హనా మొహ్సిన్ ఖాన్ అనే కమర్షియల్ పైలట్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తన రిస్ట్‌వాచీని పోగొట్టుకున్నారు. అయితే దానిని సురక్షితంగా అందజేసిన ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.
హనా మొహ్సిన్ ఖాన్ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపును సందర్శించారు. భద్రతా తనిఖీ సమయంలో తన చేతి గడియారాన్ని తీసినప్పుడు.. అక్కడే మరచిపోయారు. కొద్దిసేపటి తరువాత తన గడియారం మిస్సయిన సంగతి గ్రహించారు. తన గడియారం పోయినట్లేనని, ఇక దొరకదని మొదట్లో అనుకున్నారు.
అయితే మిస్సయిన చేతివాచీ కోసం ఒకసారి ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో ఆమె దుబాయ్‌లోని గ్రౌండ్ స్టాఫ్‌ను సంప్రదించారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్‌మెంట్‌కి ఈ-మెయిల్ పంపారు. ఈ నేపధ్యంలో ఆ డిపార్ట్‌మెంట్ బృందం ఆమె రిస్ట్‌వాచీని కనుగొంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆమె తన వాచీని తిరిగి తీసుకోగలిగారు. దీంతో లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్‌మెంట్ బృందాన్ని ఆమె అభినందించారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు. ఈ పోస్టును చూసిన యూజర్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తాము మిస్సయిన, తిరిగి పొందిన వస్తువుల గురించిన వివరాలను షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి!
Last month while operating a Dubai back flight I had gone to the duty free. During the security check I had taken my watch off and forgot to pick it up.
— Hana Mohsin Khan | هناء (@girlpilot_) September 4, 2023
I had thought it was forever lost when I was flying back and discovered that I no longer had it.
I contacted my ground staff in… pic.twitter.com/GDP2vpBcsO
Comments
Please login to add a commentAdd a comment