Traveller
-
బాబోయ్! వీడు మామూలోడు కాదు.. 15 గంటల్లో 268 మెట్రో స్టేషన్లు చుట్టేశాడు!
న్యూఢిల్లీ: ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 268 మెట్రో స్టేషన్లను ఓ వ్యక్తి కేవలం 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో కవర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. అతడు ఈ అరుదైన రికార్డు 2021 ఏప్రిల్ లోనే సాధించినా.. గిన్నిస్ సంస్థ మాత్రం ఇటీవల అతని ప్రయత్నాన్ని గుర్తించి.. అతని పేరు మీద సర్టిఫికేట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన శశాంక్ మను అనే వ్యక్తి వృత్తి పరంగా పరిశోధనా విభాగంలో ఫ్రిలాన్సర్ గా పని చేస్తున్నాడు. అతను 2021 ఏప్రిల్ 14న మెట్రో జర్నీని చేపట్టాడు. ఈ ఘనతను సాధించడానికి, ఫ్రీలాన్స్ పరిశోధకుడు ఒక రోజు టూరిస్ట్ కార్డ్‌ని ఉపయోగించుకున్నాడు. ఈ ఘనత ఇలా సాధించాడు మొదటగా అతను.. బ్లూ లైన్లో ఉదయం 5 గంటలకు ప్రారంభించి.. గ్రీన్ లైన్‌లోని బ్రిగేడియర్ హోషియార్ సింగ్ స్టేషన్లో రాత్రి 8:30 గంటలకు ముగించాడు. టూరిస్ట్ కార్డ్ ఉండడంతో ఒక్క రోజులో అపరిమిత రైడ్లను ఉపయోగించుకోవడానికి వీలుపడింది. అంతేకాకుండా అతను గిన్నిస్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఆధారాల కోసం ప్రతి స్టేషన్ లో ఓ ఫొటో దిగి, అక్కడ ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సంతకాలను కూడా సేకరించాడు. ఇన్ని తతంగాల పూర్తి చేస్తే.. గిన్నిస్ రికార్డ్స్ బృందంతో చాలా నెలల చర్చల తర్వాత, మనుకు ఎట్టకేలకు తన కష్టానికి ప్రతిఫలాన్ని అందించింది. గిన్నిస్ రికార్డు సాధించిన మను.. అనంతరం ట్విట్టర్లో తన ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ‘ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్ లను తక్కువ సమయంలోనే తిరిగి జర్నీని పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడే గిన్నిస్ వారు నాకు సర్టిఫికేట్ జారీ చేశారు.. ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు. Hey @GWR look what just arrived, the certificate for my Guinness record of visiting all Delhi Metro stations in fastest time! Also the news of my record was prominently covered by many media outlets in India. THANK YOU! pic.twitter.com/ciIgb77ngg — Shashank Manu (@sskmnu) April 4, 2023 చదవండి: ఎయిరిండియా విమానంలో తప్పతాగి.. ఫ్లోర్‌పై మలమూత్రవిసర్జన.. అరెస్ట్ -
186 దేశాలు పర్యటించిన తెలుగు ట్రావెలర్
విజయనగరం: విశాఖపట్టణానికి చెందిన రవి ప్రభు అరుదైన ఘనత సాధించారు. ఒక వైపు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో పని చేస్తూనే వీలున్నప్పుడల్లా విదేశీ పర్యటనలు చేశారు. చిన్నప్పటి కోరికను సాధించుకోవడానికి తగిన ప్రణాళికలు రచించుకున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశారు. అమెరికాలోని ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా పని చేస్తూనే.. తనకు ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్‌లో భాగంగా ప్రపంచ దేశాలను చుట్టేశారు. అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ భారతీయ యువతకు.. అక్కడ దేశాల యువతకు తారతమ్యం ఏమిటో తెలుసుకుని విశదీకరిస్తున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం విజయనగరం వచ్చిన ఆయనకు జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య స్వాగతం పలికారు. స్థానిక నెహ్రూ యువకేంద్రంలో డ్వామా ఏపీడీ లక్ష్మణరావుతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా రవిప్రభు వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటాల్లోనే... వారి ఐడియాలజీ.. మన యువతకు.. ఎప్పుడు ఎక్కడికెళ్లినా అందరూ నన్ను అడిగే ప్రశ్న ఒక్కటే.. అసలు మీరెందుకు ఇన్ని దేశాలు తిరిగారని. దీనికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. యువత ఎన్నో అనుకుంటారు. ఏవేవో కలలు కంటారు. కానీ వాటిని సొంతం చేసుకోవడంలో మాత్రం తడబడతారు. కొంతమంది అనుకున్నది సాధిస్తారు. మరికొందరు విఫలమవుతారు. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి, ఆశ ఉంటాయి. నాక్కూడా చిన్నప్పటి నుంచి ఒక్కటే ఆశ ఉండేది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరగాలి. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అక్కడి ప్రజల జీవన విధానాలను తెలుసుకోవాలి. ఇందుకోసం ముందుగా అమెరికా వెళ్లి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరా. నా సొంత డబ్బులతోనే ఇంతవరకు 186 దేశాలు తిరిగాను. విదేశాల్లో పర్యటించినప్పుడు చాలా కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొన్నాను. అక్కడ విద్యాభ్యాసం తీరు.. నేర్చుకునే విధానాలు వేరు. కొన్ని దేశాల్లోని విద్యార్థుల ఐడియాలజీ బాగుంటుంది. అలాంటి అంశాలను తెలుసుకొని భారతీయ యువతకు అందించాలనే ప్రధాన ఉద్దేశంతోనే నేను ఈ దేశాలన్నీ తిరిగాను. నేను వెళ్లాల్సినవి ఇంకా 9 దేశాలు ఉన్నాయి. త్వరలోనే ఆ దేశాల్లో కూడా పర్యటిస్తాను. (చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు) -
తెనాలి కుర్రోడు.. తగ్గేదే లే.. చదివింది 8.. నెలకు రూ.3లక్షలకుపైనే..
అతడో యూట్యూబ్ వ్లాగర్. 8వ తరగతిలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఫ్యాన్సీ షాపులో పని చేస్తూ రోజుకు రూ.20 సంపాదించేవాడు. నెలకు రూ.30 వేలు వస్తాయని తెలిసి దక్షిణాఫ్రికాకు ప్రయాణం కట్టాడు. ఆ వచ్చే రూ.30 వేలలో రూ.20 వేలు ఇంటి అద్దెకు ఖర్చయిపోయేవి. తినీ, తినక రోజులు గడిపాడు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ కలల మార్గంలో సాహస ప్రయాణం చేశాడు. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు విన్నాడు. చేతిలో రూపాయి లేకపోయినా 20 దేశాల్ని చుట్టి వచ్చాడు. వెళ్లిన ప్రతిచోటా అక్కడి విశేషాలతో కూడిన వీడియోలు తీసి ‘ఉమా తెలుగు ట్రావెలర్’ పేరిట యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. ఆ వీడియోలు నచ్చటంతో అతడి చానల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు చేరారు. ఇప్పుడు అదే చానల్ ద్వారా అతడు నెలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు. తెనాలి: ‘ఉమా తెలుగు ట్రావెలర్’.. మాలెంపాటి ఉమాప్రసాద్ అనే 33 ఏళ్ల యువకుడు నడుపుతున్న యూట్యూబ్ చానల్ పేరిది. కేవలం 18 నెలల్లో ఆఫ్రికా, మధ్య ఆసియాలోని 20 దేశాలను చుట్టేసి.. ఆయా దేశాల్లోని గ్రామాలు, అక్కడి గిరిజన జాతుల జీవన స్థితిగతులు, ఆహార, ఆచార, వ్యవహారాలపై తీసిన 340 వీడియోలతో 7 లక్షల ఫాలోవర్లు, 115 మిలియన్ల వ్యూస్ సాధించాడు. ఎనిమిదేళ్లలో 197 దేశాలను చుట్టి, అక్కడి వింతలు, విశేషాలను తెలుగు ప్రజలకు అందించాలనే ఏకైక ఆశయంతో పయనిస్తున్న తెనాలి కుర్రోడి విజయ గాథలోకి తొంగిచూస్తే.. చదువు మానేసి.. ఫ్యాన్సీ షాపులో పనిచేసి.. కృష్ణా జిల్లా మూలపాలెంలో ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన మాలెంపాటి రామశేషయ్య, నాగమల్లేశ్వరి దంపతుల ముద్దుల తనయుడు ఉమాప్రసాద్. రెండేళ్ల వయసులోనే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. దీంతో ఉమాప్రసాద్ కుటుంబం తల్లి నాగమల్లేశ్వరి పుట్టినిల్లయిన తెనాలి సమీపంలోని బూతుమల్లికి వచ్చేసింది. తెనాలిలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 8వ తరగతి వరకు చదివిన ఉమాప్రసాద్, అంతటితో చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. కుటుంబానికి సాయపడేందుకు ఫ్యాన్సీ షాపులో రోజుకు రూ.20 కూలితో పనిలో చేరాడు. 6 నెలల తరువాత తెనాలి ఆర్టీసీ బస్టాండ్‌లోని సైకిల్ స్టాండ్‌లో రూ.1,500 వేతనంతో పనికి కుదిరాడు. అక్కడా కొద్దిరోజులే పనిచేశాడు. ఆ తరువాత ఓ మెస్లోను, నిర్మాణ కంపెనీలోను, చెన్నై, హైదరాబాద్, అసోంలో రకరకాల పనుల్లో గడిపాడు. చివరకు సెక్యూరిటీ కంపెనీలో రూ.18 వేల జీతానికి చేరాడు. నాలుగేళ్లకు జీతం రూ.25 వేలకు చేరుకుంది. రూ.లక్షన్నర పోగేసి.. ప్రపంచ దేశాలను చుట్టి రావాలనేది ఉమాప్రసాద్ కల. కొంచెం ఖాళీ దొరికితే చాలు యూట్యూబ్‌లో ట్రావెల్ వీడియోలు చూస్తుండేవాడు. తన కలను నెరవేర్చుకునేందుకు 2018 నాటికి రూ.1.50 లక్షలు పోగేసుకున్నాడు. తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని తొలిసారిగా నేపాల్ వెళ్లాడు. స్కూటర్, మోటార్ సైకిల్, లారీ.. ఇలా ఏది కనబడినా లిఫ్ట్ అడిగి మరీ నేపాల్ చేరుకున్నాడు. అక్కడ జర్మనీ టూరిస్ట్ జంటతో పరిచయం పెంచుకున్నాడు. తగిన సంపాదన లేకుండా ప్రపంచ యాత్ర చేయడం కష్టమని, తిరిగి వెళ్లిపొతే మంచిదని ఆ జంట చెప్పడంతో డీలా పడిపోయాడు. తిరిగి స్వదేశానికి రాగా.. సెక్యూరిటీ కంపెనీలో ఉద్యోగం పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు. మరోవైపు నిలకడ లేనోడని బంధుమిత్రులు సూటిపోటి మాటలతో ఆడిపోసుకునేవారు. బంధువుల్లో ఒకరు దక్షిణాఫ్రికాలోని మాలిలో ఉద్యోగం ఉందని.. నెలకు రూ.30 వేలు జీతం ఇస్తారని చెప్పటంతో 2019లో మాలి చేరుకున్నాడు. అక్కడ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తూ ప్రపంచయాత్ర చేసే మార్గాలను అన్వేషించసాగాడు. ఏడాది తర్వాత 2020 మార్చి 22న స్వదేశానికి వచ్చేయాలనుకున్నాడు. సరిగ్గా అదే రోజు ఇండియాలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. చేసేదిలేక మాలిలోనే ఉండిపోయాడు. కలల బీజం నాటింది అమ్మే తన యాత్రకు కొంత విరామం ఇచ్చి సొంతూరికి వచ్చిన ఉమాప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రపంచ యాత్ర చేయాలనే తన కలకు బీజం వేసింది తన తల్లి నాగమల్లేశ్వరి అని చెప్పాడు. తన తల్లి ఉన్నత చదువులు చదవడంతో ఆమెకు జియోగ్రఫీ మేగజైన్లు, ఇంగ్లిష్ సినిమాలపై ఆసక్తి ఉండేదని.. వాటిని తల్లి తనకు కూడా పరిచయం చేసిందని చెప్పాడు. 19 ఏళ్లకే పెళ్లి చేసి, ప్రపంచ దేశాల విహారానికి పంపాలని తల్లి నాగమల్లేశ్వరి భావించారని.. ఆరి్థక పరిస్థితులు దెబ్బతినటంతో పెళ్లి సంగతటుంచి తానే సంపాదించాల్సి వచి్చందని చెప్పాడు. మాలిలో ఉద్యోగం చేయడం ద్వారా తన కలలకు ఓ రూపం వచ్చిందని, త్వరలోనే మళ్లీ తన యాత్రను పునఃప్రారంభిస్తానని ఉమాప్రసాద్ చెప్పాడు. ప్రపంచంలోని 197 దేశాలను చుట్టివచ్చి అక్కడి విశేషాలను తెలుగు ప్రజలకు అందించాలనేది తన ఆశయమని చెప్పాడు. అక్కడే మలుపు తిరిగింది.. మాలిలోనే ఉండే నీ కల నెరవేర్చుకోవచ్చు కదా అని స్నేహితులు చెప్పడంతో ఉమాప్రసాద్ ఆలోచించాడు. వారి ప్రోత్సాహంతో ప్రణాళికలు రచిస్తుండగా.. అతడి సెల్‌ఫోన్ కిందపడి పూర్తిగా దెబ్బతింది. ఉమా ఆసక్తిని గమనించిన వాటర్ ప్లాంట్ యజమాని ఇచి్చన రూ.30 వేలతో మే నెల 22న స్మార్ట్ ఫోన్, రూ.130తో సెల్ఫీ స్టిక్ కొన్నాడు. ఆ రోజే అతడి జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇండియాలో సాగయ్యే కూరగాయల్ని పండిస్తున్న ఆఫ్రికా వాసి మూసాతో తొలి వీడియో తీశాడు. ‘ఉమా తెలుగు ట్రావెలర్’ పేరుతో యూట్యూబ్‌లో వ్లాగ్ (వీడియోతో కూడిన బ్లాగ్) క్రియేట్ చేసి అప్లోడ్ చేశాడు. అలాగే వరుసగా 14 వీడియోలు పెట్టాడు. ఫాలోవర్లు 800 మంది వచ్చారు. ఆఫ్రికాలోని స్ట్రీట్ ఫుడ్‌పై తీసిన 15వ వీడియోతో అతడి జీవితం మారిపోయింది. జూన్ 1నుంచి అతడి వ్లాగ్కి విపరీతంగా ట్రాఫిక్ పెరిగింది. రోజుకు 15 వేల మంది ఫాలోవర్లను రికార్డు చేసింది. అదే అతడిలో ఆత్మవిశ్వాసం పెంచింది. కట్ చేస్తే ఏడాదిన్నర వ్యవధిలో దక్షిణాఫ్రికా, మధ్య ఆసియాలోని టాంజానియా, కెన్యా, ఉగాండా, జాంబియా, రష్యా సహా 20 దేశాలను సందర్శించాడు ఉమా ప్రసాద్. ఆ అభిరుచి ప్రస్తుతం యూట్యూబ్ చానల్ ద్వారా నెలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయాన్ని అతడికి తెచ్చిపెడుతోంది. -
Sudha Mahalingam: 70 ఏళ్ల డాక్టర్.. ఇప్పటికి 70 దేశాలు చుట్టారు.. ఇంకా
70 ఏళ్లు డాక్టర్ సుధా మహాలింగంకు. ఇప్పటికి దాదాపు 70 దేశాలు చుట్టేసిందామె. భయం లేదు.. గియం లేదు... బ్యాగ్ సర్దుకుని పదండి అంటోందామె. మరి తోడు? ఎవరూ అక్కర్లేదు.. మీరు ఎక్కడకు వెళితే అక్కడి మనుషులే తోడు అంటుంది. నిజానికి మన దేశాన్ని పూర్తిగా చూడటానికే ఒక జీవిత కాలం సరిపోదు. ఉన్న ఆయుష్షులో ఇంత పెద్ద ప్రపంచం చూడాలంటే ఎంత వేగిర పడాలి. అందుకే సుధా మహాలింగం భ్రమణకాంక్ష కొందరికి ఈర్ష్య పుట్టిస్తోంది... కొందరిచే టికెట్లు బుక్ చేయిస్తోంది. ‘వీలున్నప్పుడు మంచి ప్రయాణం చేయాలి అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. నామాట నమ్మండి. వీలు ఎప్పుడూ ఉండదు. వీలు చేసుకోవాలి’ అంటుంది సుధా మహాలింగం. ఆమె కథ కొంచెం అసూయ పుట్టించేదే. ‘చాలామంది మేగజీన్లలో మంచి మంచి ట్రావెల్ ఫొటోలు చూసి అంతటితో సంతృప్తి పడతారు. నా అదృష్టం... నేను ఆ చోట్లకంతా వెళ్లాను’ అంటుందామె. బెంగళూరుకు చెందిన సుధా మహాలింగంకు చెన్నైతో కూడా అనుబంధం ఉంది. ఆమె భర్త సివిల్ సర్వీసెస్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుధ ‘అందరూ చెప్పేటటువంటి తీర్చిదిద్దేటటువంటి’ జీవితాన్నే ఆ తర్వాతి 25 ఏళ్లు జీవించింది. 50వ ఏట వరకూ ఆమె కూడా ట్రావెల్ మేగజీన్లు చూస్తూ గడిపింది. అదనంగా చేసిన పని ఏదైనా ఉంటే భర్త టూర్లు వెళ్లినప్పుడు తోడు వెళ్లడమే. కాని ఒకసారి ఒక విశేషం జరిగింది. భర్తకు ఆఫీస్ పని మీద స్వీడన్లో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది. తోడు వెళ్లిన సుధకు అక్కడ ఖాళీగా ఉండటం బోరు కొట్టింది. ‘నేను ఒక్కదాన్నే ఫిన్లాండ్కు ఒక షిప్లో వెళ్లాను. అక్కడి నుంచి నార్వేకు ట్రైన్లో వెళ్లాను. అక్కడి నుంచి డెన్మార్క్, బెర్లిన్ తిరిగి మళ్లీ స్వీడన్ చేరుకున్నాను. భలే అనిపించింది’ అంటుంది సుధ. కాని ఆమె కాలి కింద చక్రాలు ఏర్పడటానికి 2003 రావాల్సి వచ్చింది. అంతకు రెండేళ్ల ముందు ఆమె ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ (ఇంధన శక్తి) ఎక్స్‌పర్ట్‌గా మారింది. ‘ఆ సమయంలో ఆ రంగంలో ఎవరూ ఎక్స్‌పర్ట్‌లు లేరు. దాంతో నాకు దేశవిదేశాల నుంచి కాన్ఫరెన్స్‌లకు ఆహ్వానాలు రాసాగాయి. 2003లో కిర్గిస్తాన్ వెళ్లాను ఒక్కదాన్నే. అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ వెళ్లాను. ఒక్కదాన్నే తిరగడంలో ఆనందం అర్థమైంది. ఇక నేను ఆగలేదు. నా భ్రమణ జీవితం నా 50వ ఏట మొదలైంది’ అంటుంది సుధా నాగలింగం. సుధకు ఇద్దరు కొడుకులు. వాళ్లు ఎప్పుడూ తల్లికి మద్దతే. ‘నీ ఇష్టం వచ్చినట్టు లోకం చూడమ్మా. కాని సేఫ్‌గా ఉండు’ అంటారు. కాని భర్త సంప్రదాయవాది. ‘ఆయన నేను ఎక్కడకు వెళ్లానో తెలిస్తే కంగారు పడతారు. అందుకని ఎక్కడికో చెప్పను. వచ్చాక నా ప్రయాణ అనుభవాలు బ్లాగ్‌లో రాస్తే చదువుకుంటారు. వచ్చేశాక ఏం భయం’ అని నవ్వుతుందామె. స్త్రీగా ఉంటూ ఒంటరిగా తిరుగుతూ 50 ఏళ్లు పైబడ్డాక ఇన్ని పర్యటనలు చేయడం సుధా నాగలింగంకే చెల్లిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె నేపాల్ మీదుగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ అధిరోహణ చేసింది. ఆస్ట్రేలియాలో డీప్ సీ డైవింగ్ చేసింది. ఆ దేశంలోని ‘ఉలురు’లో స్కైడైవింగ్ కూడా చేసింది. ఆకాశంలో ఇన్స్ట్రక్టర్ సహాయంతో దూకినప్పుడు ఆమె వయసు 66 సంవత్సరాలు. ‘నా ప్రయాణాల్లో అనుకోనివి ఎన్నో జరిగాయి. నైరోబీ ఎయిర్పోర్ట్ లో ఎల్లో ఫీవర్ వాక్సినేషన్ లేదని నన్ను ఆపేశారు. చైనాలో వెజిటేరియన్ రెస్టరెంట్ వెతకలేక ఆకలి తో నకనకలాడాను. చెక్ రిపబ్లిక్ లో వాలిడ్ వీసా లేదని చాలా హంగామా చేశారు. ఇరాన్లో ఒక చారిత్రక కట్టడం చూస్తుంటే నేను లోపల ఉన్నానన్న సంగతి మరచి సిబ్బంది తాళం వేసుకు వెళ్లిపోయారు. ఇన్ని జరిగినా చివరకు మనుషులు తోడు నిలిచారు. ప్రయాణాలు సాటి మనుషుల మీద విశ్వాసాన్ని పెంచుతాయి అని తెలుసుకున్నాను’ అంటుందామె. ‘నేను తిరిగిన అన్నీ దేశాల్లోకెల్లా ఇరాన్లో స్త్రీలు ఒంటరిగా చాలా సేఫ్‌గా తిరగొచ్చు అని తెలుసుకున్నాను.’ అంటుందామె. ఇరాక్‌ను కూడా చుట్టేసింది. ‘సాధారణంగా కొత్త ప్రాంతాల్లో తిరుగుతుంటే స్థానికులు ఆకర్షణీయంగా ఉండే స్త్రీలను చూస్తారు. గమనిస్తారు. కాని నా వయసు, మామూలు దుస్తులు నా మీద అటెన్షన్ పడేలా చేయవు. అందుకే నేను స్వేచ్ఛగా అన్నీ ఆస్వాదిస్తాను’ అంటుందామె. ‘ఇండోనేషియాలో రెయిన్ ఫారెస్ట్‌లో పది రోజులు ఉన్నాను. అక్కడ మోకాలు లోతున ఆకులు రాలిపడి ఉంటాయి. వాతావరణం అనూహ్యంగా ఉంటుంది. వేరెవరైనా సరే భయపడతారు. కాని నేను మాత్రం ప్రకృతి ఎంత చిక్కగా ఉంటుందో అక్కడే చూడగలిగాను. ఏ మలినం లేని ప్రకృతి అది’ అంటుంది సుధ. ఆమె ఇకపై ఆఫ్రికా ఖండం చుట్టాలనుకుంది. అక్కడ ఏ అనుభవాలు మూటకట్టుకోనుందో. ‘పెళ్లి.. పిల్లలు.. కెరీర్– ఉంటాయి. కాని ఇవి మాత్రమే జీవితం కాదు. మన జీవితంలో ఎన్నో జీవితాలు జీవించాలి. ప్రయాణాలు ఒక అవసరమైన జీవితం. అద్భుత జీవితం. జీవిస్తేనే అందులోని గొప్పతనం తెలుస్తుంది’ అంటుందామె. ఆమె మాటలు విని, కదిలే అదృష్టం ఎందరిదో. -
ఈయన ప్రపంచానికి ‘పక్కా లోకల్’గా!!
సాక్షి, ఒంగోలు: ‘సముద్రం జ్ఞానమైతే ఒక వెన్నెల రాత్రి పడవ మీద ప్రయాణించగలగటం ఒక మధురానుభూతి. జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి’ అనే డాక్టర్ మాచవరపు ఆదినారాయణ ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు సమీపంలోని చవటపాలెం గ్రామ నివాసి. ఒంగోలు సీఎస్ఆర్ శర్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆదినారాయణ ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. ‘ఇండియన్ ట్రావెలర్ ఇన్ రష్యా’ అనే పేరుతో రష్యన్ పత్రికలు డాక్టర్ ఆదినారాయణ గురించి వ్యాసాలు రాశాయి. జీవిత విశేషాలు డాక్టర్ ఆదినారాయణ ప్రయాణానుభవాలకి, ఆయన మైండ్ సెట్‌కీ ఒక కలయిక ఉంటుంది. ‘ఎగుడుదిగుడు కాలిబాటలు నా స్వర్గద్వారాలు’ అంటూ తన జీవిత లక్ష్యాన్ని చాటిచెప్పారాయన. ‘ఎన్ని దేశాలు తిరిగినా, కొత్త ప్రదేశం అంటూ ఏదీ అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ. ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం’ అంటారు. విశ్వమానవీయతను చాటే డాక్టర్ ఆదినారాయణ ప్రపంచానికి పక్కా లోకల్‌గా అనిపిస్తాడు. ఆయన స్వయంగా శిల్పి, చిత్రకారుడు. కొండలు, పర్వతాలు అధిరోహించటం, వాగులు, వంకలు, లోయల్లో ప్రయాణించడం, గ్రామీణ జీవితంలో లీనం కావడం, అక్కడి వనరుల్లోనే సర్దుకుపోవడం ఆయన తన ప్రయాణాల్లో నేర్చుకున్న అంశాలు. ఇప్పటి వరకు 7 ఖండాల్లో 30కి పైగా దేశాల్లో ఆయన పాదయాత్రలు చేశారు. ఈ క్రమంలో 30 వేల కిలోమీటర్లకు పైగా నడిచారు. ఆయన నడిచినంతమేరా ఆయా ప్రాంతాల భౌగోళిక విశేషాలు, కళ, సంస్కృతి, మతం, సారస్వతం, ఆహారం, ఆహార్యం, గృహ నిర్మాణం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ జీవిత నిర్మాణం, జీవన శైలి, వృత్తులు, విరామ సమయాల కాలక్షేపాలు పరిశీలిస్తారు. తన పరిశీలనలోకి వచ్చిన విషయాలను అక్షరీకరించి పుస్తకాలు రాస్తారు. ‘కదిలే పంజరం లాంటి ఈ శరీరంలో స్థిరంగా ఉండలేక, బంధాల్ని తెగ్టొట్టుకుని బయటికి వచ్చిన ప్రయాణాల పక్షిని నేను’ అన్న సొంత విచక్షణ కలిగిన డాక్టర్ ఆదినారాయణ కాలినడకతో ప్రపంచాన్ని చుట్టివచ్చారు. తన మీద ప్రభావం చూపిన వ్యక్తుల గురించి చెబుతూ.. ‘‘మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్లు మాదిరిగా పాటలు పాడుకుంటూ, ప్రకృతిని పూజించుకుంటూ పూర్తిస్థాయి దేశదిమ్మరిగా మారిపోదాం’ అనేవారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో లోకసంచారిగా ఉండాలని తీర్మానించుకున్నా. ‘ఒరే చిన్న గాలోడా’ అని చిన్నప్పుడు మా అమ్మ పిలిచేది. ఆ పిలుపును సార్థకం చేసుకున్నా’’ అని చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రయాణాల్లో కొన్ని.. ఆసియా ఖండంలోని నేపాల్(2009), భూటాన్(2010), ఇరాన్(2011), చైనా(2013), ఐరోపాలోని స్వీడన్(2012), నార్వే(2014), ఇటలీ(2014), బ్రిటన్(2015), స్కాట్లాండ్(2015), ఉత్తర అమెరికాలోని మెక్సికో(2014), దక్షిణ అమెరికాలోని బ్రెజిల్(2016), ఆఫ్రికాలోని నైజీరియా(2013), ఆస్ట్రేలియాలోని తాస్మానియా(2015)లో ఆయన చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలను ఆయన రాసిన ‘భూభ్రమణ కాంక్ష’లో పొందుపరిచారు. ఇటీవల రష్యా పత్రికల్లో ఆయన ప్రముఖంగా నిలిచారు. రష్యన్ కాలమిస్టు దిమిత్రో త్యికోటిన్ ‘వెలుగు–విజయం’ పేరుతో రాసిన వ్యాసం సాహిత్య లోకంలో చర్చనీయాంశమైంది. ఏ దేశం వెళితే ఆ దేశ భాష నేర్చుకునే స్కాలర్ జిప్సీ, ఇండియన్ మార్కోపోలోగా పేరు గడించిన డాక్టర్ ఎం.ఆదినారాయణ మన జిల్లా వాసి కావడం విశేషం. ‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది’ – డాక్టర్ మాచవరపు ఆదినారాయణ -
వయసు 21 చుట్టొచ్చిన దేశాలు 196
వాషింగ్టన్: కొత్త ప్రదేశాలను చుట్టిరావడం కొందరికి సరదా. కానీ లెక్సి ఆల్ఫ్రెడ్‌కి అదే జీవితాశయం. అయితే ఆమె లక్ష్యం చాలా పెద్దది. ఏకంగా ప్రపంచదేశాలను చుట్టిరావాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. అందుకోసం 12 ఏళ్ల వయసు నుంచే డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. తిరిగొచ్చిన దేశాల సంఖ్య 196. ఇంత చిన్న వయసులో ఇన్ని దేశాలు తిరిగొచ్చినవారు ఇప్పటిదాకా ఎవరూ లేరట. అందుకే లెక్సి ఆల్ఫ్రెడ్ త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోనుంది. తన 196 దేశాల పర్యటనకు సంబంధించి 10వేల ఆధారాలను గిన్నిస్ ప్రతినిధులకు పంపిందట. -
ప్రయాణికుడిని దోచుకున్న పోలీసులు
చెన్నై: దొంగలను పోలీసులు పట్టుకుంటారు. మరి పోలీసులే దొంగలైతే వారిని ఎవరు పట్టుకుంటారు..?. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో మంగళవారం ఇదే ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడిని దోచుకున్న ముగ్గురు పోలీసులు కటకటాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. దక్షిణ రైల్వే పరిధిలో చెన్నై సెంట్రల్ స్టేషన్ ఎంతో ప్రధానమైనది. రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నందున ఈ స్టేషన్ 24 గంటలూ కిటకిటలాడుతూ ఉంటుంది. దీంతో గవర్నమెంటు రైల్వేపోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు నిఘా ఉంటుంది. వీరితోపాటూ తమిళనాడు ప్రత్యేక పోలీసు దళం కూడా బందోబస్తు చేపడుతుంది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో పోలీసులు తన సొమ్ము కాజేశారంటూ ఒడిశాకు చెందిన బిజేంద్రరెడ్డి (23) అనే ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 15 ఏళ్లుగా చెన్నై తిరువాన్మీయూరులోని ఒక భవన నిర్మాణ సంస్థలో రోజుకు రూ.300 వేతనంపై రోజుకూలీగా పనిచేస్తున్నాడు. కేరళలో రోజుకు రూ.500లు ఇస్తున్నట్లు స్నేహితుని ద్వారా తెలుసుకుని ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు సెంట్రల్‌కు వచ్చాడు. అతను రావడం ఆలస్యం కావడంతో రైలు వెళ్లిపోయింది. మరో రైలు కోసం స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌లో కాచుకుని ఉండగా యూనిఫాంతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ‘నీపై సందేహంగా ఉంది, తనిఖీ చేయాలి రా..’ అంటూ మూర్మార్కెట్కు అనుకుని ఉండే ప్లాట్‌ఫారంపైకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి రిస్ట్‌వాచ్, రూ.1500 నగదు లాక్కున్నారు. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు పిలిచి విచారించగా, అనుమానంతో తనిఖీ మాత్రమే చేశాం, అతడిని కొట్టలేదు, సొమ్ము లాక్కోలేదని బుకాయించారు. వారి మాటలపై సందేహించిన అధికారులు ఫ్లాట్‌ఫారంపై ఉన్న సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ ముగ్గురే నిందితులను నిర్దారించుకున్నారు. తమిళనాడు ప్రత్యేక సాయుధదళం 13వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణన్, రాజ్, అరుళ్దాస్గా గుర్తించారు. మూడు నెలల పాటూ జామీనులో బయటకు రాలేని సెక్షన్లపై ముగ్గురిపై కేసులు పెట్టి మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్‌కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పడంతో వారు బస్సును పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్‌కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పడంతో వారు బస్సును పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్‌కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పడంతో వారు బస్సును పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
ప్రయాణికురాలి నుంచి రూ. 48 వేలు చోరీ
వికారాబాద్ రూరల్: ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 48 వేలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన భామిని సుజాత స్థానికంగా బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తోంది. మంగళవారం వికారాబాద్ బంద్ నేపథ్యంలో ఆమె సామగ్రి కొనుగోలు చేయడానికి హైదరాబాద్ వెళ్లేందుకు ఉదయం 11.30 గంటలకు వికారాబాద్ బస్టాండ్‌కు చేరుకుంది. 11.40 గంటలకు బస్సులో ఎక్కిన ఆమె కొద్దిసేపటికి తన బ్యాగ్‌లోని పర్సు కోసం చూడగా కనిపించలేదు. దీంతో షాక్‌కు గురైన సుజాత బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు విషయం తెలిపింది. పర్సులో రూ. 48 వేల నగదుతో పాటు, ఒక సామ్సంగ్ సెల్‌ఫోన్ ఉందని బాధితులు కన్నీటిపర్యంతమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్లో ఆర్జిస్తున్నారు..
ప్రస్తుతం ఆన్‌లైన్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సమస్త సమాచారమూ ఆన్లైన్లో అందుబాటులో ఉంటోంది. వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే ఆన్‌లైన్‌ను సరిగ్గా వినియోగించకుంటే ఆదాయం కూడా పొందొచ్చని నిరూపిస్తున్నారు కొందరు. బ్లాగ్లు, వెబ్సైట్లు, యూట్యూబ్ చానళ్లు.. ఇలా పలు మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఆన్లైన్ ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్న కొందరి గురించి తెలుసుకుందాం.. జానీ వార్డ్(రోజుకు వెయ్యి డాలర్లు) ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన జానీ వార్డ్ పేద కుటుంబానికి చెందిన వాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత 25 ఏళ్ల వయసులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడం అతడి పని. అప్పుడు జానీ నెల జీతం 20,000 డాలర్లు. అయితే జానీకి అటు ఉద్యోగం, ఇటు సంపాదన రెండూ సంతృప్తిని అందివ్వలేదు. అతడికి ప్రపంచాన్ని చుట్టి రావాలని కోరిక. దీంతో పాటే ఆదాయమూ పొందాలనుకున్నాడు. వెంటనే ఉద్యోగానికి స్వస్తి పలికి, వన్‌స్టెప్4 వార్డ్ అనే ఓ బ్లాగ్‌ను ప్రారంభించాడు. వెంటనే జింబాబ్వేకు ప్రయాణం ప్రారంభించాడు. అక్కడి విశేషాలను తన బ్లాగ్‌లో పొందుపరిచేవాడు. దీంతో ఈ ట్రావెల్ బ్లాగ్‌కు మంచి ఆదరణ లభించింది. ఇక అప్పటినుంచి అనేక దేశాలను సందర్శిస్తూ, వాటి విశేషాలను బ్లాగ్‌లో వెల్లడించేవాడు. అలా జానీ ప్రారంభించిన ట్రావెల్ బ్లాగ్‌ను ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఈ బ్లాగ్‌కు విశేష ఆదరణ లభించడంతో దీని ద్వారా ప్రస్తుతం రోజుకు వెయ్యి డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. వారానికి కొన్ని గంటలు మాత్రమే బ్లాగ్కోసం కేటాయిస్తాడు. ఇప్పటివరకు మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 దేశాల్లో జానీ ఇప్పటివరకు 152 దేశాలను సందర్శించాడు. బ్లాగ్ ద్వారా అటు ఆన్లైన్లో డబ్బు సంపాదిస్తూ, ఇటు విదేశాల్ని చుట్టిరావాలన్న తన కోరికనూ తీర్చుకుంటున్నాడు. పేద కుటుంబంలో జన్మించిన జానీ ప్రస్తుతం బ్యాంకాక్, థాయ్‌లాండ్, లండన్లలో సొంత ఇల్లు కలిగి ఉన్నాడు. బ్లాగ్ ప్రారంభించడం సులభమే అయినప్పటికీ, దాని ద్వారా ఎలా ఆదాయం పొందాలో తెలిసుండాలని జానీ సూచిస్తున్నాడు. ఫెలిక్స్ అర్విడ్ (ఏడాదికి రూ.యాభై కోట్లు).. వీడియోగేమ్స్ చాలా మంది ఆడేస్తుంటారు. సరదా కోసం ఆడే వీడియోగేమ్స్‌తో డబ్బు సంపాదించుకోవచ్చు అని నిరూపించాడు స్వీడన్‌కు చెందిన ఫెలిక్స్ ఎర్విడ్. ఇతడికి కూడా చిన్నప్పటి నుంచి వీడియోగేమ్స్ ఆడడం చాలా ఇష్టం. ఫెలిక్స్ యూట్యూబ్‌లో ప్యూడైపై పేరుతో ఓ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్‌కు ప్రస్తుతం దాదాపు ఐదు కోట్ల వరకు వీక్షకులు ఉన్నారు. ఇంతకీ అతడు ఈ చానల్లో ఏం చేస్తాడనుకుంటున్నారా? తను ఆడే వీడియోగేమ్స్‌కు సంబంధించిన దృశ్యాలను అందులో అప్లోడ్ చేయడమే. హర్రర్, యాక్షన్ వీడియో గేమ్స్ ఆడుతూ, అతడు చేసే విన్యాసాలు వీక్షకులను అలరిస్తున్నాయి. అయితే చాలా మంది ఫెలిక్స్ చేసే విన్యాసాలను విమర్శిస్తుంటారు కూడా. అయితేనేం.. కోట్ల మంది వీక్షకులు ఆ చానల్‌ను ఆదరిస్తున్నారు. దీంతో అతడికి యాడ్స్ రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. ఫెలిక్స్ సంవత్సరానికి రూ. 50 కోట్ల వరకు ఆర్జిస్తున్నాడు. ద దివా (నెలకు రూ.1,000 డాలర్లు) చాలా మందికి ఇతరులు చూస్తుండగా భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది. అయితే దక్షిణ కొరియాకు చెందిన పార్క్ సియో యెన్ మాత్రం అలా అందరిముందూ భోజనం చేస్తూ వేల డాలర్లు ఆర్జిస్తోంది. అదీ ఆన్లైన్లో. యెన్ గతంలో ఓ కన్సల్టెన్సీ సంస్థలో ఉద్యోగం చేసేది. కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఇష్టమైన పని చేయాలనుకుని వినూత్నంగా ఆలోచించింది. ఆమెకు భోజనం చేయడం అంటే మహా ఇష్టం. పెద్దమొత్తంలో ఆహారాన్ని ప్రతిసారీ గంటకుపైనే తినేది. అయితే దీన్ని ఒంటరిగా కాకుండా, కెమెరా ముందు చేయాలనుకుంది. వెంటనే తను భోజనం చేసే ప్రతిసారీ ఆన్‌లైన్‌లోకి వచ్చేది. అలా ఆన్లైన్లో ద దివా పేరుతో చాలామందితో చాట్చేస్తూ, లైవ్ స్ట్రీమింగ్‌లో భోజనం చేస్తుండేది. భారీ ఆహారం తింటూ, రోజూ నాలుగైదు గంటలు ఆన్లైన్లోనే గడిపేది. చివరకు ఈమె భోజనాన్ని లైవ్‌లో వీక్షించే వారి సంఖ్య లక్షలకు చేరింది. దీంతో యాడ్స్ పెరిగి యెన్‌కు మంచి ఆదాయం లభించింది. యెన్‌కు ఇలాంటి ఆలోచన రావడానికి కారణం కొరియన్లు ఒంటరిగా తినడాన్ని ఎక్కువగా ఇష్టపడరు. ఈమె ఆహారానికి నెలకు 3,000 డాలర్లు (రూ.20 వేలు) ఖర్చవుతుంది. అయితే ఆన్లైన్ యాడ్స్ ద్వారా ఈమె సంపాదన నెలకు 10,000 డాలర్లకు పైగానే ఉంది. పైగా ఈమె భోజనానికి అయ్యే ఖర్చులో కొంతభాగాన్ని పలువురు స్పాన్సర్లు అందించడం విశేషం. లారా మెల్లర్స్.. బ్రిటన్‌కు చెందిన లారా మెల్లర్స్ యూట్యూబ్ చానల్ ద్వారా ఆదాయం సంపాదిస్తోంది. ఈమె గతంలో ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసి, రిటైర్ అయింది. గినియా పందులు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇవి సాధారణ పందులతో పోలిస్తే చాలా భిన్నమైనవి. వీటని ఎంతో ఇష్టంగా చూసుకునేది. ఆ ఇష్టంతోనే వీటి పెంపకానికి సంబంధించిన దృశ్యాల్ని లారా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ వీడియోలకు మంచి ఆదరణ లభించింది. ఇలా ప్రతివారం ఈ పందుల పెంపకాన్ని వీడియో తీసి, తన యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంది. వీక్షకులు పెరగడంతో యాడ్స్ ద్వారా ప్రతి నెలా దాదాపు నాలుగు వేల వరకు డాలర్లు ఆర్జిస్తోంది.