బాలుడిని ట్యాంక్ బండ్‌లో తోసేసిన బాబాయి | five year boy thrown into tank bund in hyde | Sakshi
Sakshi News home page

బాలుడిని ట్యాంక్ బండ్‌లో తోసేసిన బాబాయి

Published Sat, Mar 11 2017 10:41 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

five year boy thrown into tank bund in hyde

హైదరాబాద్ (రాంగోపాల్‌పేట్‌): ఓ చిన్నారిని బాబాయే హుస్సేన్‌ సాగర్‌ నీళ్లలో తోసి వేయగా, లేక్‌ పోలీసులు, స్థానికుల సహాయంతో ఆ చిన్నారి ప్రాణాలతో భయటపడ్డారు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం ట్యాంక్‌ బండ్‌పై ఉన్న లేపాక్షి భవనం వద్దకు ఆర్య విద్యాలయ హైస్కూ్‌ల్‌లో చదువుకుంటున్న మహేష్‌, సుభద్రల కుమారుడు ధనుష్‌ (5)ను అతని బాబాయ్‌ తీసుకుని వచ్చాడు. బాలుడిని నీళ్లలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

నీటిలో మునిగిపోతున్న ధనుష్‌ను గుర్తించిన స్థానికులు లేక్‌ పోలీసులకు సమాచారం అందించడం వారు స్థానికుల సహాయంతో అతడిని రక్షించారు. అయితే ఆ బాలుడు తల్లిదండ్రులు పేర్లు, పాఠశాల పేరు మాత్రమే చెబుతుండగా, ఏ ప్రాంతమనేది చెప్పడం లేదు. దీంతో అతని తల్లిదండ్రుల కోసం రాంగోపాల్‌పేట్‌ పోలీసులు విచారణ చేపట్టారు. తనను సంతు అనే తన బాబాయ్‌ ట్యాంక్‌బండ్‌కు తీసుకువచ్చి నీటిలో తోసివేసినట్లు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆచూకీ కోసం నగరంతో పాటు తెలంగాణాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement