
చిరంజీవి, శ్రీకాంత్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.

మెగాస్టార్‌ను శ్రీకాంత్ అన్నయ్య అని పిలుస్తాడు.

శ్రీకాంత్‌ను అతడు సొంత తమ్ముడిలా చూసుకుంటాడు.

దశాబ్దాలుగా వీరి మధ్య ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది.

మార్చి 23న శ్రీకాంత్ బర్త్‌డే.

దీంతో శనివారం నాడు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు చిరు.

కేక్ కట్ చేయించి తినిపించాడు.

కేక్‌పై హ్యాపీ బర్త్‌డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం విశేషం.

తర్వాత కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.



