సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం నగరంలోని ట్యాంక్‌బండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. ఇదిలా ఉండగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర‍్బంగా మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. కేసీఆర్‌కు మేము వ్యతిరేకం కాదు... అణగదొక్కితే తిరగబడతాం... అంటూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకువెళ్తారో చెప్పాలన్నారు. మందకృష్ణను వెంటనే విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment