generic medicine
-
జనరిక్స్‌పై మెడ్‌ప్లస్... మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల రిటైల్ దిగ్గజం మెడ్‌ప్లస్ ‘స్టోర్ జనరిక్’ కాన్సెప్టుపై మరింతగా దృష్టి పెడుతోంది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ కాన్సెప్టును దేశీయంగా తాము తొలిసారి ప్రవేశపెట్టినట్లు మెడ్‌ప్లస్ హెల్త్ సరీ్వసెస్ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి తెలిపారు. దీని కింద తమ స్టోర్స్‌లో నాణ్యమైన సొంత బ్రాండ్ ఔషధాలపై ఉత్పత్తిని బట్టి 50–80 శాతం మేర, సగటున 60 శాతం మేర డిస్కౌంటుకే విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే మార్కెటింగ్, డి్రస్టిబ్యూషన్ చానల్పరమైన వ్యయాల భారం తమకు ఉండని కారణంగా ఇది సాధ్యపడుతోందని మధుకర్ చెప్పారు. తొలుత హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ మోడల్‌ను క్రమంగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో ఏడు రాష్ట్రాల్లో 26.2 లక్షల మంది పైచిలుకు కస్టమర్లకు గడిచిన ఆరు నెలల్లో రూ. 139.7 కోట్ల మేర ఆదా అయిందని ఆయన వివరించారు. దేశీయంగా దాదాపు 800 పైగా ఔషధాలు ఉండగా .. 600 పైగా జనరిక్స్‌ను తాము అందిస్తున్నట్లు మధుకర్ చెప్పారు. దిగ్గజ సంస్థలతో జట్టు .. ‘‘సాధారణంగా జనరిక్స్ అంటే అంత నాణ్యమైనవి కాకపోవచ్చనే అపోహ ఉంటోంది. అయితే, బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ అనే తేడా లేకుండా పేటెంటు ముగిసిపోయిన ఔషధాన్ని ఎవరు తయారు చేసినా అది జనరిక్ ఔషధమే. కాకపోతే ఎంత నాణ్యతతో తయారు చేస్తున్నారనేది ముఖ్యం. మా వరకు మేము నాణ్యతకు పెద్దపీట వేస్తూ అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా, విండ్లాస్ బయోటెక్ వంటి దేశీయంగా అగ్రగామి ఔషధ తయారీ సంస్థ (సీడీఎంవో)ల దగ్గర జనరిక్స్‌ను తయారు చేయిస్తున్నాం. అధునాతన టెక్నాలజీలతో వాటి నాణ్యతను మేము కూడా స్వయంగా పరీక్షిస్తాం. పలు దిగ్గజ ఫార్మా సంస్థలకు కూడా ఈ సంస్థలు జనరిక్స్ అందిస్తున్నాయి. తమ ఫ్యాక్టరీల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ యూనియన్ నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తున్నాయి. కాబట్టి నాణ్యత విషయంలో రాజీ ఉండదు. అదే సమయంలో వేల సంఖ్యలో ఉన్న మా స్టోర్స్ ద్వారా విక్రయించడంతో మాకు మార్కెటింగ్పరమైన వ్యయాలు ఉండవు కాబట్టి ఆ మేరకు ప్రయోజనాలను కస్టమర్లకు నేరుగా బదలాయించగలుగుతున్నాం’’ అని మధుకర్ వివరించారు. దేశీ ఫార్మా విభాగంలో ఇదొక విప్లవాత్మక మార్పు కాగలదని ఆయన తెలిపారు. మరోవైపు, వైద్య పరీక్షల సేవలనూ గణనీయంగా విస్తరిస్తున్నామన్నారు. మెడ్ప్లస్కి ప్రస్తుతం పది రాష్ట్రాల్లో 4,200 పైచిలుకు స్టోర్స్‌లో సంఘటిత రిటైల్ ఫార్మసీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ఏపీయే స్ఫూర్తి..దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
-
బయెలాజికల్ ఇ చేతికి అకార్న్ ఇండియా
హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ అకార్న్ ఇండియాను హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయెలాజికల్ ఇ సంస్థ కొనుగోళ్లు చేయనున్నట్లు బీఇ ఎండీ మహీమా దాట్లా సోమవారం తెలిపారు. అయితే బయెలాజికల్ ఇ సంస్థ జాన్సన్ ఎండ్ జాన్సన్, జాన్సీన్ ఫార్మాలతో కలిసి పనిచేయడానికి ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉంది. తాజాగా అకార్న్ సంస్థను కొనుగోలు చేయడంతో కరోనా టీకాను మరింత వేగవంతంగా ప్రజల ముందుకు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు బయెలాజికల్ ఇ పేర్కొంది. ఫార్మా రంగంలో పేరొందిన అకార్న్ సంస్థ ఉత్పత్తులు కరోనా టీకాను వేగంగా పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుందని బీఇ సంస్థ డైరెక్టర్ నరేంద్ర దేవ్ మంతెన తెలిపారు. మరోవైపు త్వరలోనే జెనరిక్ ఉత్పత్తులను అన్ని దేశాలకు ఉత్పత్తి చేయనున్నట్టు బీఈ సంస్థ వర్గాలు పేర్కొన్నారు. చదవండి: సగం పనిచేసే వ్యాక్సిన్ వచ్చినా చాలు -
ఫార్మా విద్యార్థుల సరికొత్త గిన్నిస్ రికార్డు
ఇండోర్: భారత ప్రధాని నరేంద్రమోదీ ఆరోగ్య భారత్ ప్రచారానికి మద్దతుగా ఇండోర్‌లోని ఫార్మా విద్యార్థులు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు గుళికల ఆకారంలో సమూహాలుగా ఏర్పడి జనరిక్ మందులపై అవగాహన కల్పించారు. వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సమూహంలో 500 మంది నీలం రంగులో, మరో 500 మంది తెలుపు రంగులో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పునీత్ ద్వివేది నేతృత్వంలోని మోడ్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ నిర్వహించింది. దీనిపై ద్వివేది మాట్లాడుతూ.. సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఫార్మసీ దినోత్సవం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇదివరకు కేరళ విద్యాసంస్థలు నెలకొల్పిన 438 ప్రజలతో కూడిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి కొత్తగా వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించడం సంతోషకరమన్నారు. ఈ రికార్డును అందజేయడానికి భారత నుంచి ప్రదీప్ మిశ్రా, యూఎస్ నుంచి డాక్టర్ సుకుల్ తదితరులు గిన్నిస్ బుక్ నిర్వాహకులుగా పాల్గొన్నారు. ద్వివేది జనరిక్ మాత్రల గొప్పతన్నాన్ని వివరిస్తూ బ్రాండెడ్ కంపెనీలు జనరిక్ మాత్రలను ఎక్కువ ధరకు అమ్మితే అవే మందులను చిన్న కంపెనీలు తక్కువ ధరకు అమ్ముతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు, రసాయన శాస్త్రవేత్తలు అధిక లాభాలను అర్జించడానికి మందులను బ్రాండెడ్ కంపెనీలకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. అన్ని కంపెనీల జనరిక్‌మాత్రలు ఒకే నాణ్యత కలిగి ఉంటాయని కేవలం కంపెనీల పేర్లు మాత్రమే మారుతుంటాయని చెప్పారు. -
జనరిక్ మందులు పనిచేస్తున్నాయా?
బహుశా నేను రోగభ్రమగ్రస్తుడిని కావచ్చు కాబట్టి నాకు ఔషధాలపై గొప్ప నమ్మకం ఉంటోంది. నేను ఒక మాత్రను తీసుకున్నప్పుడల్లా, అది పనిచేస్తుందనే పూర్తి నమ్మకంతోనే తీసుకుంటాను. కానీ ఒక విషయంలో నేను భయకంపితుడినవుతున్నాను. ప్రత్యేకించి భారతదేశంలో తయారవుతున్న అనేక జనరిక్ మందుల విషయంలో నా నమ్మకం ఘోరంగా వమ్ము అయిందని నేను కనుగొన్నాను. వీటిలో చాలావరకు వాస్తవానికి పనిచేయడం లేదు. కొన్ని జనరిక్ మందులైతే ప్రమాదకరంగా ఉంటున్నాయి. వచ్చే వారం ప్రచురించనున్న ‘బాటిల్ ఆఫ్ లైస్: రాన్ బాక్సీ అండ్ ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫార్మా’ అనే పుస్తకం ఇస్తున్న కీలక సందేశం ఇదే. ఈ పుస్తక రచయిత్రి కేథరీన్ ఎబాన్.. ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన దాదాపు 20 వేల డాక్యుమెంట్లు, 240 మందితో నిర్వహించిన ఇంటర్వూ్యలు, భారతదేశంలోని జనరిక్ డ్రగ్స్ పరి శ్రమ ఎంతో వంచనాత్మకంగా, విశ్వాసఘాతుకంతో ఉంటోం దనీ, వోక్‌హార్ట్, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్ అండ్ ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ వంటి బడా సంస్థలు ఉత్పత్తులు తీవ్ర ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయ’ని పేర్కొన్నట్లు దాని కవర్ పేజీ చెబుతోంది. ఈ పుస్తకం ప్రధాన భాగం ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ సిగ్గుమాలిన వ్యవహారంపై చేసిన పరిశోధనతో కూడి ఉంది. అమెరికాలో 2013లో బాగా ప్రాచుర్యం పొందిన ఒక కోర్టు కేసులో కల్తీమందులను అమ్మిన ఏడు ఆరోపణలపై విచారణ సందర్భంగా మన్నించమని కోర్టును వేడుకోవడమే కాకుండా 500 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించిన విషయాన్ని ఇది వెల్లడిస్తోంది. ఔషధాలను అమ్మడానికి ముందుగా రాన్‌బాక్సీ వైఖరి తీరుతెన్నులను రచయిత్రి ఎబాన్ ఇలా ముగించారు – ‘మీరు తయారు చేసిన మందులను సమర్థంగా, మన్నికతో ఉండేలా రూపొందించారా అనే కోణంలో పరీక్షించాల్సి ఉంది. ఈ విషయంపై కంపెనీ ప్రకటించే డేటా తన ఔషధాలు రోగులను చంపడానికి బదులుగా కాపాడతాయన్న వాస్తవాన్ని రుజువు చేయాలి. కానీ రాన్‌బాక్సీ మాత్రం తన డేటాను పూర్తిగా మార్కెటింగ్ సాధనంగా మాత్రమే చూస్తోంది. ఇది చావు బతుకుల మధ్య వ్యత్యాసాన్ని తేల్చేసే సంపూర్ణ వంచన. ఈ కంపెనీ దాని ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశనూ తారుమారు చేసి తనకు ఉపయోగపడే డేటాను శరవేగంగా రూపొందించి మార్కెట్లో విడుదల చేసిపడేసింది. ఒక రాన్‌బాక్సీ మాత్రమే కాదు జనరిక్ మందుల తయారీ సంస్థలన్నీ క్రమబద్దీకరణ చట్టాలు కఠినంగా ఉండే యూరోపియన్, అమెరికన్ మార్కెట్ల కోసం అత్యున్నత నాణ్యత కలిగిన ఔషధాలను తయారు చేస్తూనే మరోవైపున భారత్ వంటి దేశాల్లో తక్కువ స్థాయి కలిగిన, పెద్దగా పనిచేయని మందులను ఉద్దేశపూర్వకంగానే అమ్ముతుంటాయి. ఇలాంటి వ్యవహారాలపై రాన్‌బాక్సీపై తీవ్రంగా దాడి చేసిన దినేష్ ఠాకూర్ ఈ పుస్తక రచయిత్రి కేథరిన్ ఎబాన్తో చెప్పారు: ‘భారత్‌లో ఔషధాలను పరీక్షించడం అనేది వ్యర్థ కలాపం మాత్రమే... కంపెనీలు తమ సొంత డోస్‌లను కనిపెట్టి వాటినే నేరుగా భారతీయ డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ)కి అమ్మేస్తుంటాయి. డీసీజీఐకి అమ్మే విషయంలో వీటికి అవసరమైనది మంచి, నమ్మకమైన డేటా కాదు.. మంచి సంబంధాలు ఉంటే చాలు’. భారతదేశంలో పేలవమైన ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా పాటిస్తూ అనారోగ్యకరమైన పరిస్థితుల్లో మోసపూరితంగా మందులను తయారు చేస్తున్నారని ఈ పుస్తకం స్పష్టం చేసింది. ఒక ప్లాంట్‌లో మైక్రోబయాలజీ ల్యాబరేటరీ ఉంది. ఇక్కడ వారు మైక్రోబ్లు, బాక్టీరియాలపై పరీక్షలు చేస్తుం టారు. కానీ వాస్తవమైన శాంపిల్స్ మాత్రం కలికానిక్కూడా ఇక్కడ కనబడవు. ‘ఈ నేపథ్యంలో వాళ్లు అక్కడ పరీక్షించేది అంటూ ఏమీ లేదు. మొత్తం ల్యాబరేటరీ స్థాపనే ఒక బూటకపు వ్యవహారంగా ఉంటోంది’. తన పుస్తకంలో కేథరీన్ ఎబాన్ వెల్లడించిన వివరాల్లో పావు శాతం మాత్రమే నిజం ఉన్నదనుకున్నా, అది కూడా భీతిల్లజేస్తోంది. అంటే, భారతీయ జనరిక్ మందులపై మన విశ్వాసం పక్కదోవలు పట్టిందనే దీని అర్థం. చాలా తరచుగానే ఇవి పనిచేయవు. కొన్ని సందర్భాల్లో మీరు ఎన్ని మాత్రలు తీసుకున్నప్పటికీ అవి వ్యాధిని లేక ఇన్ఫెక్షన్లను నివారించవు. ఒకవేళ ఏ మందైనా పనిచేసిందంటే అది చైనీస్ జనరిక్ మందులవల్లే అనేది వాస్తవం. ఎబాన్ తన పుస్తకానికి ప్రధాన ఆధారంగా తీసుకున్న దినేష్ ఠాకూర్ 2014 సెప్టెంబర్‌లో కూడా కేంద్రంలో ఆరోగ్యమంత్రిగా వ్యవహరిస్తున్న హర్షవర్ధన్‌తో సమావేశమై ఈ సమస్య తీవ్రత గురించి ఆయన్ని హెచ్చరించారు. ఈ భేటీకి గాను ఠాకూర్‌కి మంత్రి కేటాయించిన సమయం అయిదు నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో కూడా మంత్రి ఠాకూర్ మాటలు పట్టించుకోకుండా కశ్మీర్‌పై వార్తలు ప్రసారం చేస్తున్న టీవీని చూడటంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారట. చివరకు ఠాకూర్ తానేం కోరుకుంటున్నారో దాన్నంతటినీ రాతపూర్వకంగా తనకు పంపించాలని మంత్రి కోరారు. ఆవిధంగానే ఠాకూర్ సమాచారాన్ని రాతపూర్వకంగా పంపారు కానీ దానికి స్పందన మంత్రినుంచి ఎన్నడూ రాలేదు. దీంతో విసిగిపోయిన ఠాకూర్, చివరి ప్రయత్నంగా 2016లో సుప్రీంకోర్టుకు పిటిషన్ వేశారు. అయన ఈ విషయమై పీఐఎల్ లేక ప్రజాప్రయోజన వాజ్యాన్ని వేశారు. ఈ సందర్భంగా భారతీయ క్రమబద్ధీకరణ చట్టం నిర్వీర్యమైపోవడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా కూడా తయారైందని ఆయన వాదించారు. అంటే దీనర్థం ఏమిటి? ఈ దయనీయ స్థితి పట్ల పార్లమెంటు కానీ న్యాయవ్యవస్థ కానీ స్పందించిన పాపానపోలేదు. మీరూ, నేనూ జనరిక్ డ్రగ్స్‌ని అవి సమర్థంగా పనిచేస్తాయని విశ్వసిస్తూ, తీసుకుంటూ ఉంటాం కానీ, మందుల కంపెనీలు మనల్ని మూర్ఖులను చేస్తున్నాయి. అదేసమయంలో అధికారులు జరుగుతున్న తతంగాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రజారోగ్యం ఏ గంగలో కలుస్తున్నట్లు? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net కరణ్ థాపర్ -
అమెరికా ఫార్మా వివాదంలో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: కుమ్మక్కై ధరలు పెంచేశాయన్న ఆరోపణలపై అమెరికాలో విచారణ ఎదుర్కొంటున్న పలు జనరిక్ ఫార్మా సంస్థల్లో కొన్ని భారత్‌కు చెందినవి ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 18 సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఇందులో 5 దేశీ సంస్థలు (డాక్టర్ రెడ్డీస్, అరబిందో, జైడస్, ఎమ్క్యూర్, గ్లెన్‌మార్క్) ఉన్నాయి. ఈ సంస్థలన్నీ పోటీ లేకుండా చూసుకునేలా కుమ్మౖMð్క, 15 జనరిక్ ఔషధాల ధరలను పెంచేశాయంటూ అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో విశ్వాస ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణకు సారథ్యం వహిస్తున్న కనెక్టికట్ అటార్నీ జనరల్ తాజా విషయాలు తెలిపారు. పలు జనరిక్ డ్రగ్స్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. పిటీషన్లో పొడి అక్షరాలతో మాత్రమే వారి పేర్లను పేర్కొనడం జరిగింది. సన్ ఫార్మా సీనియర్ సేల్స్ మేనేజర్.. ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ వైస్ ప్రెసిడెంట్, ఎమ్క్యూర్ ప్రెసిడెంట్, జైడస్ సీనియర్ డైరెక్టర్ తదితరులు ఇందులో సహ–కుట్రదారులుగా అటార్నీ జనరల్ పేర్కొన్నారు. రాజీవ్ మాలిక్ అనే వ్యక్తి దీన్నంతా నడిపించినట్లు తెలుస్తోందన్నారు. -
జనరిక్ మందులనే వైద్యులు సూచించాలి
సాక్షి, హైదరాబాద్: తమ వద్దకు వచ్చే రోగులకు ప్రతి ఒక్క వైద్యుడు విధిగా జనరిక్ ఔషధాలనే రాసేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) సూచించింది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని స్పష్టం చేసింది. కమిటీ సమావేశం శుక్రవారం ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు పి. విష్ణుకుమార్‌రాజు, గద్దె రామ్మోహన్‌లతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. జనరిక్ మందులు ప్రజలకు తక్కువ ధరలకు లభ్యమౌతున్న నేపథ్యంలో వారి ప్రయోజనాల దృష్ట్యా వైద్యులు ఆ మందులనే రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాము రాసే మందుల పేర్లు రోగులకు సులభంగా అర్థమయ్యేలా వైద్యులు చూడాలని చెప్పారు. ఈ బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ తీసుకోవాలని స్పష్టం చేశారు. మానసిక రోగులకు చికిత్సకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను విజయనగరం జిల్లాలో నిర్ధేశించిన గడువులోగా ఖర్చు చేయకపోవటంతో ఆ తరువాత నిధులను కేంద్రం విడుదల చేయకపోవటాన్ని గుర్తించిన పీఏసీ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. రాష్ర్టంలోని క్యాన్సర్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలులో జరిగిన జాప్యం పట్ల పీఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.