
సాక్షి, నోయిడా : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎట్టకేలకు నోయిడాలో అడుగుపెడుతున్నారు. ఇతర నాయకుల మాదిరిగా కాకుండా ఎలాంటి పునరాలోచన లేకుండా ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. నోయిడాలో కొత్త మెట్రో రైలు సోమవారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరు అవుతున్నారు. అయితే, నోయిడాకు శాపగ్రస్త పట్టణం అని పేరుంది. ఉత్తరప్రదేశ్ అధికారంలో ఉండి ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన నేతకు తిరిగి అధికారం దక్కదని నానుడి.
ఇది నిజమేనేమో అన్నట్లుగా మాయావతి కూడా ఈ నగరంలో అడుగుపెట్టి అధికారం కోల్పోయారు. మరోపక్క, అఖిలేష్ మాత్రం ఈ శాపానికి భయపడి అక్కడ అడుగుపెట్టలేదు. కానీ, యోగి మాత్రం వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. మోదీ కూడా మెట్రో ప్రారంభానికి వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు యోగి నేడు నోయిడాలో అడుగుపెడుతున్నారు. దీంతోపాటు నేడే నోయిడా సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు. యోగి వస్తున్న నేపథ్యంలో దాదాపు 1,500మంది పోలీసులను మోహరించారు. ఇక మోదీ వచ్చే రోజు మొత్తం 5000 మంది పారా మిలిటరీ బలగాలను ఉపయోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment