న్యూఢిల్లీ: కుమ్మక్కై ధరలు పెంచేశాయన్న ఆరోపణలపై అమెరికాలో విచారణ ఎదుర్కొంటున్న పలు జనరిక్ ఫార్మా సంస్థల్లో కొన్ని భారత్‌కు చెందినవి ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 18 సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఇందులో 5 దేశీ సంస్థలు (డాక్టర్ రెడ్డీస్, అరబిందో, జైడస్, ఎమ్‌క్యూర్, గ్లెన్‌మార్క్) ఉన్నాయి. ఈ సంస్థలన్నీ పోటీ లేకుండా చూసుకునేలా కుమ్మౖMð్క, 15 జనరిక్ ఔషధాల ధరలను పెంచేశాయంటూ అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో విశ్వాస ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
దీనిపై విచారణకు సారథ్యం వహిస్తున్న కనెక్టికట్ అటార్నీ జనరల్ తాజా విషయాలు తెలిపారు. పలు జనరిక్ డ్రగ్స్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. పిటీషన్‌లో పొడి అక్షరాలతో మాత్రమే వారి పేర్లను పేర్కొనడం జరిగింది. సన్ ఫార్మా సీనియర్ సేల్స్ మేనేజర్.. ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ వైస్ ప్రెసిడెంట్, ఎమ్‌క్యూర్ ప్రెసిడెంట్, జైడస్ సీనియర్ డైరెక్టర్ తదితరులు ఇందులో సహ–కుట్రదారులుగా అటార్నీ జనరల్ పేర్కొన్నారు. రాజీవ్ మాలిక్ అనే వ్యక్తి దీన్నంతా నడిపించినట్లు తెలుస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment