శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ఆదివారం వివిధ అంశాలకు సం బంధించిన ప్రశ్నలు చర్చకు రానున్నాయి.
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ఆదివారం వివిధ అంశాలకు సం బంధించిన ప్రశ్నలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీలో గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక, గొర్రెలు, మేకల పెం పకానికి ప్రోత్సాహం, ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, ఉద్యాన వన సంస్థ, గ్రంథాలయ సెస్ చెల్లింపు, ఎల్‌ఈడీ బల్బుల వినియోగం, కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, యాదా ద్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు తదితరాలు.. శాసనమండలి విషయానికొస్తే నీటి పారుదల పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు, అల్ప సం ఖ్యాకులకు ఉపప్రణాళిక, పాత్రికేయుల సంక్షేమం తదితర అంశాలు చర్చకు రానున్నాయి.