డ్రగ్స్ కేసులో బాలీవుడ్ ‘బాద్‌షా’ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్‌పై అక్టోబర్ 2 రాత్రి పోలీసులు దాడి చేయగా ఈ పార్టీలో ఆర్యన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి షారుక్‌కు, ఆయన కుటుంబానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే షారుక్‌కు సల్మాన్, హృతిక్ రోషన్, పూజ బేడీతో పాటు పలువురు మద్దతు తెలిపారు.
చదవండి: హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
ఇదిలా ఉంటే అరెస్ట్ అయినప్పటీ నుంచి ఆర్యన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆర్యన్ మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటిషన్‌ను పదే పదే తిరస్కరిస్తోంది. దీంతో బెయిల్ దొరక్క ఆర్యన్‌కు జైలు కూడు తప్పడం లేదు. ఈ క్రమంతో తాజాగా మరో సెలబ్రిటీ షారుక్‌కు మద్దతుగా నిలిచారు. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ట్విటర్ ద్వారా షారుక్‌కు మద్దతు తెలిపారు.
చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్ రోడ్డు జైల్లో ఆర్యన్‌ను కలుసుకున్న షారుక్
ఈ మేరకు సంజయ్ గుప్తా ట్వీట్ చేస్తూ.. ఆర్యన్ అరెస్టు విషయంలో నిశబ్ధంగా ఉన్న పలువురు బాలీవుడ్ పెద్దలను ఆయన ప్రశ్నించారు. ‘షారుక్‌ఖాన్ సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతీ విషయంలో షారుక్ ముందుంటారు. అలాంటి ఆయన సంక్షోభ పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటమంటే దానికంటే అవమానకరమైన విషయం మరొకటి లేదు’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ‘ఈ రోజు షారుక్ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్లు లేదా మీ వాళ్లు ఉండోచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
చదవండి: షారుఖ్ బీజేపీలో చేరితే డ్రగ్స్ కాస్తా షుగర్ అవుతుంది: ఛగన్ భుజ్‌భల్
Shahrukh Khan has and continues to give jobs and livelihoods to thousands in the film industry.
— Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021
He has always stood up for every cause for the film industry.
And the astute silence of the same film industry in his moment of crisis is nothing short of SHAMEFUL.
Aaj uska beta hai, kal mera ya tumhaara hoga…
— Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021
Tab bhi issi buzdalli se chup rahoge???
Comments
Please login to add a commentAdd a comment