EVV satyananrayana
-
షూటింగ్లో హీరో శ్రీకాంత్‌తో నాకు గొడవ అయ్యింది : హీరోయిన్
'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మాళవిక. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. సుమారు12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మాళవిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. రీసెంట్‌గానే పుష్ప సినిమా చూశానని, అందులో సమంత చేసినట్లు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది. ఇక ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా బాగుంది సినిమాలో హీరో శ్రీకాంత్‌కి, గొడవ జరిగిందని తెలిపింది. 'ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవడంతో నాకు అంత కంఫర్ట్ లేదని చెప్పాను. దీంతో శ్రీకాంత్ షూటింగ్ మధ్యలోంచి వెళ్లిపోయారు. ఇక ఈ సినిమాలో అత్యాచారం సీన్లో నటించినందుకు ఇప్పటికీ చాలా డిస్ట్రబ్‌గా అనిపిస్తుంది. హిందీలో కూడా సీయూ ఎట్9 చిత్రంలో ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడంతో పేరెంట్స్ కోప్పడ్డారు. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా' అని మాళవిక చెప్పుకొచ్చింది. -
నవ్వుల పువ్వులు పూయించిన జంధ్యాల శిష్యుడు
-
వీళ్లిద్దరూ కవలలు కాదు... కాదా?
మరి నాన్న గురించి ఏమడిగినా కవలల్లానే కనెక్ట్ అవుతున్నారేంటి?ఒకరికి చక్కిలిగింత పెడితే మరొకరికి నవ్వు వచ్చినట్టు.. ఒకర్ని గిల్లితే ఇంకొకళ్లకి కన్నీళ్లు వచ్చినట్లు.. వీళ్లిద్దరికీ నాన్న అంత దగ్గర. ఏది చేసినా నాన్న కీర్తి పెరగాలని, నాన్న ఆశయం నిలవాలని, నాన్న మాట నిలబెట్టాలని ఒకేలా ఆలోచించే ‘థాట్ ట్విన్స్’ ఈ హలో బ్రదర్స్. మీ నాన్నగారితో మీ మెమరబుల్ మూమెంట్స్.. రాజేశ్: ‘హాయ్’ సినిమా ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ సీన్ ఇంకా గుర్తున్నాయి. ఫస్ట్ టైమ్ నాన్న ఒక డైరెక్టర్లా నాకు సీన్ వివరించడం, నేను ఆయన్ను డైరెక్టర్లా అనుకుని చేయడం.. ఆ రోజు థ్రిల్లింగ్‌గా అనిపించింది. లొకేషన్లో ఫాదర్ అండ్ సన్‌లా కాదు. పని విషయంలో రూల్స్ రూల్సే. ఆ సినిమాకు నేను హీరో అవ్వొచ్చు కానీ అంతా ఆయన చేతుల్లోనే. డాడీతో ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ‘హాయ్’ ఓ స్వీట్ మెమరీ. నరేశ్: నేను బాగుండనని, నన్ను డైరెక్టర్ని చేయాలని అనుకునేవారు. కాకపోతే ‘నువ్వు బాగుండవు’ అనే మాట నాతో అని, నన్ను డిజప్పాయింట్ చేయలేదు. నేను ‘అల్లరి’ సినిమా చేసినప్పుడు ఆయన పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. రిలీజ్‌కి ముందు సురేశ్‌బాబుగారు, దర్శకుడు రవిబాబు, నాన్నగారు సెకండ్ షో వేసుకొని చూశారు. నాకు 24 ఏళ్లు వచ్చేవరకూ మా నాన్నగారి పక్కనే పడుకునేవాణ్ని. ‘అల్లరి’ షో చూసొచ్చి, రూమ్‌లోకి వచ్చీ రాగానే ‘చాలా బాగా చేశాడు. ఆర్టిస్ట్‌గా సక్సెస్ అవుతాడు’ అని అమ్మతో అన్నారు. మరో బెస్ట్ కాంప్లిమెంట్ ‘గమ్యం’కి ఇచ్చారు. ‘ఈ కథ ముందు నాకు చెప్పి ఉంటే వద్దనేవాణ్ని. నీది మంచి డెసిషన్’ అన్నారు. నాన్నగారు లేని ఇల్లు ఎలా అనిపిస్తోంది? నరేశ్: ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. వెలితి ఎప్పుడు తెలుస్తోందంటే... నాన్నగారికి పిల్లలంటే చాలా ఇష్టం. మా పిల్లల్ని చూసినప్పుడు ఆయన బ్రతికుంటే అసలు పిల్లల్ని ఎత్తుకుని కిందకి దించేవారు కాదేమో అనిపిస్తుంటుంది. మీ నాన్నగారు కెరీర్‌వైజ్‌గా ఇచ్చిన సలహాలేంటి? నరేశ్: ‘ఒకరికి మంచి చేయకపోయినా çఫర్లేదు కానీ చెడు చేయొద్దు. మన వల్ల ఎవరూ బ్లేమ్ అవ్వకూడదు. గొడవలకి వెళ్లకూడదు’ అనేవారు. ఆయన లైఫే మాకు మంచి లెసన్. మా ఆఫీస్ ముందు 20కి పైగా కారులు ఉన్న టైమ్‌ని చూశాం. హిట్స్ లేనప్పుడు ఎవరూ పలకరించని ఇన్సిడెంట్స్నీ చూశాం. ‘ఈవీవీ అయిపోయాడు’ అనే మాటని తట్టుకోలేక ‘ఈవీవీ సినిమా’ బేనర్ స్టార్ట్ చేసి, నాన్నగారు ‘చాలా బాగుంది’ తీశారు. ముందే ‘చాలా బాగుంది’ అని టైటిల్ పెట్టేస్తే సరిపోతుందా? అన్నవాళ్లు ఉన్నారు. సినిమా హిట్ కాబట్టి ఎవ్వరూ మాట్లాడలేదు. రాజేశ్గారూ.. మీ అబ్బాయి అచ్చం మీ నాన్నగారిలానే ఉన్నాడు... రాజేశ్: మా ఆరవ్‌ని ఎక్కడికి తీసుకెళ్లినా ‘చిన్న ఈవీవీ’గారు అంటుంటారు. (చెమర్చిన కళ్లతో). చిన్న ఈవీవీగారు అల్లరి చేస్తున్నారా? నరేశ్: (నవ్వేస్తూ)... మా తర్వాతి జనరేషన్లో మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ అబ్బాయి వాడు. అబ్బాయి అమ్మాయి అని కాదు కానీ ఫస్ట్ బేబీ కాబట్టి స్పెషల్. వాడు పుట్టినప్పటి నుంచి ‘ఈవీవీగారిలా ఉన్నాడు’ అని అందరూ అనడం వల్ల అమ్మ బాగా గారం చేస్తారు. అల్లరి చేసినా ఏమీ అనరు. ‘అమ్మా కోప్పడాలి. వెనకేసుకు రాకూడదు. తిట్టమ్మా’ అంటాం. ఈవీవీగారు ఉన్నప్పుడే మీ పెళ్లి సెట్ అయింది కదా? రాజేశ్: అవును. ఆయన ఉండగానే మాట్లాడాం. నా పెళ్లి చూడకపోయినా ఫలానా అమ్మాయిని చేసుకుంటున్నాడు అని ఆయనకు తెలుసు. కనీసం ఆ తృప్తి అయినా మిగిలింది. నరేశ్: రాజేశ్ ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 10న అనుకున్నాం. నాన్నగారు జనవరి 21న చనిపోయారు. పెళ్లి ఇలా చేయాలని మీ నాన్నగారు చెప్పారా? రాజేశ్: రాజమండ్రిలో మ్యారేజ్ అనుకున్నాం. పెళ్లి అక్కడ బంధువుల మధ్య చేసి, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్, సన్నిహితుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయాలన్నారు. నాన్నగారికి బంతి భోజనం అంటే ఇష్టం. ఆయన అనుకున్న మండపంలోనే, ఆయన చూసిన అమ్మాయినే, ఆయన ఎలా అయితే అనుకున్నారో అలానే నా పెళ్లి జరిగింది. ఈవీవీగారు ‘బెస్ట్ హోస్ట్’. అతిథులకు వడ్డించే వంటకాల విషయంలో కేర్ తీసుకునేవారు కదా? నరేశ్: మా నాన్నగారు ఏది చేసినా ఒక మార్క్ ఉండేలా చేస్తారు. ఈస్ట్ వెస్ట్‌లో ఫుడ్‌తో చంపేస్తారు. అందరూ విందులో స్వీట్స్, ఐస్‌క్రీమ్స్ పెడుతున్నారు కాబట్టి మనం జున్ను పెడదాం అని అది తయారు చేయించేవారు. అన్నయ్య పెళ్లికి నాన్నగారి స్థాయికి తగ్గట్టుగా విందు ఏర్పాటు చేయాలనుకున్నాం. పెళ్లికి 84 ఐటెమ్స్ పెట్టాం. ‘పిల్లలు కదా ఎలా చేస్తారో అనుకున్నాం. ఆయన పిల్లలనిపించుకున్నారు’ అని అందరూ అన్నారు. అంటే.. ఫుడ్‌లో కూడా మేం ఆయన పిల్లలు అనిపించుకోవాలంటే అది తెలియని బాధ్యత. అదొక హ్యాపీ ఫీలింగ్. మీ నాన్నగారి ఆత్మ శాంతంగా ఉండాలంటేæ మీ ఇద్దరూ ఎప్పటికీ కలిసుండాలి. పెళ్లయ్యాక మీ ఇద్దరూ ఎలా ఉంటున్నారు ? నరేశ్: అందరం హ్యాపీగా ఉన్నాం. రాజేశ్: నాన్నగారు అనుకున్నట్లుగానే ఒకే ఇంట్లో ఉంటున్నాం. మా ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు నా మరదలు (నరేశ్ భార్య) బాగా చూసుకుంది. మా పిల్లలు కూడా చక్కగా ఉంటారు. ఆస్తి విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఆ మధ్య ఏదో ఇష్యూ ఉందనే వార్త ఒకటి వచ్చింది? నరేశ్: అలాంటిది ఏదీ లేదండి. మా ఫాదర్ పేపర్స్ మీద ‘ఇది నాకు.. ఇది వాడికి’ అని ఎప్పుడూ పెట్టలేదండి. ఏది కొన్నా రెండు కొనేవారు. ఒకటి నరేశ్‌కి ఇంకోటి రాజేశ్‌కి అనేవారు. మా ఇంట్లో అందరికంటే స్ట్రాంగ్ మా అమ్మగారే. డబ్బులున్నప్పుడు, లేనప్పుడు ఒకేలా ఉన్నారు. నాన్నగారు పోయాక రాజేశ్ పెళ్లి అయిపోయింది. ‘వీడు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడేమో’ అని నా విషయంలో అమ్మ కంగారు పడేవారు. ‘లేదమ్మా నేను అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటా’ అని ఆవిడ చూసిన అమ్మాయినే చేసుకున్నాను. ఇంటికి వచ్చిన అమ్మాయిలు కూడా చక్కగా కలిసిపోయారు. పిల్లల్ని చూసినప్పుడల్లా నాన్నగారుంటే బావుణ్ణు అనిపిస్తుంటుంది. రాజేశ్ : మా మధ్య ఏవో గొడవలున్నాయనే వార్త నిజం కాదండీ. మేం ‘బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్’ కాదు. మాకు కష్టాలు తెలుసు. నాన్నగారు సంపాదించి ఇచ్చినదాన్ని కాపాడుకోవాలి. అలాగే మేం ఇంకా సంపాదించాలి. మా తాతయ్య, నానమ్మ (ఈవీవీగారి తల్లిదండ్రులు) ఇద్దరూ ఉన్నారు. ఒకే డేట్‌కి ఒక సంవత్సరం నాన్నగారు, ఆ మరుసటి ఏడాది మా బాబాయి చనిపోయారు. నాన్నమ్మ, తాతయ్యలకు అది పెద్ద షాక్. కొడుకు చేతిలో కొరివి పెట్టించుకోవాలని అనుకుంటారు ఎవరైనా. నాన్న ఆత్మ శాంతంగా ఉండాలంటే ఆయన అనుకున్నట్టు చేస్తే సరిపోతుంది. ఆయన పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి. మేం బాగుండాలి. అలానే ఉంటున్నాం. కష్టాలు తెలుసు అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్? రాజేశ్: మా 8, 9 క్లాసెస్ వరకూ కష్టాలుండేవి. నరేశ్ : మీకో ఎగ్జాంపుల్ చెబుతాను. ‘చెవిలో పువ్వు’ ఫ్లాప్. సక్సెస్ వస్తే ఓకే కానీ ఫ్లాప్ అయితే చాలు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి. చిన్నప్పుడు మేం చెన్నైలోఉండేవాళ్లం. అక్కడ వడపళని టెంపుల్‌కి వెళ్లినప్పుడు మాకు ముంత కొనిచ్చారు. నేను, అన్నయ్య డబ్బులు దాచుకునేవాళ్లం. నాన్నగారికి టీ, కాఫీ తాగాక సిగరెట్ తాగకపోతే చిరాకుగా ఉండేది. ఓసారి ఆయన దగ్గర సిగరెట్లు కొనడానికి డబ్బుల్లేవు. హుండీ పగలకొట్టి సిగరెట్ తెచ్చాను. అవి కొనడం తప్పని తెలిసే వయసు కాదు నాది. నాన్న కోసం అది చేయాలనిపించింది. 20 రూపాయిలు అప్పు తీసుకున్న రోజులూ ఉన్నాయి. రాజేశ్: అప్పట్లో మేం ఉన్న ఇంటి అద్దె 550 రూపాయిలు. 2, 3 నెలలు కట్టకుండా ఉండేవాళ్లం. స్కూల్ ఫీజ్ కూడా కట్టలేని పరిస్థితులను చూశాం. నరేశ్ : నాకు రాజేశ్ మీద కోపం ఉండేది. వాడి బర్త్‌డే ఫిబ్రవరి 14. కొత్త బట్టలు కొనేవారు. నాది జూన్ 30. సరిగ్గా స్కూల్ స్టార్ట్ అయ్యేది. నాలుగు జతల యూనిఫామ్‌లో ఒక దానికి పసుపు రాసి, బర్త్‌డే రోజు వేసుకోమనేవారు. క్లాస్‌లో 72 మంది ఫ్రెండ్స్ ఉంటే.. 25 చాక్లెట్స్ కొనిచ్చి, క్లోజ్‌గా ఉండేవాళ్లకు ఇవ్వమనేవారు. ఎవరెవరికి ఇవ్వాలో తెలియక నేనే తినేసేవాణ్ణి. ఈవీవీగారు రెడీ చేసిన స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా? నరేశ్: కొన్ని కథలు స్టేల్ అయ్యాయి. అవి అప్పటి సందర్భాలకు తగ్గట్టుగా రాసినవి. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో ‘యుగాంతం’ అని వార్త వచ్చినప్పుడు, ‘కొంప కొల్లేరు’ అనే టైటిల్‌తో కథ అనుకున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ కథ చెప్పారు. ‘2012 డిసెంబర్లో యుగాంతం అంటున్నారు కదా.. మనం నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేద్దాం’ అన్నారు. అయితే అనుకోకుండా 2011లో నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆ కథతో సినిమా తీయలేం. ఇంకొన్ని ఇలానే స్టేల్ అయ్యాయి. ఈవీవీగారు, చలపతిరావుగారు మంచి ఫ్రెండ్స్. మీ డాడీ మరణం ఆయన్ని కూడా కుంగదీసిందా? నరేశ్: చలపతిరావుగారి లైఫ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నాన్నగారు ‘మా నాన్నకు పెళ్లి’ మూవీ స్టోరీ రాశారు. చలపతి బాబాయ్ మిసెస్ ఎప్పుడో చనిపోయారు. ‘తోడు ఉండాలి. మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా’ అని నాన్నగారు బాబాయ్‌తో చాలాసార్లు అన్నారు. కానీ చేసుకోలేదు. నాన్న, బాబాయ్‌ల ఫ్రెండ్షిప్ జర్నీ దాదాపు 15 ఏళ్లు పైనే. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే వాళ్లదే. చలపతి బాబాయ్ టీ, కాఫీ కూడా తాగరు. చాలామంది నాన్నగారు మందు తాగుతారనుకునేవాళ్లు. కానీ ఆయనకు అలవాటు లేదు. నాన్నగారిని ఆయన చాలా మిస్సవు తున్నారు. ‘ఆయన ఉండి ఉంటే బాగుండేది’ అంటుంటారు. ఈ నెల 30న మీ బర్త్‌డే. మీ నాన్నగారు ఉన్నప్పుడు జరుపుకున్న బర్త్డేస్లో గుర్తుండిపోయినది? నరేశ్: ‘చిలక్కొట్టుడు’ షూటింగ్ అబ్రాడ్‌లో జరిగినప్పుడు 200 డాలర్లు పెట్టి పెద్ద కేక్ తెప్పించారు. సెట్లో ఫస్ట్ టైమ్ నేను సెలబ్రేట్ చేసుకున్న బర్త్‌డే అది. అక్కడ కేక్ కట్ చేయడం నాకు మంచి మెమరీ. రాజేశ్: ‘హాయ్’ మూవీ షూటింగ్ దుబాయ్‌లో జరిగినప్పుడు నా బర్త్‌డే వచ్చింది. ‘రారా’ అని తీసుకెళ్లి ఒమేగా వాచ్ కొనిపెట్టారు. ఆ వాచ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఫైనల్లీ.. మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు దాచుకున్నది? నరేశ్: నాకు చాలా వాచ్‌లు కొనిపెట్టారు కానీ నేను ఇప్పటికీ వాడుతున్న గిఫ్ట్ నాన్న ఇచ్చిన ‘వ్యాలెట్’. ఒకసారి నేను పర్స్ కొనడానికి వెళితే, ‘నీ అంతట నువ్వు కొనుక్కునే కన్నా ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది’ అని పక్కన ఉన్నవాళ్లు అన్నారు. అప్పుడు నాన్న ‘నా వ్యాలెట్ తీసుకో. ఆ డబ్బులు నాకిచ్చెయ్’ అన్నారు (నవ్వులు). ఆ పర్స్ భద్రంగా ఉంది. మా ఇద్దరి షూ సైజ్ ఒకటే. నా షూస్‌ని ఆయన, ఆయనవి నేను వాడేవాళ్లం. అవి ‘నైస్ మూమెంట్స్’. రాజేశ్: ఇందాక చెప్పినట్లు ఒమేగా వాచ్ నా దగ్గర ఎప్పటికీ ఉంటుంది. మెటీరియల్స్ గురించి వదిలేస్తే.. నాన్నగారితో గడిపిన ప్రతి క్షణం వ్యాల్యుబుల్. మాకు ఎన్నో మంచి మెమరీస్‌ని మిగిల్చారు. మీ నాన్నగారు దూరమయ్యాక మీ ఇద్దరూ సినిమాలు తగ్గించేశారు. కారణం ఏంటి? నరేశ్: ఏదైనా సక్సెస్ మీదే డిపెండ్ అయ్యుంటుంది. చాలా కష్టపడి ‘లడ్డూ బాబు’ చేశాను. ‘యాక్షన్ 3డీ’ చేశాం. సక్సెస్ అవ్వలేదు. రెగ్యులర్ కామెడీ సినిమాలు చేస్తే ఎప్పుడూ అవేనా అంటారు. ఇదివరకు వరుసగా మాకు రెండు ఫ్లాప్స్ వస్తే నాన్నగారు మాతో ఓ హిట్ సినిమా తీసేవారు. దాంతో బ్యాలెన్స్ అయిపోయేది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ లేదు. ఇప్పటివరకూ రాజేశ్‌ది కానీ నాది కానీ ఒక్క సినిమా కూడా స్టార్ట్ అయ్యి, ఆగిపోయింది లేదు. ఇదివరకు కథ కొంచెం ఫర్లేదు అనిపించినా చేసేవాళ్లం. కానీ ఇప్పుడు కొంచెం డౌట్ ఉన్నా.. వద్దు అనేస్తున్నాం. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. రాజేశ్: నాన్నగారు పోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను. పెళ్లయిన తర్వాత ఇంకాస్త గ్యాప్ వచ్చింది. ఈ ఇయర్ నుంచి వరుసగా సినిమాలు చేస్తాను. ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా ఒక విషయంలో మీ నాన్నగారితో మీ ఇద్దరూ విడివిడిగా వాదించిన సందర్భాలేమైనా ఉన్నాయా? రాజేశ్: ‘ఫిట్టింగ్ మాస్టర్’ సినిమా విషయంలో నాకు, డాడీకి వాదన జరిగింది. ‘ఇది మీ స్టైల్ సినిమా కాదు. మీకు సెట్ అవ్వదు’ అన్నాను. డాడీ వినలేదు. అప్పుడు గట్టిగా వాదించాను. అయినా తీశారు. నరేశ్: ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. ఆ సినిమా ఇప్పుడు తీసుంటే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎంత వద్దన్నా ఆ సినిమా చేశారు. అంత కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. అప్పట్లో మీ ఇద్దరి కోసం చాలా సినిమాలు తీశారు. కొన్ని సినిమాలకు డబ్బులు పోయాయి కూడా... నరేశ్: డబ్బులు గురించి నాన్నగారు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన చనిపోయాక మేం ‘ఈవీవీ సినిమా’ బేనర్ మీద ‘బందిపోటు’ సినిమా చేశాం. బేనర్‌కి మంచి వ్యాల్యూ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ మూవీయే చేయాలనుకున్నాం. మా దురదృష్టం.. హిట్ కాలేదు. డబ్బుకన్నా కూడా ఆ ఫ్లాప్‌ని మేం అవమానంగా భావించాం. హిట్టయితే ‘ఈవీవీ పిల్లలు ఆయన బేనర్ మీద మంచి హిట్ సినిమా తీశారు’ అని చెప్పుకునేవాళ్లు. అది మిస్సయినందుకు బాధగా అనిపించింది. రాజేశ్: ఆ విషయంలో చాలా బాధపడ్డాం. మళ్లీ మా బేనర్ మీద సినిమా ప్లాన్ చేస్తున్నాం. – డి.జి. భవాని -
ఈవీవీ గుడ్..
పరీక్ష బాగా రాస్తే టీచరమ్మ ఎర్ర ఇంకు పెన్నుతో ‘వి వి గుడ్’ అని రాస్తుంది. తెలుగు సినిమాలో ఇ.వి.వి గారి మార్కు, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇ.వి.వికి పడిన మార్కులను చూస్తే ఆయన డిస్టింక్షన్లో పాసయ్యాడనే చెప్పాలి. ఈ పుట్టిన రోజుకు ఇ.వి.వి గారు ఉండి ఉంటే డెరైక్షన్‌లో 25 ఏళ్లు పూర్తి చేసి ఉండేవారు. ‘ఉంటే’ ఏంటి..? 100% ఉన్నారు. 50 సినిమాల సాక్షిగా ఉన్నారు. ఆ 50 సినిమాల నుంచి పుట్టిన, పెరిగిన, పరిగెడుతున్న ధోరణిలో ఇ.వి.వి ఇప్పటికీ ఉన్నారు. నవ్వుతూ... నవ్విస్తూ... మనసులను స్పృశిస్తూ... ఇంకొన్నిసార్లు శ్వాసలో పరిమళంలా అనిపిస్తూ... అందరి చేత ‘వి వి గుడ్’ అనిపించుకుంటూ ఉన్నారు. పంచేంద్రియాల్లాంటి అయిదుగురు పంచుకున్న పాతిక విషయాలతో ఇ.వి.వి ఈ ఏడాదికి 25 ఏళ్ల దర్శకత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఆ కోరికలు మాత్రం నెరవేరలేదు - చలపతిరావు అమ్మా నాన్నలను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో ఈవీవీని చూసి నేర్చుకోవాల్సిందే. ఈవీవీకి తన అమ్మా, నాన్నలంటే ఎంతో ప్రేమ. ఎంత బిజీగా ఉన్నా నెలకొక సారైనా సొంత ఊరు కోరుమామిడి వెళ్లి వాళ్ల అమ్మా నాన్నలతో గడిపి వచ్చేవాడు. స్టార్ హోటల్లో ఉండే అవకాశం ఉన్నా కూడా పల్లెటూళ్లో ఆ ఇంట్లోనే ఉండి అమ్మతో తనకు నచ్చిన వంటలన్నీ చేయించుకుని ఆనందపడేవాడు. ఉమ్మడి కుటుంబంలోని అనురాగాలూ అనుబంధాలేంటో ఈవీవీకి బాగా తెలుసు. కుటుంబ సభ్యులందరూ ఒకచోటే ఉండాలని ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు, అమ్మానాన్నలకు సొంత ఊళ్లో అయిదు పోర్షన్ల ఇల్లు కట్టించి ఇచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల ‘భువన విజయం’ తరహాలో ఈవీవీ దగ్గర ఎప్పుడూ ఆరేడుగురు రచ యితలు ఉండేవారు. ఒక్కొక్కొరూ ఒక్కో వెర్షన్ రాసిస్తే, అందులోంచి మంచినంతా ఏరుకుని ఆయనో స్క్రిప్ట్ రెడీ చే సేవారు. ఏడాదికి రెండు సినిమాలు తప్పనిసరిగా తీసేవాడు. 40-50 మంది ఆర్టిస్టులకు ఓ భరోసా కల్పించేవాడు. అసలెప్పుడూ ఫారిన్ మొహం చూడని వాళ్లను కూడా ఫారిన్ తీసుకెళ్లాడు. ఎవరు వచ్చి వేషం అడిగినా కాదనేవాడు కాదు. తను చేసిన గుప్త దానాలైతే లెక్కే లేదు. ఈవీవీ ప్రకృతి ప్రేమికుడు. మొక్కల్ని బాగా ఇష్టపడేవాడు. నర్సరీ కనబడితే కారుకి బ్రేక్ పడాల్సిందే. లోపలకు వెళ్లి ఎన్నెన్నో కొత్త మొక్కలు కొనుక్కొచ్చేవాడు. హైదరాబాద్ శివార్లలో ఓ ఎకరం పొలం కొని, కడియం నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టి మొక్కలు తెప్పించాడు. మొక్కల మధ్య, మనుషుల మధ్య, నవ్వుల మధ్య గడపడాన్ని ఎంత ఇష్టపడేవాడంటే అంత ఇష్టపడేవాడు. ఈవీవీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అతనే. చిత్రమేమిటంటే తను నాకన్నా ఇరవై ఏళ్లు పైగా చిన్న. ‘ప్రేమఖైదీ’ సినిమా టైం నుంచి మేం క్లోజ్ అయ్యాం. ’ప్రేమఖైదీ’ స్క్రిప్టు నేను ప్రొడ్యూస్ చేయాలని రాయించుకున్నాను. అది ఎన్నో మలుపులు తిరిగి రామానాయుడు గారి దగ్గరకు వెళ్లడం, ఈవీవీ కెరీర్ మలుపు తిరగడం జరిగింది. క్యాన్సర్ వచ్చి చనిపోయే చివరి క్షణం వరకూ కూడా నేను తోడుగా ఉన్నా. తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని, మనవళ్లూ, మనవరాళ్లతో ఆడుకోవాలని ఎంతో తపించాడు. ఆ కోరికలు మాత్రం నెరవేరలేదు. అసలు ఈవీవీ ఇంత త్వరగా వెళ్లిపోయాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాకు చాలా ధైర్యం చెప్పాడు- కోట శ్రీనివాసరావు నేను చాలా మంది హేమాహేమీల్లాంటి దర్శకులతో పనిచేశాను. కానీ ఈవీవీలాగా నాతో ఇన్నిన్ని రకాల పాత్రలు చేయించిన దర్శకుడు ఇంకెవరూ లేరు. ఆయన తొలి సినిమా ‘చెవిలో పువ్వు’ మొదలుకుని, చివరి సినిమా ‘కత్తి కాంతారావు’ వరకూ ఏవో రెండు మూడు సినిమాలు మినహా దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను, అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్సే. ఈవీవీ డైరె క్షన్లో నేను చేసిన సినిమాల్లో టాప్ ఫైవ్ ఎంచమంటే చాలా కష్టం. తప్పదంటే మాత్రం చెబుతాను. 1) ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు 2) హలో బ్రదర్ 3) మా నాన్నకు పెళ్లి 4) ఏవండీ ఆవిడ వచ్చింది 5) ఆమె ఈవీవీ మంచి దర్శకుడు. అంతకు మించి మంచి మనిషి. అందరికీ మంచే చేశాడు తప్ప, ఎవ్వరికీ హాని తలపెట్టలేదు. ఉన్నంత కాలం పదిమందికీ భోజనం పెట్టాడు. చాలా మంది కమెడియన్లు ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలి. ఆయన వల్ల ఎన్నో మంచి పాత్రలు దక్కించుకుని, కెరీర్‌ని నిలబెట్టుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయన లేకపోవడం తెలుగు ఇండస్ట్రీకే కాదు, కామెడీ ప్రపంచానికే తీరని లోటు. వర్క్... వర్క్... వర్క్... ఇదే ఆయన నమ్మిన సిద్ధాంతం. రోజులో 24 గంటలూ పనిచేసినా అలిసిపోయేవాడు కాదు. తాను కష్టపడి పనిచేసేవాడు. తన చుట్లూ ఉన్నవాళ్లను కూడా అలాగే పనిచేయించేవాడు. మంచి కెప్టెన్ లక్షణాలు ఉన్నాయి తనలో. మా అబ్బాయి చనిపోయాక... నేను మానసికంగా బాగా వీక్ అయిపోయా. అలాంటి పరిస్థితుల్లో కూడా మా ఇంటికి వచ్చి నాకు చాలా ధైర్యం చెప్పాడు. ‘‘సినిమాలు మానొద్దు... చేస్తూనే ఉండండి. అప్పుడే త్వరగా కోలుకోగలుగుతారు’’ అని నన్ను ప్రోత్సహించి, నాకు మంచి వేషం ఇచ్చారు. కానీ విధి విలాపం... అదే ఆయన ఆఖరి సినిమా కావడం విషాదం. ఆ విషయంలో ఆయన చాలా బాధపడేవారు- అలీ నేను బాలనటునిగా మద్రాసు వీధుల్లో తిరుగుతున్న సమయంలో... అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఆయన నాకు పరిచ యం. నేను సైకిల్ మీద అన్ని సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండేవాణ్ణి. ఈయనేమో ట్రస్టుపురం నుంచి టీనగర్ వరకూ నడుచుకుంటూనే వచ్చేసేవారు. క ష్టాలు, కన్నీళ్లు అన్నీ చూసి అంచెలంచెలుగా ఎదిగాడాయన. తాను స్థిరపడటమే కాకుండా తన తమ్ముళ్లను, బావలని ఇంకా చాలా మంది బంధువులను ఇండస్ట్రీకి తీసుకువచ్చి అందరికీ మార్గం చూపించిన మహానుభావుడు. ‘చెవిలో పువ్వు’ ఫ్లాప్ కావడంతో ఈవీవీ చాలా అప్సెట్ అయ్యారు. ఆ సమయంలో రామానాయుడు గారు అండగా నిలిచారు. ‘ఇంద్రుడు-చంద్రుడు’కి కో-డెరైక్టర్‌గా పనిచేయమన్నారు. ఆ తర్వాత ‘ప్రేమఖైదీ’ చేసే అవకాశం ఇచ్చారు. అందులో శారదగారు తప్ప మిగతా వాళ్లందరూ చిన్న ఆర్టిస్టులే. అయినా పెద్ద హిట్ కొట్టి చూపించారు. ఈవీవీ పుట్టినరోజు అంటేనే పండుగ రోజులా జరిగేది. ఆయన ఇంటిమందు 40-50 కార్లు క్యూ కట్టి ఉండేవి. అదే మనిషి ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. బర్త్‌డే విషెస్ చెప్పడానికి కూడా సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కలేంటో అర్థం కాదు. ఈ విషయంలో ఆయన చాలా బాధ పడేవారు. ఇండస్ట్రీ అంటే ఇంతేనా అని ఓ సందర్భంలో నాతో అన్నారు. ఈవీవీ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో వందమందికి పైగా బతుకుతున్నారు. ఆయనో మహా వృక్షం. దాన్నుంచి ఇంకా ఫలాలు వస్తూనే ఉంటాయి. కమెడియన్లు చాలా మంది ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలి. కొంతమంది ఆయన్ను గుర్తు కూడా పెట్టుకోలేదు. నేనైతే ఈవీవీ గారిని ఎప్పటికీ మర్చిపోను. నేను చైల్డ్ ఆర్టిస్టు నుంచి కమెడియన్‌గా టర్న్ అయ్యాక, ‘ప్రేమఖైదీ’తో ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మహానుభావుడాయన. ఈవీవీ సినిమాల్లో నాకు బాగా నచ్చినవి... ఆలీబాబా అరడజను దొంగలు, ఆ ఒక్కటి అడక్కు, ప్రేమఖైదీ, సీతారత్నంగారి అబ్బాయి, ఆమె. ఆ స్క్రిప్ట్ ఎందుకనో తెరకెక్కలేదు- ఎల్బీ శ్రీరామ్ కో-డెరైక్టర్ నుంచి డెరైక్టర్‌గా మారేందుకు ఇ.వి.వి. శ్రమపడుతున్న రోజులవి. చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా మానేసి, మద్రాసెళ్ళి, డైలాగ్ రైటర్‌గా స్థిరపడాలని ప్రయత్నిస్తున్న నన్ను తీసుకెళ్ళి ఇ.వి.వి.కి పరిచయం చేశాడు నటుడు విద్యాసాగర్. ఆ సమయంలో జంధ్యాల గారి సినిమాకి ఇ.వి.వి. డబ్బింగ్ చెప్పిస్తున్నాడు. డబ్బింగ్ ఏదైనా చెబుతానని ముచ్చటపడితే, రెండు పాత్రలకు నాతో డబ్బింగ్ చెప్పించాడు. తరువాత రోజుల్లో ఇ.వి.వి. నాకు ఒక కథ ఇచ్చి, స్క్రిప్టు చేయమన్నారు. నేను రాసిచ్చిన స్క్రిప్టు చదివి, ‘‘నేనంటూ డెరైక్టర్నైతే, మీరే రైటర్’’ అన్న ఇ.వి.వి. మెచ్చుకోలు నాకో పెద్ద టానిక్. తరువాత ఆయన డెరైక్టర్, నేను రైటర్ అయ్యాం. కానీ, మమ్మల్ని దగ్గర చేసిన ఆ స్క్రిప్టు ఎందుకనో తెరకెక్కనే లేదు. జీవితంలో చాలా కష్టపడి పైకొచ్చిన ఇ.వి.వి. అప్పట్లో ఒక చిన్న గదిలో గడిపిన రోజులు నాకు గుర్తే. అమ్మానాన్నల్ని ఊరి నుంచి తీసుకొచ్చి, మద్రాసులో మేడ మీద ఒక చిన్న కొట్టాయమ్ (పర్ణశాల)లో ఇ.వి.వి. ఉంచిన రోజులు... దర్శకుడిగా తాను స్థిరపడ్డాక తన వాళ్ళందరినీ జీవితంలో కుదురుకొనేలా చేయడానికి పడ్డ తపన... దగ్గర నుంచి చూశా. చిన్న రైతుగా నానా అవస్థలు పడిన నాన్నను వంద ఎకరాల ఆసామిగా చూడాలని, ఊళ్ళో పొలం కొని, వైట్ అండ్ వైట్ డ్రెస్, మారుతీ కారులో తిరగమంటూ తండ్రిని బంగారంలా చూసుకొన్నాడు. చాలామంది హాస్యానికి పెద్దపీట వేస్తే, ‘ఎవడిగోల వాడిది’, ‘బురిడి’ లాంటి చిత్రాల కోసం కమెడియన్లందరినీ విదేశాలకు తీసుకువెళ్ళి, అక్కడ షూటింగ్ చేసేందుకు ‘పెద్ద ఫ్లయిటే’ ఇ.వి.వి. వేశాడు. నిజానికి, జంధ్యాల గారి దగ్గర పనిచేస్తున్న రోజుల నుంచి ఆర్ట్ ఫిల్మ్స్, ఎక్స్పరిమెంటల్ ఫిల్మ్స్ - ఇలా అన్ని రకాల కథలూ ఇ.వి.వి. తయారు చేసుకొనేవాడు. అంత సాధన చేశాడు కాబట్టే, ‘ఆమె’, ‘తాళి’, ‘కన్యాదానం’ లాంటి విభిన్నమైన సినిమాలు తీశాడు. టైటిల్ పెట్టడంలోనే కాదు... టైటిల్ కార్డుల్లో స్టోరీకి ‘అంతులేని కథ’ అనీ, డైలాగ్ రైటర్‌కి ‘కోతల రాయుడు’ అనీ వెరైటీగా చూపెట్టడంలోనూ ఇ.వి.వి.ది ప్రత్యేక ముద్ర. ఆయన ఎంత సౌందర్యారాధకుడంటే, సొంత ఇల్లు కట్టుకున్నాక, దేశదేశాల నుంచి రకరకాల చిత్రమైన వస్తువులు పట్టుకొచ్చి, ఇంటిని నింపేసి, అద్భుతమైన మ్యూజియమ్లా తీర్చిదిద్దాడు. ఇ.వి.వి.లోని గొప్ప లక్షణం ఏమిటంటే, రైటర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చేవాడు. రచయిత ఏ మంచి పదప్రయోగం చేసినా, మహదానందపడిపోయేవాడు. రైటర్ స్క్రిప్టు చదివి, వినిపించడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. తానే స్క్రిప్టు చదువుకొనేవాడు. స్క్రిప్టు చదువుతున్నప్పుడు ఆయన ముఖంలో కలిగే మార్పుల్ని బట్టి రైటర్‌గా పాసయ్యామో, లేదో తెలిసిపోయేది. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో ‘గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్‌కు ఎందుకు?’, ఇద్దరి పేర్లను కలిపేసి ‘దాసరి రాఘవేంద్రరావు’ లాంటి వినోద ప్రయోగాల్ని ఎంజాయ్ చేసేవారు. ఎవరైనా, ఏదైనా కావాలని వస్తే ఇ.వి.వి. ‘లేదు... కుదరదు’ అనేవాడు కాదు. సంపా దించడం, అనుభవించడం, పంచిపెట్టడం, దాచిపెట్టడం - డబ్బుకున్న ఈ 4 లక్షణా లనూ ఆచరించిన వ్యక్తి ఆయన. అందులోనూ, మూడోది ఎక్కువగా తెలిసిన మనిషి. అందుకే, ఒక్కముక్కలో ఇ.వి.వి నా లాంటి ‘ఎందరికో (ఇ) వెలుగునిచ్చిన (వి) వ్యక్తి (వి)’. -
అవును...2017లో మెగాఫోన్ పడతా
చాలామంది నటీనటులు నటనే కాదు, ఇతర శాఖలపై మక్కువ చూపటం సాధారణ విషయమే. 24 కళల్లో తమకు నచ్చిన శాఖను ఎంచుకుంటున్నారు. అందులో దర్శకత్వం శాఖ అంటే అందరికీ మోజే... అవకాశం దొరికితే తమ సత్తా చాటేందుకు మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా హీరో అల్లరి నరేష్ దర్శకత్వంపై మోజు పడ్డాడు. త్వరలో మెగా ఫోన్ పడతానని చెబుతున్నాడు. తనకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టమని తెలిపాడు. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టమైన పని అని.... 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అల్లరి నరేష్ తన మనసులోని మాట చెప్పాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మోరులో 'బందిపోటు' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న అల్లరోడితో చిట్ చాట్..... అన్నయ్య రాజేష్, నేను నిర్మాతలుగా మా బ్యానర్లో బందిపోటు తొలి సినిమాగా నిర్మిస్తున్నాం. ఈవీవీ బ్యానర్‌పై వచ్చే సినిమాలను చూసిన జనం మంచి సినిమా వచ్చింది అనుకులేలా ఉండాలన్నదే మా ధ్యేయం. ఇకపై ఏడాదికి ఒక సినిమా సొంత బ్యానర్లో, మిగిలినవి ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన బ్యానర్లలో నటిస్తా. * బందిపోటు సినిమా కథాంశం ఏంటి ఒక్కమాటలో చెప్పాలంటే హీరో పేరు విశ్వా ఘరానా దొంగ. ప్రజలను దోచుకునే దొంగలను తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి దోచుకుంటుంటాడు. * ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో నటించారు బందిపోటు నా 48వ సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మాతగా సాయికిశోర్ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చేఏడాది జనవరిలో నా 50వ సినిమాలో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రముఖ నటి రాధ కుమార్తె కార్తీక, మోనాల్‌గజ్జర్ హీరోయిన్లగా సిరి సినిమా బ్యానర్‌పై నూతన దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్లో ఉంది. * లడ్డూబాబు సినిమాపై మీ అభిప్రాయం తెలుగు పరిశ్రమలో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. అయితే కొంత నిరాశను మిగిల్చిన మాట వాస్తవం. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజూ నా శరీరంపై 38 కిలోల బరువున్న మేకప్ వేసేవారు. మేకప్ ఉన్నంతకాలం చాలా కష్టంగా ఉండేది. దీనికోసం నెల రోజులపాటు లండన్‌లో ఉండి మేకప్ గురించి తెలుసుకున్నా. తెలుగులో మొదట త్రీడీ సినిమాలో నటించానన్న తృప్తి మిగిలింది. *దర్శకత్వం చేసే ఆలోచన ఉందా నాకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టం. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టం. 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. * ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా ప్రేమ వివాహమైతే ఇప్పటికే జరిగిపోయి ఉండేది. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను. బహుశా వచ్చే ఏడాది నా పెళ్లి ఉండొచ్చు.