ఢిల్లీ మెట్రో రైల్‌లో రీల్స్ చేసి అడ్డంగా బుక్కైన 1600 మంది
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతరకరంగా, విచక్షణ లేకుండా ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన సోషల్ మీడియా యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు రీల్స్ చేసిన 1,600 మందిపై కేసులు నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మూడు శాతం పెరిగిందని డీఎంఆర్‌సీ సీనియర్ అధికారులు గురువారం తెలిపారు.
రైలులో తినడం, కింద కూర్చుని న్యూసెన్స్ చేయడం వంటి నేరాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం 1,647 మందిపై కేసులు నమోదైనట్టు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1600. ఏప్రిల్‌లో 610 మంది,మే నెలలో 518, జూన్‌లో 519 మందిపై జరిమానాలు విధించినట్టు తెలిపింది. మెట్రో ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టినట్టు చెప్పారు. మెట్రో రైలు పరిసరాల్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment