సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై వర్సెస్ బీఆర్‌ఎస్ సర్కార్‌కు నడుమ మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ తెలిసిందే. ఈ క్రమంలో.. ‘బిల్లుల పెండింగ్’ అంశం కూడా హాట్ టాపిక్‌గా ఉంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాల్సి ఉండగా.. గవర్నర్ నుంచి అందుకు అనుమతులు రాలేదు. ఈ తరుణంలో.. రాజ్‌భవన్ స్పందించింది.
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఆ సంస్థ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బిల్లును రూపొందించింది.. ఆర్థికపరమైంది కావడంతో దానిని గవర్నర్‌కు పంపింది కూడా. అయితే రెండు రోజులు గడిచినా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఆమె అనుమతి ఇస్తేనే అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగేది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుండగా.. మరోవైపు ఈ పరిణామంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందిస్తూ..
బుధవారం మధ్యాహ్నాం ఆర్టీసీ బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. కాబట్టి గవర్నర్ ఈ బిల్లును పరిశీలించడానికి కొంత సమయం పడుతుంది. పైగా న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమయం కావాలి అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి: ‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’
Comments
Please login to add a commentAdd a comment