ఇండోర్: భారత ప్రధాని నరేంద్రమోదీ ఆరోగ్య భారత్ ప్రచారానికి మద్దతుగా ఇండోర్‌లోని ఫార్మా విద్యార్థులు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు గుళికల ఆకారంలో సమూహాలుగా ఏర్పడి జనరిక్ మందులపై అవగాహన కల్పించారు. వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సమూహంలో 500 మంది నీలం రంగులో, మరో 500 మంది తెలుపు రంగులో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పునీత్ ద్వివేది నేతృత్వంలోని మోడ్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ నిర్వహించింది.
దీనిపై ద్వివేది మాట్లాడుతూ.. సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఫార్మసీ దినోత్సవం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇదివరకు కేరళ విద్యాసంస్థలు నెలకొల్పిన 438 ప్రజలతో కూడిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి కొత్తగా వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించడం సంతోషకరమన్నారు. ఈ రికార్డును అందజేయడానికి భారత నుంచి ప్రదీప్ మిశ్రా, యూఎస్ నుంచి డాక్టర్ సుకుల్ తదితరులు గిన్నిస్ బుక్ నిర్వాహకులుగా పాల్గొన్నారు.
ద్వివేది జనరిక్ మాత్రల గొప్పతన్నాన్ని వివరిస్తూ బ్రాండెడ్ కంపెనీలు జనరిక్ మాత్రలను ఎక్కువ ధరకు అమ్మితే అవే మందులను చిన్న కంపెనీలు తక్కువ ధరకు అమ్ముతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు, రసాయన శాస్త్రవేత్తలు అధిక లాభాలను అర్జించడానికి మందులను బ్రాండెడ్ కంపెనీలకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. అన్ని కంపెనీల జనరిక్‌మాత్రలు ఒకే నాణ్యత కలిగి ఉంటాయని కేవలం కంపెనీల పేర్లు మాత్రమే మారుతుంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment