మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో వివాదం నెలకొంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో మా కార్యవర్గం స్పందించింది. సోమవారం సమావేశమైన సభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. మా అసోసియేషన్ డబ్బులతో ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని, ఫోన్ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు.