అంధుడైన హీరోకు వాచీ ఎందుకు?
అంధుడైన హీరోకు వాచీ ఎందుకు?
Published Thu, Dec 22 2016 11:06 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
సంజయ్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న కాబిల్ సినిమాలో హృతిక్ రోషన్ ఒక అంధుడి పాత్ర పోషిస్తున్నాడు. హృతిక్ సరసన యామీ గౌతమ్ (ఈమెదీ అంధురాలి పాత్రే) నటిస్తున్న ఈ సినిమాలో అతడు చేతికి వాచీ పెట్టుకుంటాడు. ఈ సినిమా ప్రోమో విడుదల అయినప్పటి నుంచి.. అంధుడి చేతికి వాచీ ఉంటే ఉపయోగం ఏంటి.. అతడు అందులో టైమ్ ఎలా చూసుకుంటాడంటూ దాని మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి దర్శకుడు సంజయ్ గుప్తా గట్టి సమాధానమే ఇచ్చారు.
'' హృతిక్ కాబిల్ సినిమాలో అంధుడైనా వాచీ ఎందుకు పెట్టుకున్నాడని చాలామంది అడుగుతున్నారు. అయితే వాళ్లు తమ తెలివితేటలు కొంచెం పెంచుకోవాలి. అంధుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాచీలున్నాయి. వాటిని బ్రెయిలీ వాచీలు అంటారు. అలాగే చూడలేని వారు వాడేందుకు మాట్లాడే వాచీలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో హృతిక్ చేతికి పెట్టుకునేది అలాంటి వాచీయే. మేం హోంవర్కు చేసిన తర్వాతే సినిమా తీస్తున్నాం. సినిమా చూసిన తర్వాత.. ఈ వాచీకి సినిమాలో ఎంత ముఖ్యమైన పాత్ర ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు దాని గురించి మీకు చెప్పలేను. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు చూస్తే.. వేరేవాళ్లు ఎంత కష్టపడి పనిచేసినా, దాన్ని వెంటనే నీరుగార్చడానికి జనం సిద్ధంగా ఉంటారని అర్థమవుతోంది'' అని ఆయన అన్నారు.
Advertisement
Advertisement