కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటిస్తున్న చిత్రం ‘రాక్షస’. లోహిత్ .హెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.
తెలుగు విడుదల హక్కులను కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎంవీఆర్ కృష్ణ దక్కించుకున్నారు. గతంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘వేద’ చిత్రాన్ని ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంవీఆర్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూ΄పొందుతున్న
చిత్రం ‘రాక్షస’. మా సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment