Pillars
-
గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, సాక్షి: ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్అండ్బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తైతే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా.. వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!?
ఇథియోపియా, అడిస్ అబాబాకు దక్షిణంగా ఉన్న సోడో ప్రాంతంలోని తియా పురావస్తు ప్రదేశం.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో మెగాలిథిక్ స్తంభాలు.. 12 లేదా 14వ శతాబ్దాల నాటి ఎన్నో కథలను.. ఊహించి చెబుతుంటాయి. అందుకే అవన్నీ మార్మిక సంకేతాలతో మానవ చరిత్రకు వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచాయి.సంక్లిష్టమైన సామాజిక–మతపరమైన పద్ధతుల్లో కొన్ని రకాల చిహ్నాలు.. ఆ శిలాఫలకాలపై చెక్కి ఉన్నాయి. కత్తులు, బొమ్మలు ఇలా ఎన్నో భావనలతో చెక్కిన ఆ స్తంభాలు.. యునెస్కో గుర్తింపును కూడా పొందాయి. అందుకే ఇవన్నీ.. శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పురాతన ఇథియోపియన్ సంస్కృతికి చెందిన ఆచారాలకు, నమ్మకాలకు ఇవి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రదేశాన్ని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈ శిలాఫలకాలు, వాటిపైనున్న మార్మిక చిహ్నాలు పురాతన రాతియుగం నాటి పరిస్థితుల్ని సూచిస్తాయి. కానీ ఆ సూచనలు నేటి తరాలకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి.ఇక్కడ మొత్తంగా 36 మెగాలిథిక్ స్తంబాలు ఉన్నాయి. వాటి మీదున్న కత్తుల బొమ్మలు ఏదైనా దైవ శక్తిని లేదా సైనిక శక్తిని సూచిస్తూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కానీ దానిపై స్పష్టత లేదు. ఇక ఇతర బొమ్మల విషయానికి వస్తే ఆనాటి జ్యోతిష వివరాలను, ఆనాటి నాగరికత వివరాలను తెలుపుతున్నట్లుగా అనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 1930ల వరకు ఈ పురావస్తు ప్రదేశం వెలుగులోకి రాలేదు. ఇథియోపియా ప్రాంతీయ సర్వేల సమయంలో ఫ్రెంచ్ పరిశోధకులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, వీటి వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.ఆ రాతిస్తంభాలన్నీ పురాతన యుగంలో.. అంటే 12 లేదా 14 శతాబ్దంలోని చనిపోయిన పూర్వీకుల జ్ఞాపకార్థం కావచ్చని కొందరు లేదంటే అప్పటి సమూహానికి నాయకుడిగా ఉన్న నాయకుడి గౌరవార్థం కావచ్చని మరికొందరు అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే.. ఇది పురాతన శ్మశానవాటిక కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఈ స్తంభాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? అన్నది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
ఇద్దరు చిన్నారులను మింగిన పిల్లర్ గుంత
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్ గ్రామంలో గురువారం భవన నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంతలో పడి వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు నాస్తిక్ (4), నిషాంత్ చరణ్ (4) ఆడుకో వడానికి ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇటీవల గ్రామంలో వీడీసీ భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో పిల్లర్ల కోసం గుంతలను తవ్వారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గుంతల్లో నీరు నిలిచింది. ఆడుకుంటూ అటువైపు వెళ్లిన చిన్నారులు గుంత పక్కనున్న మట్టి కుప్పపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి జారి గుంతలో పడిపోయారు. మధ్యాహ్నం దాటినా పిల్లలు ఇంటికి రాకపోవడం, ఎక్కడా కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు సమీపంలో ఉన్న చెరువు వైపు, గ్రామంలోనూ వెతికారు. మధ్యాహ్నం దాటా క భవన నిర్మాణం పక్కనుంచి వెళ్తున్న ఓ వ్యక్తికి గుంతలో ఓ చిన్నారి వీపు భాగం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు కర్ర సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఎస్సై గోపి సిబ్బందితో కలసి ఘటనాస్థలిని పరిశీలించారు. కాంట్రాక్టర్ పిల్లర్లు తవ్వి రక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వలస వచ్చి రెండు నెలలు.. మృతుల్లో నిషాంత్ చరణ్ తల్లిదండ్రులు గ్రామానికి బతుకుదెరువు కోసం చిట్టాపూర్ నుంచి వలస వచ్చారు. చరణ్ తండ్రి శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బతుకు దెరువు కోసం వస్తే బతుకునే కాటేసిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు చిన్నారి నాస్తిక్ తండ్రి దేవాదాస్ 2 నెలల క్రితం ఉపాధి కోసం మాల్దీ వులకు వెళ్లాడు. వారికి కూమార్తె, కుమారుడు ఉండగా అందులో నాస్తిక్ మృతిచెందాడు. కాగా, మృతుల కుటుంబాలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. -
భారత్‌లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...
Zero Rupee Note Create For Corruption: ఎవరైనా మీకు సున్నా రూపాయి నోటును అందజేస్తే మనం కచ్చితంగా అది నకిలీ నోటుగా భావించి వదిలేయడం లేదా పడేయడమో చేస్తాం. మనందరి దృష్టిలో రూ.10, 20 నుంచి రూ.500, 2000లు విలువ కలిగిన నోటులు. కానీ సున్న రూపాయి నోటుకి కూడా అది పెద్ద విలువ ఉంది. అది కేవలం సాధారణ కాగితం కాదని మీకు తెలిస్తే? బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు. (చదవండి: రాయ్ తుపాను ధాటికి 208 మంది మృతి) భారతదేశంలో సున్నా-రూపాయి నోటు అనేది లంచాలు లేకుండా చేసేలా మొత్తం వ్యవస్థాగత రాజకీయ అవినీతిని అరికట్టడానికి ఒక సాధనంగా జారీ చేసిన బ్యాంకు నోట్ల అనుకరణ. పైగా దీన్ని 50 రూపాయల నోటును పోలి ఉండేలా తయారు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలుగు మూలస్థంభాలుగా శాసనసభ, కార్యనిర్వాహకుడు, న్యాయవ్యవస్థ, మీడియా అని మాత్రమే తెలుసు. కానీ ఐదవ స్థంభంగా ప్రభుత్వేతర సంస్థ ఒకటి పనిచేస్తుందని మనకెవరికి తెలియదు. తమిళనాడుకు చెందిన ఎన్జీవో ఐదవ స్తంభంలా శాంతియుత ప్రజాస్వామ్య రక్షణకై తనవంతు కీలక పాత్రను పోషిస్తోంది. అంతేకాదు 2007లో లంచం తీసుకోవడానికి నిరాకరించడాన్ని నమోదు చేసేందుకు జీరో రూపాయి నోటును రూపొందించింది. అంతేకాదు ఈ నోటు రూ. 50కి చాలా సారూప్యంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిపై "అన్ని స్థాయిలలో అవినీతిని నిర్మూలించండి" "నేను లంచం తీసుకోనని లేదా ఇవ్వనని వాగ్దానం చేస్తున్నాను." అనే అవినీతి వ్యతిరేక నినాదాలు ఉంటాయి. పైగా దశాబ్ద కాలంగా ప్రతి నెలా ఈ సున్న రూపాయి నోట్ల పంపిణీ జరుగుతోంది. అయితే నిజానికి అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)చే ముద్రించినవి కావు. ఈ ఐదవ స్థంభానికి అధ్యక్షుడు అయిన విజయ్ ఆనంద్ ఈ కార్యక్రమ సమర్థత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ..."ప్రజలు ఇప్పటికే వాటిని ఉపయోగించడం ప్రారంభించారు. అది పని చేస్తోంది కూడా. ఒక ఆటో-రిక్షా డ్రైవర్‌ను అర్ధరాత్రి ఒక పోలీసు తన ఆటోని ఆపి డబ్బు ఇస్తే వెళ్లిపోవచ్చు అని అన్నప్పుడు ఆ డ్రైవర్ ఈ సున్న రూపాయి నోటుని ఇచ్చాడు. ఆ పోలీసు ఒక్కసారిగా షాక్ అయ్యి నవ్వుతూ ఆ ఆటో డ్రైవర్ని విడిచి పెట్టాడు. దీని ఉద్దేశ్యం లంచం వద్దు అని ప్రజలలో విశ్వాసం కలిగించడమే" అని అన్నారు. ఈ మేరకు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం వంటి వివిధ భాషల్లో లక్షలాది జీరో రూపాయల నోట్లను ముద్రించాం అని చెప్పారు. అంతేకాదు ముఖ్యంగా అవినీతి, లంచగొండితనంపై అవగాహన కల్పించేందుకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వాలంటీర్లు పంపిణీ చేశారని విజయ్ ఆనంద్ చెబుతున్నారు. (చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది') -
పోలవరంలో కీలక ఘట్టం పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. రికార్డు సమయంలో ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పిల్లర్ల (పియర్స్) నిర్మాణాన్ని 52 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేసింది. 48 గేట్లకుగానూ 28 గేట్లను స్పిల్ వేకు అమర్చింది. మిగతా 20 గేట్ల బిగింపు పనులను వేగవంతం చేసింది. గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు బిగించేందుకు ప్లాట్‌ఫామ్‌లను సిద్ధం చేసింది. స్పిల్ వేకు సమాంతరంగా స్పిల్ చానల్ పనులను వేగవంతం చేసింది. మేనాటికి స్పిల్‌వే, స్పిల్ చానల్‌ను పూర్తి చేసి, జూన్‌లో వచ్చే గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, 2022 ఖరీఫ్ లోగా ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గ్రావిటీపై నీరు సరఫరా చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను రచించారు. ఆ ప్రణాళిక మేరకు పనులు జరుగుతున్నాయా? లేదా? అనే అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందు.. పోలవరం స్పిల్ వే పిల్లర్లను సగటున 23 మీటర్ల ఎత్తు వరకూ కూడా పూర్తి చేయలేదు. స్పిల్ వేకు గేట్లను 25.72 అడుగుల ఎత్తులో బిగిస్తారు. అంటే టీడీపీ సర్కార్ హయాంలో స్పిల్ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదని స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్‌లో హెడ్ వర్క్స్ పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. 2019 నవంబర్ 21న పనులు ప్రారంభించి వేగంగా చేస్తోంది. ప్రాజెక్టులోకి పులస చేపల రాకపోకలకు వీలుగా స్పిల్‌వే రెండో బ్లాక్‌లో ఫిష్ లాడర్ గేట్లను నిర్మించాల్సి ఉండటం, ఈ గేట్ల డిజైన్లకు సంబంధించి అనుమతులు ఆలస్యం కావడంతో రెండో పిల్లర్ నిర్మాణం ఆలస్యమైంది. కానీ ఇటీవలే అనుమతులు రావడంతో అన్ని పిల్లర్లను 52 మీటర్ల ఎత్తున నిర్మించారు. టీడీపీ సర్కార్ 60 నెలల్లో 23 మీటర్ల ఎత్తున పనులు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 14 నెలల్లో 29 మీటర్ల ఎత్తున 49 పిల్లర్లను పూర్తి చేసిందని స్పష్టమవుతోంది. ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జి స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ 1,128 మీటర్ల పొడవుతో నిర్మించాలి. స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లను కాంట్రాక్టు సంస్థ 2020 జూలైలో ఏర్పాటు చేయడం ప్రారంభించింది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు అదే ఏడాది సెప్టెంబర్ 9న మొదలు పెట్టింది. స్పిల్ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా 188 గడ్డర్లను ఇప్పటికే ఏర్పాటు చేయగా, 4 గడ్డర్లు మాత్రమే పెట్టాల్సి ఉంది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ పనులు 1,095 మీటర్ల మేర పూర్తి కాగా, మిగతా 33 మీటర్ల పనులు వారం రోజుల్లో పూర్తి కానున్నాయి. కేవలం ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేయడం చూస్తేనే పోలవరం పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్ధం అవుతుంది. గేట్ల పనులూ ముమ్మరం పోలవరం స్పిల్ వేకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇందుకు 49 పిల్లర్లపై ట్రూనియన్ బీమ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పటికే 28 గేట్లు బిగించారు. మిగిలిన 20 గేట్ల పనులూ వేగంగా సాగుతున్నాయి. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చాలి. ఇప్పటికే జర్మనీ నుంచి 70 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకున్నారు. మిగతా 26 సిలిండర్లను దిగుమతి చేసుకుంటున్నారు. గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చడానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌లను సైతం సిద్ధం చేస్తున్నారు. గోదావరి వరదల్లోనూ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులను నిర్విఘ్నంగా కొనసాగించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన ఈఎన్సీ పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఈఎన్సీ నారాయణరెడ్డి పరిశీలించారు. గురువారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ఆయన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈ కె.నరసింహమూర్తి స్పిల్‌వే బ్రిడ్జి నిర్మాణం పనులు, గేట్లు అమరిక, ఎగువ కాఫర్ డ్యామ్ తదితర పనుల వివరాలను తెలియజేశారు. పవర్ ప్రాజెక్టు, కొండ తవ్వకం పనులను కూడా ఈఎన్సీ పరిశీలించారు. (చదవండి: పరుగులు పెడుతున్న ‘పోలవరం’ పనులు) బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.. -
ఇందిరానగర్ మెట్రో స్టేషన్లో పిల్లర్ చీలిక
సాక్షి బెంగళూరు: నగరంలోని మరో మెట్రో పిల్లర్‌లో చీలికలు కనిపించాయి. బెంగళూరు ఇందిరానగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ బేరింగ్‌లో శుక్రవారం చీలికలు కనిపించడంతో శుక్రవారం ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) నాసిరకమైన పనుల వల్ల మెట్రో పిల్లర్లలో చీలికలు వస్తున్నాయని ప్రయాణికులు, నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెట్రో పిల్లర్లలో ఎలాంటి చీలికలు రాలేదని, అవన్నీ అవాస్తవాలని బీఎంఆర్సీఎల్ కొట్టిపారేసింది. ఏ పిల్లర్ వద్ద కూడా చీలికలు లేవని, ఊహాగానాల ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదని బీఎంఆర్సీఎల్ ఆరోపించింది. మరోవైపు ఎంజీరోడ్డు–బయపనహళ్లి మార్గంలో నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉందని, అందువల్ల ఈనెల 3,4 తేదీల్లో మెట్రో రైలు సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ గత నెల 30న పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయా పిల్లర్ల వద్ద వచ్చిన చీలికలను సరిచేసేందుకే బీఎంఆర్సీఎల్ మెట్రో సేవలను నిలిపేసిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మెట్రో పిల్లర్లలోని చీలికల విషయాన్ని దాచిపెట్టి నిర్వహణ పనుల పేరిట మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఎంఆర్సీఎల్ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బంది వచ్చిందని ఆరోపించారు. -
రూఫ్ గార్డెన్తో లుక్కే వేరు!
సాక్షి, హైదరాబాద్: రూఫ్ గార్డెన్ ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఈ రూఫ్ గార్డెన్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ రూఫ్ గార్డెన్ నిర్మించాలనుకునే వారు అందుకు అవసరమైన ప్రణాళికను భవన నిర్మాణం చేపట్టిన నాటి నుంచే అమలు చేయాలి. ⇒ రూఫ్ గార్డెన్తో భవనంపై బరువు పెరుగుతుంది. అందువల్ల పిల్లర్స్‌ను రూఫ్ గార్డెన్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి. పిల్లర్లు మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువు పెరిగితే భవనానికి ముప్పే. ⇒ అలాగే అంతస్తు పైకప్పుని చాలా పటిష్టంగా నిర్మించాలి. ఇది పటిష్టంగా లేకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ⇒ మొక్కల పెంపకానికి అవసరమైన మీడియం (మృత్తిక)ను రాళ్లులేని మట్టితో ఏర్పాటు చేస్తే మంచిది. కొంత ఒండ్రు మన్ను కలిపితే ఇంకా బాగుంటుంది. ⇒ భవనం పైభాగం (రూఫ్ డెక్)ను చాలా పటిష్టంగా నిర్మించాలి. మొక్కల వేర్లు, నీళ్లు ఇందులోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి. ⇒ మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను నిర్మించాలి.