జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న రాయగిరి–ఆరెపల్లి నేషనల్ హైవే
సాక్షి, జనగామ: ప్రస్తుతం రోడ్ల కాలపరిమితి ఎంత అంటే సరిగ్గా చెప్పలేం. ఓ రోడ్డు 6 నెలలకే దెబ్బతింటుంది. మరో రోడ్డు మహా అంటే ఏడాది.. అయితే, జాతీయ రహదారి 30 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండే పద్దతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా నేషనల్ హైవే నిర్మాణంలో జర్మన్ టెక్నాలజీని వినియోగి స్తోంది.
యాదాద్రి జిల్లా రాయగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వరకు నిర్మిస్తున్న 163 జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మొత్తం 99 కిలోమీటర్ల ఈ రోడ్డు కోసం కేంద్రం రూ.1,905 కోట్లు కేటాయించింది. పరిహారం పోగా రూ. కోట్లను రోడ్డు నిర్మాణానికి వెచ్చించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ జర్మన్ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం చేస్తోంది. పర్మనెంట్ క్వాలిటీ కాంక్రీట్ పద్దతో రాష్ట్రంలో తొలిసారిగా ఈ పనులు చేస్తున్నారు.
కాంక్రీట్, సిమెంట్‌తో నిర్మాణం...
పర్మనెంట్ క్వాలిటీ కాంక్రీట్ నిర్మాణంతో చేపడుతున్న పనుల్లో కాంక్రీట్, సిమెంట్‌తోనే పనులు చేస్తున్నారు. ఆరు వరుసల్లో రోడ్డు చదును చేసి నిర్మాణం చేపడుతున్నారు. కింద వరుసలో మట్టితో రోలింగ్ చేసి చివరి దశలో కాంక్రీట్‌తో రోలింగ్ చేస్తున్నారు. ఫీట్ ఎత్తుతో 9 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు.
ఇందుకోసం విట్జ్‌పవర్ మిషన్‌ను వినియోగిస్తుండగా.. నాణ్యత తక్కువైతే ఈ మిషన్ పని చేయడం ఆగిపోతుంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. ఈ పద్దతిలో ఎక్కడైనా రోడ్డు పాడైతే సులువుగా మరమ్మతు చేసే వెసులుబాటు కూడా ఉంది. బిట్లు బిట్లుగా రోడ్డు వేస్తున్నందున ఏదైనా సందర్భంలో రోడ్డు ధ్వంసం అయితే, ఆ బిట్టు వరకే తొలగించి కొత్త బిట్ వేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment