Prajwal Devaraj
-
కూతుర్ని ఎలా చూసుకోవాలో తెలుసుండాలి!
కన్నడ హీరో ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ నటించిన తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ .హెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు విడుదల హక్కులను కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎంవీఆర్ కృష్ణ దక్కించుకున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.‘నాన్న అని పిలిపించుకుంటే సరిపోదు... కూతుర్ని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుండాలి’, ‘నువ్వు పుట్టిన తిధి, వారం, నక్షత్రాలను బట్టి చూస్తే నీ గ్రహాలకి దోషం ఏర్పడినట్టుంది’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘రాక్షస’ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాకి కూడా ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
శివరాత్రికి థ్రిల్
కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటిస్తున్న చిత్రం ‘రాక్షస’. లోహిత్ .హెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. తెలుగు విడుదల హక్కులను కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎంవీఆర్ కృష్ణ దక్కించుకున్నారు. గతంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘వేద’ చిత్రాన్ని ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంవీఆర్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూ΄పొందుతున్నచిత్రం ‘రాక్షస’. మా సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. -
భయపెట్టేలా ‘కరావళి’ టీజర్
ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలంటే కథలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలి. ఇది వరకు చూడనటువంటి కంటెంట్‌ను, కాన్సెప్ట్‌ను చూపిస్తేనే ఆడియెన్స్ థియేటర్ వరకు వస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ అంటూ అందరినీ మెస్మరైజ్ చేసే కంటెంట్, కాన్సెప్ట్‌తో వస్తున్నారు.‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ‘కరావళి’ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ మీద గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ప్రోమో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ టీజర్లోనే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి.మహిషాలకు, మానవులకు మధ్య జరిగే కాన్సెప్ట్‌లా ఈ టీజర్లో ఏదో కొత్త కథను చూపించారు. 'పిశాచి రాక' అంటూ వదిలిన ఈ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతోందని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.