
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్ మెట్రో స్టేషన్ శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మే నెలాఖరులోగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని, అప్పటిలోగా హైటెక్ సిటీ వద్ద మెట్రోరైలు రివర్సల్ పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ – హైటెక్ సిటీ మార్గంలో రివర్సల్ సదుపాయం లేకపోవడంతో ట్విన్‌సింగిల్ లైన్‌లోనే మెట్రో రైళ్లు ప్రయాణిస్తున్న విషయం విదితమే. రివరల్స్ సదుపాయం ఏర్పాటు చేసిన అనంతరం హైటెక్ సిటీకి వెళ్లే మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం నాగోల్ – హైటెక్ సిటీ,ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలోనిత్యం 2.30 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment