స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైంకుఠపురములో’ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్‌లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బన్నీ కెరీర్‌లో బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాటకు అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 263 మిలియన్ వ్యూస్ రాబట్టి.. తెలుగులో అత్యధిక మంది చూసిన సాంగ్‌గా రికార్డులకు ఎక్కింది. (లేట్‌గా లేటెస్ట్‌గా దుమ్మురేపుతున్న బుట్టబొమ్మ)
తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా ‘అల వైకుంఠపురములో’ సినిమాపై ప్రశంసలు జల్లు కురిపించారు. కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, జబ్బా వంటి సినిమాలతో బీటౌన్‌లో సంజయ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘అల వైకుంఠపురములో’ చూసిన ఆయన.. బన్నీ గురించి, సినిమా గురించి ట్విటర్‌లో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో చూశాను. ఎంతో వినోదభరితంగా ఉంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడకపోతే.. ఆ లోటు ఎప్పటికీ ఉండిపోతుంది. ప్రస్తుతమున్న పరిస్థితులన్నీ కుదుటపడ్డాక, వీలైనంత త్వరగా ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలి’. అంటూ సంజయ్ ట్వీట్ చేశారు. (కరోనా: మరో బుల్లితెర నటుడికి పాజిటివ్)
#JustWatched ALA VAIKUNTHAPURRAMULOO on Netflix.
— Sanjay Gupta (@_SanjayGupta) July 11, 2020
What a film! Pure unadulterated entertainment. Not having seen it in a full theatre will be a life long regret.
Beat the pandemic blues and watch this gem asap.
కాగా సంజయ్ ట్వీట్‌పై బన్నీ స్పందించారు... ‘మీరు ఈ సినిమా చూడటం ఆనందంగా ఉంది. సినిమాను ఇష్టపడినందుకు మీకు థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బన్నీ ట్వీట్‌పై మళ్లీ డైరెక్టర్ సంజయ్ స్పందించారు. సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అయినట్లు సంజయ్ పేర్కొన్నారు. ‘బ్రదర్.. మీ యాక్టింగ్‌కి నేను ఎలా కనెక్ట్ అయ్యానో చెప్పలేను. మీరు నన్ను నవ్వించారు.. ఏడిపించారు. జీవితాంతం నేను మీ అభిమానిని. మీతో వర్క్ చేయడానికి ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఇక సంజయ్ ఆఫర్ ఇవ్వడంపై బన్నీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత)
Thank you very much Sanjay Ji ! Glad u really liked the movie . Humbled
— Allu Arjun (@alluarjun) July 11, 2020
Comments
Please login to add a commentAdd a comment