Actress Malavika Shares Her Fight With Hero Srikanth For Chala Bagundi Movie - Sakshi
Sakshi News home page

Actress Malavika : 'పేరెంట్స్‌ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా'

Published Tue, Feb 1 2022 5:50 PM | Last Updated on Tue, Feb 1 2022 8:10 PM

Actress Malavika Shares Her Fight With Hero Srikanth For Chala Bagundi Movie - Sakshi

'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మాళవిక. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. సుమారు12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మాళవిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రీసెంట్‌గానే పుష్ప సినిమా చూశానని, అందులో సమంత చేసినట్లు స్పెషల్‌ సాంగ్‌ ఆఫర్‌ వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది. ఇక  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా బాగుంది సినిమాలో హీరో శ్రీకాంత్‌కి, గొడవ జరిగిందని తెలిపింది. 'ఓ రొమాంటిక్‌ సాంగ్‌ షూట్‌ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అవడంతో నాకు  అంత కంఫర్ట్‌ లేదని చెప్పాను. దీంతో శ్రీకాంత్‌ షూటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయారు.

ఇక ఈ సినిమాలో అత్యాచారం సీన్‌లో నటించినందుకు ఇప్పటికీ చాలా డిస్ట్రబ్‌గా అనిపిస్తుంది. హిందీలో కూడా సీయూ ఎట్‌9 చిత్రంలో ఎక్కువగా ఎక్స్‌పోజింగ్‌ చేయడంతో పేరెంట్స్‌ కోప్పడ్డారు. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా' అని మాళవిక  చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement