సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. దీనిపై రాజ్‌భవన్‌కు అధికారులు రిప్లై పంపించారు. ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. విలీనం అయిన తర్వాత విధివిధానాలో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఏపీలో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని తెలంగాణ సర్కార్ తెలిపింది.
కాగా, టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు.
చదవండి: ఆర్టీసీ విలీనం: గవర్నర్, కేసీఆర్ సర్కార్ పంచాయితీ.. ‘బట్టకాల్చి మీదేస్తున్నరు’
Comments
Please login to add a commentAdd a comment