భయపెట్టేలా ‘కరావళి’ టీజర్ | Karavali Teaser Out | Sakshi
Sakshi News home page

భయపెట్టేలా ‘కరావళి’ టీజర్

Published Tue, Dec 31 2024 6:16 PM | Last Updated on Tue, Dec 31 2024 6:16 PM

Karavali Teaser Out

ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలంటే కథలో ఏదో ఒక కొత్త పాయింట్‌ ఉండాలి. ఇది వరకు చూడనటువంటి కంటెంట్‌ను, కాన్సెప్ట్‌ను చూపిస్తేనే ఆడియెన్స్ థియేటర్‌ వరకు వస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ అంటూ అందరినీ మెస్మరైజ్ చేసే కంటెంట్, కాన్సెప్ట్‌తో వస్తున్నారు.

‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ‘కరావళి’ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ బ్యానర్ మీద గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ప్రోమో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ టీజర్‌లోనే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి.

మహిషాలకు, మానవులకు మధ్య జరిగే కాన్సెప్ట్‌లా ఈ టీజర్‌లో ఏదో కొత్త కథను చూపించారు. 'పిశాచి రాక' అంటూ వదిలిన ఈ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతోందని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement