బస్సెక్కుతుండగా చోరీ
Published Sun, Oct 2 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్‌కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పడంతో వారు బస్సును పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement