కన్నడ హీరో ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ నటించిన తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ .హెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు విడుదల హక్కులను కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎంవీఆర్ కృష్ణ దక్కించుకున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘నాన్న అని పిలిపించుకుంటే సరిపోదు... కూతుర్ని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుండాలి’, ‘నువ్వు పుట్టిన తిధి, వారం, నక్షత్రాలను బట్టి చూస్తే నీ గ్రహాలకి దోషం ఏర్పడినట్టుంది’ వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘రాక్షస’ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాకి కూడా ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment