హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ అకార్న్ ఇండియాను హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయెలాజికల్ ఇ సంస్థ కొనుగోళ్లు చేయనున్నట్లు బీఇ ఎండీ మహీమా దాట్లా సోమవారం తెలిపారు. అయితే బయెలాజికల్ ఇ సంస్థ జాన్‌సన్ ఎండ్ జాన్‌సన్, జాన్‌సీన్ ఫార్మాలతో కలిసి పనిచేయడానికి ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉంది. తాజాగా అకార్న్ సంస్థను కొనుగోలు చేయడంతో కరోనా టీకాను మరింత వేగవంతంగా ప్రజల ముందుకు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు బయెలాజికల్ ఇ పేర్కొంది.
ఫార్మా రంగంలో పేరొందిన అకార్న్ సంస్థ ఉత్పత్తులు కరోనా టీకాను వేగంగా పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుందని బీఇ సంస్థ డైరెక్టర్ నరేంద్ర దేవ్ మంతెన తెలిపారు. మరోవైపు త్వరలోనే జెనరిక్ ఉత్పత్తులను అన్ని దేశాలకు ఉత్పత్తి చేయనున్నట్టు బీఈ సంస్థ వర్గాలు పేర్కొన్నారు.
చదవండి: సగం పనిచేసే వ్యాక్సిన్ వచ్చినా చాలు
Comments
Please login to add a commentAdd a comment