గతంలో బద్రీనాథ్‌ నడక మార్గం ఎలా ఉండేది? | Walking Route to Badrinath Dham Years Ago | Sakshi
Sakshi News home page

గతంలో బద్రీనాథ్‌ నడక మార్గం ఎలా ఉండేది?

Published Thu, May 2 2024 11:03 AM | Last Updated on Thu, May 2 2024 2:47 PM

Walking Route to Badrinath Dham Years Ago

దేశంలో చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్‌ధామ్‌లలో ఒకటైన బద్రీనాథ్‌కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్‌లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్‌‌ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్‌ను సందర్శించిన తర్వాతే చార్‌ధామ్‌కు వెళ్లేవారు. రిషికేశ్‌కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ  ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్  బద్రీనాథ్ ధామ్‌కు నడక మార్గంగా ఉండేది.

రిషికేశ్‌లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ  మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్‌లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్‌కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.

కొన్నాళ్ల క్రితం రిషికేశ్‌ అడవిలా ఉండేదని రామేశ్వర్‌ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్‌ధామ్‌ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement