బీజేపీకి ముస్లిం, దళితులే టార్గెట్
హిందూత్వ ఎజెండాతో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం
మరోసారి బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకుంటాం
ఏఐఎంఐఎం 66వ ఆవిర్భావ దినోత్సవంలో అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్‌ఆర్‌సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు.
మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్
Comments
Please login to add a commentAdd a comment