భరత్ కొమ్మాలపాటి, శ్రీకాంత్, అభినవ్
‘‘అభినవ్ సర్దార్ చాలా రంగాల్లో విజయం సాధించాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ, ‘మిస్టేక్’ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా మారాడు. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ‘మిస్టేక్’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’. విలన్‌గా సర్దార్ నాకు పోటీ వచ్చిన పర్లేదు కానీ ఈ చిత్రం విజయం సాధించాలి’ అని హీరో శ్రీకాంత్ అన్నారు.
భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టేక్’. అభినవ్ సర్దార్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘భరత్ చెప్పిన కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ సినిమా నిర్మించాను’’ అన్నారు అభినవ్ సర్దార్. ‘‘జూలైలో ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు భరత్ కొమ్మాలపాటి.
Comments
Please login to add a commentAdd a comment