సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్‌భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే.
అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.?
డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు.
సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment