![Telanagana CM KCR laid stone Metro2 BRS Flag Hoisting Updates - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/9/KCR_Bharata_Rashtra_Samithi.jpg.webp?itok=KKCBbI1h)
నగరంలో సీఎం కేసీఆర్.. అప్‌డేట్స్
02:30PM
►ఈనెల 14న ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్‌ఎస్ కొత్త కార్యాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. దేశ పరివర్తన కోసమే బీఆర్‌ఎస్ అని, ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండేనని అన్నారు. రాబోయేది రైతు ప్రభుత్వమేనని చెప్పారు.
► కర్ణాటకలో జేడీఎస్‌కు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేస్తామని వెల్లడించారు. కుమారస్వామి కర్నాటక సీఎం కావాలని ఆయన ఆకాక్షించారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామన్నారు. రైతు పాలసీ, జల విధానం రూపొందిస్తామన్నారు.
► తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ విస్తృత సమావేశాన్ని నిర్వహించింది. బీఆర్‌ఎస్ ఆవిర్భావం వెంటనే కేసీఆర్ జాతీయ కార్యాచరణ ప్రారంభించారు. కుమారస్వామి, ప్రకాష్ రాజ్‌తో పాటు ఇతర నేతలతో కీలక చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో పార్టీని ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కేసీఆర్ ఫోకస్ పెంచారు. పార్టీ జాతీయ సిద్ధాంతాలు, విధానాలపై సమాలోచనలు జరిపారు.
► బీఆర్‌ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు.. పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
01.40 PM
► బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కుమారస్వామి, ప్రకాశ్ రాజ్, జాతీయ రైతు సంఘ నేతలు, పార్టీ కార్యవర్గం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
01.25 PM
► తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించిన కేసీఆర్. ఇక నుంచి టీఆర్‌ఎస్ కాదు.. బీఆర్‌ఎస్ అంటూ పార్టీ శ్రేణుల నినాదాలతో మారుమోగిపోతున్న తెలంగాణ భవన్ ప్రాంగణం.
► తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు.. కాసేపట్లో జెండా ఆవిష్కరణ.. అధికారిక కార్యక్రమాలు
01.13 PM
► తెలంగాణ భవన్‌కు భారీగా తరలి వచ్చిన గులాబీ దండు. బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ నేపథ్యంలో సందడి వాతావరణం.
01.07 PM
► బీఆర్‌ఎస్ పత్రాలపై సంతకం చేసిన అధినేత కేసీఆర్.
01.00 PM
► త్వరలో ఢిల్లీకి సీఎం కేసీఆర్. రాజధానిలో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
12.58 PM
► తెలంగాణ భవన్ లో ప్రారంభమైన భారత రాష్ట్ర సమితి(BRS) ఆవిర్భావ కార్యక్రమం. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి కేసీఆర్ నివాళులు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
12.50 PM
► తెలంగాణ భవన్‌ను చేరుకున్న సీఎం కేసీఆర్. కాసేపట్లో బీఆర్‌ఎస్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్న కేసీఆర్. ఈసీ పంపిన ఆమోద లేఖపై సంతకం చేసి.. జెండా ఆవిష్కరించి అధికారిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
12.36 PM
► తెలంగాణ భవన్ కు వచ్చిన ప్రకాశ్ రాజ్ ..స్వాగతం పలికిన ఎంపీ సంతోష్ కుమార్..
తెలంగాణ భవన్ వద్ద మొదలైన సంబురాలు..
► బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్ కు చేరుకుంటుంన్న టిఆర్ఎస్ నేతలు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యే అవకాశం!.
సీఎం కేసీఆర్ అప్పా బహిరంగ సభ హైలెట్స్
► ఒకప్పుడు నగరంలో తాగు నీటి సమస్య ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చూసుకున్నాం. అన్ని కష్టాలను అధిగమించి ముందుకు వెళ్తున్నాం. అందరికీ అనువైన వాతావరణ నగరంలో ఉంది. అన్నివర్గాలను అక్కన చేర్చుకుంది ఈ విశ్వనగరం.
► చరిత్రలో హైదరాబాద్ ఓ సుప్రసిద్ధమైన నగరం ఇది.
► న్యూయార్క్, పారిస్, లండన్‌లో కరెంట్ పోవచ్చు.. కానీ, హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోయే అవకాశం లేదు. 1912లోనే నగరానికి కరెంట్ సదుపాయం ఉండేది.
► దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో పెద్దది హైదరాబాద్. అలాంటి నగరంలో మెట్రో.. ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు పోతున్నాం.
► పరిశ్రమ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది.
► హైదరాబాద్ నిజమైన విశ్వనగరం: అప్పా పోలీస్ అకాడమీలో నిర్వహించిన మెట్రో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన
► మెట్రో సెకండ్ ఫేజ్ పనుల కోసం.. హెచ్‌ఎండీఏ తరపున పదిశాతం పెట్టుబడి రూ. 625 కోట్ల రూపాయలు.. హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద కుమార్ సీఎం కేసీఆర్‌కు అందించారు. అలాగే.. జీఎంఆర్ తరపున పదిశాతం రూ.625 కోట్ల రూపాయల చెక్ సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
11.57AM
► అప్పా జంక్షన్ వద్ద పోలీస్ అకాడమీ ప్రాంగణంలో మెట్రో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్.
11.40 AM
► నగర మెట్రో రెండో ఫేజ్ పనుల్లో భాగంగా.. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రాయదుర్గం, కాజాగూడ, నానక్‌రాంగూడ, నార్సింగి, అప్పా జంక్షన్, రాజేంద్ర నగర్, శంషాబాద్, ఎయిర్‌పోర్ట్ కార్గో, ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ మార్గాల గుండా ఈ మెట్రో లైన్ రాబోతోంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఖర్చు భారీగా తగ్గనుంది. బోలెడంత టైం సేవ్ కానుంది.
► ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
11.30 AM
► శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. పాల్గొన్న అధికారులు, మంత్రులు
11.26 AM
► సెకండ్ ఫేజ్ మెట్రోకు భూమి పూజ.. పాల్గొన్న సీఎం కేసీఆర్. పాల్గొన్న మేయర్, అధికారులు, మంత్రులు
11.24 AM
► రాయదుర్గం మైండ్‌స్పేస్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్.
11:20 AM
► కాసేపట్లో రాయదుర్గం మైండ్ స్పేస్ వద్ద మెట్రో 2.0 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
11:00 AM
► మెట్రో రైల్ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం.. ప్రగతి భవన్ నుంచి మైండ్ స్పేస్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్.
► మెట్రో-2 ప్రత్యేకతలు
ప్రతిష్టాత్మకంగా మైండ్‌స్పేస్-శంషాబాద్ రూట్ మెట్రోరైల్‌ను చేపట్టనున్నారు. తొలిసారిగా ఫ్లాట్‌ఫామ్ క్లోజ్డ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పీకవర్‌లో ప్రతీ ఐదు నిమిషాలకొక మెట్రో రైల్ ఉండనుందట. జెట్ స్పీడ్తో గంటకు 120 కి.మీ. వేగం ద్వారా 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లో చేరేలా ఈ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం రూ.6,250 కోట్ల నిధులతో ఈ మెట్రో రైల్ రూట్ విస్తరణను చేపట్టనున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా విమానంలోకి వెళ్లేలాగా ఏర్పాట్లు. లగేజీ స్క్రీనింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. మూడేళ్లలో ఈ రూట్ లైన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.
10:37AM
► హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ శంకుస్థాపన.. ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి విచ్చేశారు. మరి కాసేపట్లో మైండ్ స్పేస్ జంక్షన్ కు చేరుకోనున్న సీఎం కేసీఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ(శుక్రవారం) పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
► ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన..
► పోలీస్ అకాడమీలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
► బీఆర్‌ఎస్ ఆవిర్భావ కార్యక్రమం. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం. అనంతరం పార్టీ శ్రేణుల నడుమ బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ.
Comments
Please login to add a commentAdd a comment