
సాక్షి, హైదరాబాద్: నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల, ప్రముఖ కవయిత్రి, వక్త, స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా సాధికారతకు అలుపెరగని పోరాటం చేసిన సరోజినీ నాయుడు 143వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ఆమెకు ఘనమైన నివాళి అర్పించింది. నగరంతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని స్మరించుకుంది.
ట్యాంక్‌బండ్‌పై ఆమె రాసిన కవితతో కూడిన పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. ఇది శాశ్వత స్ట్రక్చర్‌గా నిర్మించారు. ఒక స్టాండ్‌పై పుస్తకం, అందులో హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని పొందుపర్చారు. హైదరాబాద్ అంటే సరోజినీ నాయుడికి ఎంతో ఇష్టమనే విషయం పలు సందర్భాల్లో ఆమె రచనల ద్వారా వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌పై హృద్యమైన గేయాన్ని రాశారు. ఆమె జయంతి సందర్భంగా ఈ అపురూప కానుకను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు. (క్లిక్: వైన్‌షాప్ ఉండాలా.. వద్దా అంటూ ఓటింగ్.. ఫలితం ఏంటంటే!)
Comments
Please login to add a commentAdd a comment