
వాషింగ్టన్: కొత్త ప్రదేశాలను చుట్టిరావడం కొందరికి సరదా. కానీ లెక్సి ఆల్ఫ్రెడ్‌కి అదే జీవితాశయం. అయితే ఆమె లక్ష్యం చాలా పెద్దది. ఏకంగా ప్రపంచదేశాలను చుట్టిరావాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. అందుకోసం 12 ఏళ్ల వయసు నుంచే డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. తిరిగొచ్చిన దేశాల సంఖ్య 196. ఇంత చిన్న వయసులో ఇన్ని దేశాలు తిరిగొచ్చినవారు ఇప్పటిదాకా ఎవరూ లేరట. అందుకే లెక్సి ఆల్ఫ్రెడ్ త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోనుంది. తన 196 దేశాల పర్యటనకు సంబంధించి 10వేల ఆధారాలను గిన్నిస్ ప్రతినిధులకు పంపిందట.
Comments
Please login to add a commentAdd a comment