
మళ్లీ పోలీస్‌గా...
‘ఆపరేషన్ దుర్యోధన’, ‘ఖడ్గం' చిత్రాలలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన హీరో శ్రీకాంత్ మరోసారి లాఠీ ఝుళిపించనున్నారు. అనగాని ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీకాంత్. అక్ష జంటగా ఎ.వి.వి దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవ లే విజయవాడలో ప్రారంభమెంది. కరణ్ బాబ్జీ దర్శకుడు. షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -
‘‘ ‘చండీ' సినిమాకు రచయితగా పనిచేసిన బాబ్జీ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కచ్చితంగా బ్రేక్ ఇస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. శ్రీకాంత్ గత చిత్రాల తరహాలోనే ఆయన పాత్రకు మంచి పేరు వస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, సహనిర్మాత: పి. సత్యనారాయణ.