
నగరాల్లో మరిన్ని మెట్రో రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : నగర, పట్టణ రవాణా వ్యవస్థ ఆధునీకరణకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో మరిన్ని మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపడతామని చెప్పారు.నగరాలు, పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్ధను పటిష్టపరిచేందుకు పెద్దసంఖ్యలో మెట్రో రైల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
కొత్తగా 3వేల కిలో మీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు పెట్టేలా ప్రణాళికలు సాగుతున్నాయని అన్నారు. మరోవైపు సబర్బన్ రైళ్ల కోసం మరిన్ని పెట్టుబడులు సమకూరుస్తామని స్పష్టం చేశారు.
.