
కొడుకు వైద్యం కోసం వచ్చితండ్రి ఆత్మహత్య
హైదరాబాద్: కొడుకు వైద్యం కోసం వచ్చి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది.
వివరాలు... నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని రత్తాలరాంరెడ్డికి చెందిన రైతు లింబయ్య కొడుకు వైద్యం కోసం నగరానికి వచ్చాడు. అయితే ఈ రోజు ఉదయం బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అది విఫలం కావడంతో లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుమారుడి వైద్యం చేయించలేక పోతున్నానే మనస్ధాపంతో లింబయ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లింబయ్య మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.