హైదరాబాద్ : ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో దూకి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే లేక్ పోలీసులు రంగంలోకి దిగి భర్త శ్రవణ్‌ను కాపాడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య పావని గల్లంతవగా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దంపతులు సికింద్రాబాద్ సిఖ్ విలేజ్ ప్రాంత వాసులుగా పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
(రామ్‌గోపాల్‌పేట్)
దంపతుల ఆత్మహత్యాయత్నం
Published Mon, Apr 13 2015 2:54 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement