ఇందిరానగర మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ను పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి బెంగళూరు: నగరంలోని మరో మెట్రో పిల్లర్‌లో చీలికలు కనిపించాయి. బెంగళూరు ఇందిరానగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ బేరింగ్‌లో శుక్రవారం చీలికలు కనిపించడంతో శుక్రవారం ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) నాసిరకమైన పనుల వల్ల మెట్రో పిల్లర్లలో చీలికలు వస్తున్నాయని ప్రయాణికులు, నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెట్రో పిల్లర్లలో ఎలాంటి చీలికలు రాలేదని, అవన్నీ అవాస్తవాలని బీఎంఆర్‌సీఎల్ కొట్టిపారేసింది. ఏ పిల్లర్ వద్ద కూడా చీలికలు లేవని, ఊహాగానాల ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదని బీఎంఆర్‌సీఎల్ ఆరోపించింది. మరోవైపు ఎంజీరోడ్డు–బయపనహళ్లి మార్గంలో నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉందని, అందువల్ల ఈనెల 3,4 తేదీల్లో మెట్రో రైలు సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బీఎంఆర్‌సీఎల్ గత నెల 30న పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయా పిల్లర్ల వద్ద వచ్చిన చీలికలను సరిచేసేందుకే బీఎంఆర్‌సీఎల్ మెట్రో సేవలను నిలిపేసిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మెట్రో పిల్లర్లలోని చీలికల విషయాన్ని దాచిపెట్టి నిర్వహణ పనుల పేరిట మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఎంఆర్‌సీఎల్ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బంది వచ్చిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment