
'ప్రజలపై రూ.6వేల కోట్ల అదనపు భారం'
హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే.. ఆ నిర్మాణాలను కూల్చే పనిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే.. ఆ నిర్మాణాలను కూల్చే పనిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. నగరంలో మంగళవారం మీడియాతో భట్టి మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రి, సెక్రటేరియట్లను కేసీఆర్ సర్కార్ కూల్చివేస్తామంటోందని ఆయన మండిపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టు రూట్ మార్పులు చేస్తూ రూ.6 వేల కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపిందని భట్టి ఆరోపించారు.
ఈ నెల 10, 11, 12 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సెగ్మంట్లలో కాంగ్రెస్ డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు బుధవారం చార్మినార్ నుంచి అబిడ్స్ జంక్షన్ నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వస్తువులు, వస్త్రాలు తదితర సామాగ్రి సేకరించి చెన్నైకి పంపిస్తామని వివరించారు.