Wrist watch
-
అతి పలుచని వాచీ
ప్రపంచంలోనే అతి పలుచని చేతి గడియారాన్ని తయారు చేయడానికి యూరోపియన్ హోరాలజీ దిగ్గజాలన్నీ తెగ పోటీ పడుతుంటేం రష్యాకు చెందిన ఓ స్వతంత్ర వాచ్ మేకర్ ఆ అద్భుతాన్ని సాధించేశాడు. ప్రతిష్ఠాత్మక అకాడెమీ హోర్లోగెర్ డెస్ క్రిటెపెండెంట్స్ ఇండిపెండెంట్స్లో ఏకైక రష్యన్ సభ్యుడైన కాన్స్టాంటిన్ చైకిన్ అనే వ్యక్తి అత్యంత పలుచనైన చేతి గడియారాన్ని రూపొందించారు. దీని మందం కేవలం 1.65 మిల్లీమీటర్లు. బరువైతే 13.3 గ్రాములే! ఆ లెక్కన ప్రపంచంలోనే అతి తేలికైన గడియారమూ ఇదే. గత వారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘జెనీవా వాచ్ డేస్ ఫెయిర్’లో ఈ వాచీని ప్రదర్శించారు. స్టెయిన్లెస్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ వాడటంతో ఇది తేలిగ్గా ఉన్నా చాలా దృఢంగా ఉంటుంది.కాగితం ముక్కంత పలుచన.. విశ్వసనీయమైన, ఖచి్చతమైన, ధరించేంత మన్నికైన అ్రల్టా–స్లిమ్ గడియారాలను ఉత్పత్తి చేయడం ప్రపంచంలోని గడియారాల తయారీదారులకు ఓ సవాలుగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో పలుచని గడియారాల తయారీ పోటీ ఊపందుకుంది. స్విస్ బ్రాండ్ పియాజెట్ 2018లో 2 మిల్లీమీటర్ల మందం కలిగిన గడియారాన్ని తయారు చేసింది. ఇది రెండేళ్ల తరువాత ఉత్పత్తిలోకి వచి్చంది. లగ్జరీ దిగ్గజం బుల్గారి కేవలం 1.8 మిల్లీమీటర్ల మందంతో వాచీని తెచ్చింది. వీటిని తలదన్నుతూ వాచ్ మేకర్ రిచర్డ్ మిల్లే 2022లో కాగితం ముక్కంత పలుచనైన గడియారాన్ని తయారు చేసింది. దాని ఖరీదు 500,000 డాలర్లకు పై చిలుకే! పాకెట్ వాచ్ ప్రేరణతో... 2003లో తన పేరుతోనే వాచ్ మేకింగ్ బ్రాండ్ స్థాపించిన చైకిన్ 20 ఏళ్ల క్రితం 19వ శతాబ్దానికి చెందిన బాగ్నోలెట్ పాకెట్ వాచ్‌ను చూసి పలుచని వాచీలపై ఆసక్తి పెంచుకున్నాడట. సొంతంగా అల్ట్రాథిన్ వాచ్ డిజైన్ చేయాలని ఒక క్లయింట్ సవాలు చేయడంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు తయారు చేసిన బుల్లి వాచీకి మున్ముందు నీలమణి లేదా వజ్రాలను పొదిగే ఆలోచన ఉందట! అనేక పేటెంట్లకు దరఖాస్తులు చేసినా ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏప్రిల్‌లో జెనీవాలో జరిగే వాచ్స్ అండ్ వండర్స్ ట్రేడ్ షోలో తన డిజైన్ తుది వెర్షన్‌ను సమరి్పస్తానని చెబుతున్నాడు. అప్పటికల్లా తన డిజైన్ మరింత కచ్చితత్వం, పవర్ సంతరించుకుంటుందని చెప్పాడు. ఈ వాచీకి ఇంకా ధర నిర్ణయించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చేతివాచీని పోగొట్టుకున్న పైలట్.. ఐదు నిముషాల్లో దక్కిందిలా!
హనా మొహ్సిన్ ఖాన్ అనే కమర్షియల్ పైలట్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తన రిస్ట్‌వాచీని పోగొట్టుకున్నారు. అయితే దానిని సురక్షితంగా అందజేసిన ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. హనా మొహ్సిన్ ఖాన్ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపును సందర్శించారు. భద్రతా తనిఖీ సమయంలో తన చేతి గడియారాన్ని తీసినప్పుడు.. అక్కడే మరచిపోయారు. కొద్దిసేపటి తరువాత తన గడియారం మిస్సయిన సంగతి గ్రహించారు. తన గడియారం పోయినట్లేనని, ఇక దొరకదని మొదట్లో అనుకున్నారు. అయితే మిస్సయిన చేతివాచీ కోసం ఒకసారి ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో ఆమె దుబాయ్‌లోని గ్రౌండ్ స్టాఫ్‌ను సంప్రదించారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్కి ఈ-మెయిల్ పంపారు. ఈ నేపధ్యంలో ఆ డిపార్ట్మెంట్ బృందం ఆమె రిస్ట్‌వాచీని కనుగొంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆమె తన వాచీని తిరిగి తీసుకోగలిగారు. దీంతో లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్ బృందాన్ని ఆమె అభినందించారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు. ఈ పోస్టును చూసిన యూజర్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తాము మిస్సయిన, తిరిగి పొందిన వస్తువుల గురించిన వివరాలను షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి! Last month while operating a Dubai back flight I had gone to the duty free. During the security check I had taken my watch off and forgot to pick it up. I had thought it was forever lost when I was flying back and discovered that I no longer had it. I contacted my ground staff in… pic.twitter.com/GDP2vpBcsO — Hana Mohsin Khan | هناء (@girlpilot_) September 4, 2023 -
వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులను తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పసిగట్టి పట్టేస్తుంటారు. అలాంటి సంఘటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకున్న చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. మొత్తం ఏడు గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వజ్రాలు పొదిగిన వైట్ గోల్డ్ వాచ్ విలువ ఏకంగా రూ.27 కోట్లు ఉంటుందటా.. అత్యంత విలువైన ఏడు చేతి గడియారాలని అక్రమంగా తీసుకొస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్లెట్, ఐఫోన్ 14ప్రోను సైతం సీజ్ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్థ జాకబ్ అండ్ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని, ఈ స్థాయిలో పట్టుకోవటం ఇదే తొలిసారిగా వెల్లడించారు. 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఎల్జీ సాబ్ జస్ట్ చిల్.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్ ట్వీట్ -
హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ముంబై: ఐపీఎల్ పుణ్యమా అని రాత్రికిరాత్రి స్టార్లుగా మారిపోయిన క్రికెటర్లలో పాండ్యా సోదరులు(హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య) ముందువరుసలో ఉంటారు. వీరిద్దరూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాండ్యా సోదరులు ముంబై ఇండియన్స్ జట్టులో చేరడంతో వారి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ ఫ్లాట్లు, విలాసవంతమైన జీవన శైలి, విలువైన కార్లు, బ్రాండెడ్ వస్తువులకు లెక్కే లేదు. తాజాగా, పాండ్యా సోదరుల్లో చిన్నవాడైన హార్ధిక్ పాండ్య కళ్లు బైర్లు కమ్మే రేట్ ట్యాగ్ ఉన్న రిస్ట్ వాచ్‌ని సొంతం చేసుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు. హార్ధిక్.. పటేక్ ఫిలిప్పీ నాటిలస్ ప్లాటినమ్ 5711 అనే బ్రాండెడ్ వాచ్‌ను కొనుగోలు చేశాడు. ఈ వాచీ డయల్ చుట్టూ అత్యంత అరుదైన 32 పచ్చ మరకత రాళ్లను అమర్చారు. వాచ్ మొత్తం ప్లాటినంతో తయారైంది. దీని ధర రూ.5 కోట్ల పైమాటే అంటే నమ్మగలరా. ఇది నిజం. ఇది 5711 రేంజ్ అరుదైన వాచ్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచీల్లో ఇదొకటి. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని హార్ధిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చిన పాక్ బౌలర్ -
50 లక్షల వాచ్ పెట్టావ్.. మాస్క్ మాత్రం మరిచిపోయావ్!
లండన్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కూతురు వామికాతో కలిసి పలు పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన అప్డేట్స్ను అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క తన సెల్ఫీని షేర్ చేసింది. ఆ ఫోటోలో తన స్టైలిష్ హెయిర్ కట్‌తో బ్లాక్ అండ్ వైట్ టాప్ ధరించడంతో పాటు చేతికి ఖరీదైన వాచ్‌ను ధరించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె ధరించిన వాచ్ ధర తెలిస్తే నోరువెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆమె పెట్టుకున్న రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే ధర 65,879 డాలర్లు (అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 50లక్షలు). ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆమె పెట్టుకున్న ఖరీదైన వాచ్ గురించి అభిమానులు మాట్లాడుకుంటునే ట్రోల్ చేశారు. ''ఖరీదైన వాచ్ ధరించావు బాగానే ఉంది.. మాస్క్ మాత్రం మరిచిపోయావు'' అంటూ ట్రోల్ చేశారు. కాగా మంగళవారం (జులై 13న) వారి కుమార్తె వామికా 6వ నెలకు అడుగుపెట్టడంతో ఒక పార్క్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అనుష్క చివరి సారిగా 2018లో జీరో సినిమాలో నటించింది. ఇందులో షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా నటించారు. ఆ తరువాత నిర్మాతగా మారిన అనుష్క శర్మ పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి, ఓటీటీలో విడుదల చేసింది. ఇందులో పటల్ లోక్, బుల్బుల్ సిరీస్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఖాలా అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. కాగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. -
రికార్డుల బ్రాండ్ బాబు.. సంపాదనెంతో తెలుసా?
సెలబ్రిటీలను ఆరాధించడానికి.. అభిమానించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనక్కర్లేదు. నచ్చితే.. బ్లయిండ్‌గా ఫాలో అయిపోవడమే. ఫుట్‌బాల్ ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రొనాల్డో.. సోషల్ మీడియాలోనూ రికార్డుల బ్రేకర్ కూడా. వెబ్‌డెస్క్: సాకర్ వీరుడు రొనాల్డోకు ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 92.4 మిలియన్లు. ఫేస్బుక్లో 148 మిలియన్ల ఫాలోవర్లు. ఇక ఈమధ్యే ఇన్‌స్టాలో 30 కోట్ల మిలియన్ ఫాలోవర్స్ రికార్డు దక్కించుకున్నాడు. కేవలం ఇన్‌స్టా అకౌంట్ ద్వారానే దాదాపు 2 మిలియన్ల పౌండ్ల ఆదాయం వెనకేసుకుంటున్నాడు. అతను వేసే ఒక్కో పోస్టుకి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటాడని తెలుస్తోంది(మోడల్ కైలీ జెన్నర్ పోస్ట్‌కి ఎనిమిది కోట్లకుపైనే). ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో ఆటగాడు ఇతనే. మరో విశేషం ఏంటంటే.. లాక్డౌన్ టైంలోనూ అత్యధికంగా సంపాదించిన అథ్లెట్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. కాస్ట్లీ యవ్వారం ఈ జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడి.. విలాసాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎప్పుడూ ఒకే తరహా డైట్‌ను ఫాలో అయ్యే 36 ఏళ్ల రొనాల్డో.. ఫిట్నెస్ విషయంలో అభిమానులకు ఆరాధ్యుడే. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో ఒక రోలెక్స్ వాచీతో హాజరయ్యాడు. ఇక అభిమానులు ఊరుకుంటారా? దానిని స్కాన్ చేసి ధరెంతో కనుక్కునే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా ఆ వాచీ కంపెనీ ‘స్విస్’.. దాని ధరెంతో ప్రకటించింది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారుచేసిన వాచీ అది. అందులో 30 క్యారెట్ల వైట్ డైమండ్లు పొదిగిన ఆ వాచీ ఖరీదు 3,71,000 పౌండ్లు (మన కరెన్సీలో 3 కోట్ల 82 లక్షలపైనే) విలువ ఉందని ప్రకటించింది. పైగా ఇలాంటి పీస్ ఇప్పటివరకు ఈ ఫుట్‌బాల్ స్టార్ దగ్గర మాత్రమే ఉందని వెల్లడించింది. బ్రాండ్ బాబు రొనాల్డ్ బ్రాండ్ అంబాసిడరింగ్ వాల్యూ ఏటా దాదాపు 105 మిలియనల డాలర్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అందులో నైక్ నుంచే 45 మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇక సొంతంగా సీఆర్7 బ్రాండ్ ఉంది. ఓవరాల్ ఆటగాళ్ల ఆదాయం జాబితాలో మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కనోర్ మెక్‌గ్రెగోర్(180 మిలియన్ల డాలర్లు), లియోనెల్ మెస్సీ(130 మిలియన్ల డాలర్లు).. ఉండగా మూడో ప్లేస్‌లో రొనాల్డో 120 మిలియన్ల డాలర్లతో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి మెస్సీ కంటే టోటల్ ఆదాయంలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. బ్రాండ్ ఆదాయంలో ఓ అడుగు ముందే ఉన్నాడు రొనాల్డో. ఫిబ్రవరి 5, 1985 సాంటో అంటోనియోలో పుట్టాడు రొనాల్డో. స్కూల్ ఎడ్యుకేషన్‌లో పెద్దగా చదువుకోని రొనాల్డో.. 17వ ఏట స్పోర్ట్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. ది సుల్తాన్ ఆఫ్ ది స్టెప్ఓవర్ బిరుదు అందుకున్నాడు. మెర్చ్ రొమిరో, గెమ్మా అటిక్సన్, ఇరినా షాయ్క్లతో డేటింగ్ చేసి.. మోడల్ జార్జినా రోడ్రిగుజ్ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు. చదవండి: రొనాల్డో వల్లే కోకా కోలా 29వేల కోట్లు నష్టపోయిందా?.. అందులో నిజమెంత? -
అక్షరాలా రూ. 7 కోట్లు
పారిస్: అగ్రశ్రేణి క్రీడాకారులు తమ ఆటతోపాటు తమ అలంకారాలతో కూడా అందరి దృష్టిని ఆకర్షించడం కొత్త కాదు. ఇప్పుడు ఇదే జాబితాలో టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కూడా చేరాడు. 20వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకుపోతున్న నాదల్ తన కుడిచేతికి ధరించిన గడియారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చేతి గడియారం ఖరీదు ఏకంగా 10 లక్షల 50 వేల డాలర్లు (సుమారు రూ. 7 కోట్ల 67 లక్షలు) కావడం విశేషం. ఇంత ఖరీదైన రిస్ట్ వాచ్‌ను ఒక టెన్నిస్ ఆటగాడు గతంలో ఎప్పుడూ ధరించలేదు. ప్రతిష్టాత్మక కంపెనీ ‘రిచర్డ్ మిల్లే’ నాదల్‌తో తమకు ఉన్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వాచీని ప్రత్యేకంగా తయారు చేసింది. ‘ఆర్ఎం 27–04 టోర్బిలాన్ రాఫెల్ నాదల్’ పేరుతో సదరు కంపెనీ ఇలాంటి 50 చేతి గడియారాలను మాత్రమే రూపొందించి మార్కెట్లో ఉంచింది. టైటాకార్బ్ టెక్నాలజీతో కార్ల తయారీలో వాడే మెటీరియల్‌ను దీనికి ఉపయోగించారు. అదీ ఇది అని కాకుండా సాంకేతికపరంగా లెక్కలేనన్ని ప్రత్యేకతలు ఈ గడియారంలో ఉన్నాయన్న రిచర్డ్ మిల్లే... నాదల్లాంటి దిగ్గజం మణికట్టుకు ఇది కనిపించడం తమకు గర్వకారణమని పేర్కొంది. ఆట ఓడాక ఆనందం... ‘చాలా అద్భుతంగా ఉంది’, ‘నా జీవితంలో కచ్చితంగా ఇదే అత్యుత్తమ క్షణం’... సాధారణంగా ఇలాంటి మాటలు విజేతగా నిలిచిన ఆటగాడి నోటి నుంచి వినిపిస్తుంటాయి. కానీ ఒక మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా ఎవరైనా ఇలా మాట్లాడితే ఆశ్చర్యపడాల్సిందే. అమెరికా యువ ఆటగాడు సెబాస్టియన్ కోర్డా ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో రాఫెల్ నాదల్ చేతిలో ఓడిన ఇలాంటి ‘తన్మయత్వానికి’ గురయ్యాడు. అందుకు కారణం అతను చిన్ననాటి నుంచి నాదల్ వీరాభిమాని కావడమే. ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటంటే నాదల్ మాత్రమే. అతను ఏ టోర్నీలో ఆడినా, ఎవరితో తలపడినా ప్రతీ మ్యాచ్‌ను నేను చూశాను. నా పిల్లికి కూడా అతని పేరే పెట్టుకున్నాను. అలాంటిది క్లే కోర్టులో అతనికి ప్రత్యర్థిగా ఆడగలనని అస్సలు ఊహించలేదు. అందుకే ఇది నాకు మరచిపోలేని మధుర క్షణం’ అని 20 ఏళ్ల సెబాస్టియన్ చెప్పాడు. సెబాస్టియన్ తండ్రి పెటర్ కోర్డా 1998లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలవగా, 1992 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు వచ్చాడు. అయినా సరే నాదల్ అంటేనే సెబాస్టియన్ పడి చస్తాడు. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా నాదల్ వద్దకే వెళ్లి అడిగి మరీ టీ షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకొని సంబరపడిపోయాడు. మరోవైపు సెబాస్టియన్ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని నాదల్ ఆకాంక్షించాడు. సెబాస్టియన్ కోర్డా -
174 కోట్లకు రిస్ట్ వాచ్ వేలం!
న్యూఢిల్లీ : ‘పాటక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ చిమ్’గా వ్యవహరించే అత్యంత క్లిష్టమైన, ఖరీదైన చేతి గడియారాన్ని ‘క్రిష్టీ’ వేలం వేయగా ఓ ప్రైవేటు బిడ్డర్ ఏకంగా 24.2 మిలియన్ డాలర్ల (దాదాపు 174 కోట్ల రూపాయలు)కు కొనుగోలు చేశారు. జెనీవాలోని డెస్ బెర్గూస్ నగరంలోని ఫోర్ సీజన్ హోటల్ నుంచి ఓ ప్రైవేట్ బిడ్డర్ దీనిని కొనుగోలు చేశారు. వాస్తవానికి దీనికి రెండు మిలియన్ పౌండ్ల ధర పలక వచ్చని వేలం నిర్వాహకులు అంచనా వేశారు. ఎవరి ఊహలకు అందనంతగా ధర పలకడం ఆశ్చర్యమని, ప్రపంచంలోనే ఇప్పటి వరకు గడియారాల వేలంలో ఇంత ధర పలకడం ఇదే మొదటి సారని, ఇది ప్రపంచ రికార్డని వారు వ్యాఖ్యానించారు. 2017లో హాలివుడ్ నటుడు పాల్ న్యూమన్ తన డెటోనా చేతి గడియారాన్ని వేలం వేయగం 13.5 మిలియన్ పౌండ్లకు (దాదాపు 124 కోట్ల రూపాయలు) అమ్ముడు పోయింది. అప్పటికి అదే ప్రపంచ రికార్డు. ఈ పాటక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ గడియారాన్ని తయారు చేయడం చాలా సంక్లిష్టమట. ఇందులో మరో విశేషముంది. దీని డయల్ స్క్రీన్‌ను నలుపులోకి గులాబీ రంగులోకి ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఈ గడియారం వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బులను చారిటీకే వెళతాయని జెనీవాలోని క్రిష్టీ వేలం సంస్థ యజమాని సబైన్ కెగెల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డీఎండీగా పిలిచే మజిల్ డిజార్డర్‌తో బాధ పడుతున్న రోగులకు వైద్య చికిత్సలు అందించడం కోసం పాటక్ ఫిలిప్పీ సహా 50 ఖరీదైన గడియారాలు వేలానికి వచ్చాయని, వాటన్నింటిని దాతలు ఉచితంగా ఇచ్చారని, తాము కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే వేలం వేశామని సబైన్ కెగెల్ వివరించారు. 174 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బిడ్డర్ వివరాలను తెలియజేయడానికి క్రిస్టీ నిర్వాహకులు నిరాకరించారు. -
అంధుడైన హీరోకు వాచీ ఎందుకు?
సంజయ్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న కాబిల్ సినిమాలో హృతిక్ రోషన్ ఒక అంధుడి పాత్ర పోషిస్తున్నాడు. హృతిక్ సరసన యామీ గౌతమ్ (ఈమెదీ అంధురాలి పాత్రే) నటిస్తున్న ఈ సినిమాలో అతడు చేతికి వాచీ పెట్టుకుంటాడు. ఈ సినిమా ప్రోమో విడుదల అయినప్పటి నుంచి.. అంధుడి చేతికి వాచీ ఉంటే ఉపయోగం ఏంటి.. అతడు అందులో టైమ్ ఎలా చూసుకుంటాడంటూ దాని మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి దర్శకుడు సంజయ్ గుప్తా గట్టి సమాధానమే ఇచ్చారు. '' హృతిక్ కాబిల్ సినిమాలో అంధుడైనా వాచీ ఎందుకు పెట్టుకున్నాడని చాలామంది అడుగుతున్నారు. అయితే వాళ్లు తమ తెలివితేటలు కొంచెం పెంచుకోవాలి. అంధుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాచీలున్నాయి. వాటిని బ్రెయిలీ వాచీలు అంటారు. అలాగే చూడలేని వారు వాడేందుకు మాట్లాడే వాచీలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో హృతిక్ చేతికి పెట్టుకునేది అలాంటి వాచీయే. మేం హోంవర్కు చేసిన తర్వాతే సినిమా తీస్తున్నాం. సినిమా చూసిన తర్వాత.. ఈ వాచీకి సినిమాలో ఎంత ముఖ్యమైన పాత్ర ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు దాని గురించి మీకు చెప్పలేను. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు చూస్తే.. వేరేవాళ్లు ఎంత కష్టపడి పనిచేసినా, దాన్ని వెంటనే నీరుగార్చడానికి జనం సిద్ధంగా ఉంటారని అర్థమవుతోంది'' అని ఆయన అన్నారు. -
వాచీ కావాలా నాయనా?
చేతికి పెట్టుకునే వాచీని ఎంత పెట్టి కొంటారు? మామూలుగా అయితే కొన్ని వందలు.. అదే మీరు బాగా ముచ్చటపడి, ఏ పెళ్లికో.. లేదా ఇతర అకేషన్లకో అయితే కొన్ని వేలు పెట్టి కొంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న వాచీ కొనాలంటే మాత్రం లక్షలు కూడా చాలవు.. అక్షరాలా దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు వెచ్చించాలి! అలాగని ఇందులో ఏవైనా వజ్రాలు, రత్నాలు ఉన్నాయా అంటే అవీ లేవు. అయినా కూడా దాని ఖరీదు దాదాపు రూ. 5.50 కోట్లు. గ్రూబెల్ ఫోర్సీ క్వాడ్రాపుల్ టర్బిలిన్ అనే కంపెనీకి చెందిన ఈ వాచీలో కేవలం నాలుగంటే నాలుగే మోడళ్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఏడాదికి కేవలం ఐదు నుంచి ఆరు వాచీలను మాత్రమే తయారుచేస్తుందట. అయినా కూడా ఈ వాచీకి ఎందుకు అంత ధర పెట్టారో మాత్రం తెలియడంలేదు. నిజానికి అంత మొత్తం వెచ్చిస్తే రోలెక్స్ కంపెనీకి చెందిన సబ్‌మెరైన్ అనే మోడల్ వాచీలు వంద వస్తాయి. అదే కాసియో జీ-షాక్స్ అయితే పదివేల వాచీలు వస్తాయి. ఇంకా మాట్లాడితే.. న్యూజెర్సీ శివార్లలో బ్రహ్మాండమైన 5 బెడ్రూంల ఇల్లు కూడా వచ్చేస్తుంది. అసలీ వాచీ ఎలా తయారు చేయాలన్న ఆలోచన ఫైనల్ కావడానికే ఐదేళ్లు పట్టిందని, ఇందులో నాలుగు టర్బిలిన్ కేజెస్ పెట్టామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దానివల్ల వాచీ పెర్ఫార్మెన్సు గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. మొత్తానికి ఇలాంటి విశేషాలన్నీ ఉండబట్టే ఈ వాచీకి ఐదున్నర కోట్ల ధర పెట్టారన్నమాట. -
ఆవిష్కరణం: ఆడవాళ్ల సౌకర్యం కోసమట!
రిస్ట్‌వాచ్‌ను కట్టుకోవడంలోనూ, దాంతో టైమ్ చూసుకోవడంలోనూ ఆడవాళ్లకూ, మగవాళ్లకూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సంప్రదాయం ఉంది. ‘యూని సెక్స్ థియరీ’ పాపులర్ అయిన నేటి రోజుల్లో కూడా వాచ్‌ల విషయంలో ఇంత వైరుధ్యాలు ఉండటానికి కారణం మూలాల్లోనే ఉంది! అసలు ప్రపంచంలో తొలిసారి రిస్ట్ వాచ్ రూపొందించింది ఒక మహిళ కోసమేనట. అంత వరకూ ‘టైమ్ కీపింగ్ డివైజ్’లను జేబులో వేసుకొని తిరిగే సంప్రదాయం ఉండేది. అయితే 1868లో పటెక్ ఫిలిప్పీ అనే స్విస్ వాచ్ మ్యానుఫ్యాక్చరర్ హంగేరీకి చెందిన కొస్కోవిజ్ అనే మహిళ కోసం తొలిసారిగా రిస్ట్‌వాచ్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. చరిత్రలో ఇదే తొలి రిస్ట్‌వాచ్ అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేర్కొన్నారు. అది ఆమెకు చాలా బాగా నచ్చడంతో వాచ్ మహిళల ఆభరణంలో ఒకటైంది. అంత వరకూ బ్రాస్లైన్ను చేతికి ధరించే మహిళలు దానికి ప్రత్యామ్నాయంగా వాచ్‌లను ధరించడం మొదలైంది. అలా మహిళలకే పరిమితం అయిన రిస్ట్‌వాచ్ బ్రెజిల్‌కు చెందిన అల్బర్టో శాంటోస్ అనే పరిశోధకుడి పుణ్యామా అని పురుషులకు కూడా అలవాటుగా మారింది. 20 శతాబ్దం వాడైన శాంటోస్ తన పరిశోధనల్లో భాగంగా అనుక్షణం టైమ్ చూసుకోవాల్సి వచ్చేది. దీంతో తన కోసం చేతికి కట్టుకొనేలా ఒక వాచ్‌ను రూపొందించాలని శాంటోస్ తన స్నేహితుడైన లూయిస్ కార్టియర్ అనే పరిశోధకుడిని కోరాడట. అతడు తన స్నేహితుడి కోసం ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో రిస్ట్‌వాచ్‌ను రూపొందించాడు. దీంతో రిస్ట్‌వాచ్‌లు పురుషులకు, మహిళలకు అంటూ భిన్నమైనవిగా మారాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పురుషులు వాచ్‌లను మణికట్టుకు కట్టుకోవడం మొదలైంది. అలా సైనికులతో మొదలైన ఈ రిస్ట్‌వాచ్ ధారణ క్రమంగా విస్తృతమైంది.