపర్‌ఫాస్ట్ అయినా సాదాసీదా ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే దిల్లీ వెళ్తోంది. విశాఖ నుంచి నిజాముద్దీన్ (దిల్లీ)కు అదే రూట్లో వెళ్లే లింక్ ఎక్స్‌ప్రెస్‌కు 37 గంటల సమయం పడుతోంది. అంటే ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ కంటే రెండు గంటల ఆలస్యంగా చేరుతుంది. పైగా ఈ రైలు సాయంత్రం ఇక్కడ బయల్దేరి మూడో రోజు తెల్లవారు జామున 4 గంటలకు నిజాముద్దీన్ వెళ్తుంది. అందుకే ఈ రైలుకున్న డిమాండ్ ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు ఉండడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ రైలు వేగం పెంచాలని, ఉదయం వేళ దిల్లీ చేరుకునేలా విశాఖ నుంచి బయల్దేరే వేళలు మార్చాలని ప్రయాణికులు ఎప్పట్నుంచో కోరుతున్నారు. అయినా రైల్వే వర్గాలకు వీరి విజ్ఞప్తులు చెవికెక్కడం లేదు. కొన్నాళ్ల పాటు ఇలాగే నడుపుతూ ప్రయాణికుల ఆదరణ లేదన్న వంకతో ఈ రైలును రద్దు చేసే కుట్ర జరుగుతోందన్న వాదనలూ ఉన్నాయి. అందుకే అటు వేళలు మార్పు గాని, వేగం పెంచడం గాని చేయడం లేదని అంటున్నారు. -
రోడ్డు మీద నీళ్లు పోస్తే జైలు శిక్ష..!
చంఢీఘర్: చుక్క నీటిని వృధా చేసినా ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. గొంతు తడుపుకోవడానికి కూడా కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చూస్తునే ఉన్నాం. ఇప్పటికే కరువును ఎదుర్కొంటున్న హర్యానా సర్కార్ తాజాగా నీటిని వృధా చేస్తూ, రోడ్లను పాడు చేస్తున్నవారికి జైలు శిక్ష వేయడానికి సిద్ధం అవుతోంది. తరచూ ఇంట్లో వృథాగా కనిపించే నీటిని రోడ్డు మీదుకు పారబోస్తారా? అయితే, ఇక ముందు అలా చేయకండి. నీరు పారబోసి రోడ్లను పాడుచేస్తున్న వారిని జైలు పంపే యోచనలో ఉంది హర్యానా ప్రభుత్వం. ఆ నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.10,000 జరిమానా లేదా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి రావ్ నర్బీర్ సింగ్ తెలిపారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. హర్యానాలో పలు గ్రామాల్లో ... గ్రామస్తులు నీటిని వృథా చేస్తూ రోడ్లపైన పోస్తున్నారు. దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయి పాడైపోతున్నాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన సర్కారు రోడ్డు మీద కనీసం ఒక బక్కెట్ నీళ్లు పోసిన శిక్ష లేదా జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో జర్మన్ తరహా గ్రీన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వ ఉపయోగిస్తుండటంతో దాదాపు 5కిలోమీటర్ల మార్గానికి రూ.3 కోట్ల మేర ఖర్చు అవుతోంది. ప్రస్తుతం గుడ్ గావ్, ఫరీదాబాద్, రేవారీ, కర్నాల్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉండగా.. నీటిపోయడం వల్ల రోడ్లు పాడవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రోడ్లపై నీరు పోయడం చూస్తే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయోచ్చని ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. 2016-17లో రాష్ట్రంలోని 5,605 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరపనున్నట్లు తెలిపారు. -
దృఢమైనది భారతి సిమెంట్
వరదయ్యుపాళెం: అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు మేలైనది, సిమెంట్ రంగంలో రారాజు భారతి సిమెంట్ అని చిత్తూరు జిల్లా భారతి సిమెంట్ సేల్స్ ఆఫీసర్ వెంకట్రామి రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ ఛాయుపతి తెలిపారు. సోవువారం రాత్రి గోవర్ధనపురంలోని కల్కి ప్రార్థనా వుందిరంలో వుండలంలోని తాపీ మేస్త్రీలతో సవూవేశం నిర్వహించారు. సవూవేశంలో వారు వూట్లాడుతూ ట్యాంపర్ ఫ్రూఫ్ బ్యాగ్‌తో, జర్మన్ టెక్నాలజీ, రోబెటెక్ క్వాలిటీతో భారతి సిమెంట్ తయూరవుతోందన్నారు. తాపీ మేస్త్రీలు గృహ నిర్మాణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిమెంట్ వాడకంపై అవగాహన కల్పించారు. స్థానిక సిమెంట్ డీలర్ శివయ్యు వూట్లాడుతూ భారతి సిమెంట్ వుూడు రెట్లు దృఢమైనదని, నాణ్యమైనదని, కచ్చితమైన తూకంతో వినియోగదారులకు అందజేస్తున్నారని తెలిపారు. సవూవేశంలో తాపీ మేస్త్రీలకు, కూలీలకు లక్ష రూపాయుల ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం అందజేశారు. -
నాణ్యతలో మేటి.. భారతి సిమెంట్
- సంస్థ ఏరియా మేనేజర్ సతీష్‌కుమార్ - రామాయంపేటలో తాపీ మేస్త్రీలకు ప్రమాద బీమా బాండ్ల అందజేత రామాయంపేట: సిమెంటు తయారీ రంగంలో భారతి సిమెంట్ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ ఏరియా మేనేజర్ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక శ్రీనివాస స్టీల్ మర్చంట్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో సోమవారం రాత్రి వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర సిమెంట్లతో పోల్చుకుంటే భారతి సిమెంట్ మూడు రెట్లు మెరుగ్గా పని చేస్తుందని తెలిపారు. అందువల్లే వినియోగదారులు దీన్ని వాడేందుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. రోబోటెక్ క్వాలిటీ, జర్మనీ టెక్నాలజీ, టాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ వంటి అత్యున్నత ప్రమాణాలతో భారతి సిమెంట్‌ను అందజేస్తున్నామని తెలిపారు. రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో భారతి సిమెంట్ ప్లాంట్ నెలకొల్పామని వివరించారు. దీని ద్వారా నెలకు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. మెదక్ జిల్లాలోని డీలర్లందరికీ ఇక్కడి నుంచే సిమెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. తమ సంస్థ తరఫున వినియోగదారులు, భవన నిర్మాణ రంగ కార్మికులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా వంద మంది తాపీ మేస్త్రీలకు రూ. లక్ష చొప్పున ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. దీనికి సంబంధించిన బాండ్లను సోమవారం వారికి అందజేశారు. భారతి సిమెంట్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని సతీష్‌కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఏడుపాయల ఆలయంలో లక్ష వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశామని, జోగిపేటలో రెండు వేల మందికి అన్నదానం చేశామని చెప్పారు. భారతి సిమెంట్ తయారీ విధానం, నాణ్యత తదితర అంశాలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ యశ్వంత్, టెక్నికల్ ఆఫీసర్ అరవింద్, డీలర్ దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.