Updates..
►తెలంగాణ శాసన మండలిలో విప్‌లను నియమించారు. మండలిలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్ నియామకమయ్యారు. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు నియమించారు.
►తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు కౌంటర్ మధ్య శనివారం వాడీవేడి వాదనలు జరిగాయి. ముందు భట్టి మాట్లడుతూ.. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని అన్నారు. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ.. నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పంపులు మునిగిపోయాయని చుద్దామంటే పోనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.అసెంబ్లీలో తమ మైకులు కట్ చేసి వాళ్లకు మాత్రే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉందన్నారు.
►సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కొరడాతో తాము కొట్టడం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాళేశ్వరం వద్దకు రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదన్నారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్ నేతలు సంబర పడుతున్నారని.. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఎజెన్సీ నుంచే రిపేర్ చేయించామని తెలిపారు.
► తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ ఫిషర్‌మెన్ విభాగం ప్రయత్నం. మెట్లు సాయికుమార్ సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ క్రమంలో వారు మత్య్సకారులకు రూ. 10లక్షల జీవిత బీమా, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
► శాసనసభ ఆవరణలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌కు బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు.
► నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
► భట్టికి కేటీఆర్ కౌంటర్
కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రోను పూర్తి చేసిన ఘనత మాదే. మెట్రో రైలుకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోంది. కేంద్రానికి నివేదికలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఇష్టారాజ్యంగా మెట్రో ఛార్జీలు పెంచొద్దని స్పష్టం చేశాం. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారమే మెట్రోరైల్ నడుస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తామాని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే మెట్రోను తీసుకువచ్చింది. మెట్రో ఛార్జీలు అగ్రిమెంట్‌కు విరుద్ధంగా పెంచారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మెట్రో లిమిటెడ్‌కు లాభం చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. మెట్రో యాడ్స్ ఇచ్చే విషయంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వడం లేదు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల వాగ్వాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment