హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్పై గురువారం రాత్రి గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉంది. మృతదేహాన్ని చూసేందుకు వాహనదారులు ఆపడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో అటుగా వెళ్లున్న వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా మృతదేహం ఎవరిది, ఈ ఘటనకు గల కారణాలేంటి అన్న విషయాలు తెలియాల్సివుంది.