బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోవడం దుర్మార్గం
పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు తేడా లేదు
జనసేనతో పొత్తుపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది
కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ టౌన్: ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిధుల కేటాయింపు, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సూచించారు.
కరీంనగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ అభి వృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నా మని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే సహకరిస్తున్నా మని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులిచ్చి బీజేపీ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం సరికాదన్నారు.
కేంద్రం పార్టీలకఅతీతంగా ఎంపీలకు నిధులిస్తుందని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలాగే చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారని, దీని పై జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. టీ 20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని, 140 కోటమంది ఆనందంతో ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment