సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ బిల్లు విషయంలో తొందరపాటు పనికి రాదని.. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తోందంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇవాళ(శనివారం) తొలిసారి ఆయన సొంత జిల్లాలో పర్యటించారు.
శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టు వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై భుజాలపై తుపాకీ పెట్టి ఈ ప్రభుత్వం కాల్చాలని చూస్తోంది. గవర్నర్‌ను రెండు రోజుల్లోనే పరిశీలించి ఆమోదించాలంటే ఎలా?. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు సంబంధించిన బిల్ అది. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే ఇంతలా పరిశీలన చేస్తారు. ఇలాంటి బిల్స్ లో ఏ గవర్నరైనా ఇలానే పరిశీలిస్తారు అని తెలిపారాయన.
ఆర్టీసీ కార్మికులకు బీజేపీ కానీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై కానీ వ్యతిరేకం కాదని గుర్తించాలి బండి సంజయ్ కోరారు. ఆర్టీసీ కార్మికులు కొంత సంయమనంతో ఉండండి. మీకు సరైన న్యాయం జరుగుతుంది. రేపొద్దున తిరకాసు చేసి.. ఆ నెపాన్ని గవర్నర్‌పై నెట్టేసే వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసే కుట్ర జరగుతుందోని అని ఆరోపించారాయన. అంతకు ముందు.. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న మోతె వాగు బ్రిడ్జ్, శంకరపట్నం మండలంలో దెబ్బ తిన్న కల్వల ప్రాజెక్టులను సందర్శించారాయన.
ఇదీ చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఇది గుర్తుందా?
Comments
Please login to add a commentAdd a comment